విజయవాడ నుండి రేపల్లె కరకట్ట వైపు వెళ్లేందుకు ప్రతి 40 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని ఏపీ ఆర్టీసీ అధికారులు విజయవాడ బస్టాండ్ లో బోర్డు ఏర్పాటు చేశారు. అయితే వాస్తవానికి ఇది భిన్నంగా ఉంది. ఇక అసలు విషయాని కొస్తే.. 11 అక్టోబర్ 2024న కరకట్ట వైపు వెళ్ళేందుకు ప్రయాణికులు సుమారు 3 గంటలు వేచి చూసినప్పటికీ బస్సులు అందుబాటలో లేకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ విషయంపై ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను సంప్రదించగా..వస్తది వేయిట్ చేయండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో ఆర్టీసీ అధికారుల తీరుపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.