ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వినియోగదారుడు తన న్యూహోలాండ్ Excel 4710 ట్రాక్టర్ సర్వీస్ కోసం 5 డిసెంబర్ 2022 రోజు కంపెనీని సంప్రదించాడు. అయితే కంపెనీ సర్వీస్ టికెట్ ఓపెన్ చేసి సంబంధిత ఆథరైజ్డ్ డీలర్ అయినా KS Tractors వరంగల్ కు కేటాయించి 48 గంటల్లో సర్వీస్ ఇస్తారని హామీ ఇచ్చింది. కానీ ks ట్రాక్టర్స్ డీలర్ సర్వీస్ ఇవ్వలేదు. 29 డిసెంబర్ 2022 రోజున శ్రీ లక్ష్మీ మోటార్స్ సిద్దిపేట, శ్రీలత ట్రాక్టర్స్ చొప్పదండి డీలర్లచే సర్వీస్ చేయబడింది. అయితే న్యూ హోలాండ్ కంపెనీ ఉత్పత్తులకు బదులు మార్కెట్లో దొరికే వేరే ఇతర నాసిరకం ఉత్పత్తులతో సర్వీస్ ఇచ్చారు. అయితే వినియోగదారుడు కంపెనీ ఉత్పత్తుల చేత సర్వీస్ ఇవ్వాలని కోరగా స్టాక్ లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు.
14 జూన్ 2023 రోజున KS TRACTORS డీలర్ చే మరొక సర్వీస్ ఇవ్వబడింది. అయితే ట్రాక్టర్ వారంటీ ప్రకారం ఫ్రీ లేబర్ సర్వీస్ అందించకుండా 500 రూపాయలు అక్రమంగా వసూలు చేశారు. అంతేకాదు లేబర్ ఫ్రీ సర్వీస్ ఇచ్చినట్లు జాబ్ కార్డు లో ఎంటర్ చేశాడు.
ట్రాక్టర్ సర్వీస్ కోసం అనేక సార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ ఫలితం లేదు. వినియోగదారుడు 25 రోజులు తన ట్రాక్టర్ను వ్యవసాయ పనులకు ఉపయోగించుకోలేకపోయాడు దీంతో తన జీవనోపాధి మీద తీవ్ర ప్రభావం చూపింది. న్యూహోలాండ్ ట్రాక్టర్స్ కంపెనీ మరియు ఈ ముగ్గురు డీలర్ల నిర్లక్ష్యం,సేవాలోపం వల్ల వినియోగదారుడికి మానసిక వేదన మరియు భారీ ఆర్థిక నష్టం జరిగింది. పైగా వారంటీ ప్రకారం సర్వీస్ ఇవ్వకుండా లేబర్ ఛార్జ్ పేరిట అక్రమంగా డబ్బులు వసూలు చేసినందుకు గాను వినియోగదారుడు వరంగల్ కన్జ్యూమర్ ఫోరంలో కేస్ ఫైల్ చేశాడు.
అయితే న్యూ హోలాండ్ ట్రాక్టర్స్ కంపెనీకి సంబంధించిన వారిపై కన్జ్యూమర్ ఫోరంలో ఫిర్యాదులు కొత్తేమి కాదు. CC/10/2022 లో OP1 న్యూహోల్యాండ్ ట్రాక్టర్స్ కంపెనీకి సంబంధించిన అప్పటి ఆథరైజ్డ్ డీలర్ మనీషా మోటార్స్ కరీంనగర్ కు నిర్లక్ష్యం,సేవాలోపం పై వరంగల్ జిల్లా కన్జ్యూమర్ ఫోరం 40 వేల ఫైన్ విధించింది. మానసిక వేదన గాను మరో 5000 చెల్లించాలని ఆదేశించింది. అయితే అప్పటికే మనిషా మోటార్స్ కరీంనగర్ డీలర్షిప్ మూసివేయబడింది. OP2 అయిన CNH ఇండస్ట్రియల్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫైనాన్స్ కంపెనీకి 20 వేల ఫైన్ విధించింది. మానసిక వేదనకు గాను 5000 రూపాయలు చెల్లించాలని ఆదేశించింది.
న్యూహోలాండ్ ట్రాక్టర్ డీలర్లు నాణ్యమైన సేవలు అందించట్లేదని ఎన్ని సార్లు కంపెనీ దృష్టికి తీసుకువెళ్లిన నిర్లక్ష్య పూరిత వైఖరి అవలంబిస్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.