-
గత సంవత్సరం పత్తి ధర క్వింటాలుకు ₹14,000
-
ప్రస్తుత మద్దతు ధర కేవలం ₹7,020
-
ప్రైవేట్ వ్యాపారులు రైతుల నుండి క్వింటాలుకు ₹6,500 మాత్రమే ఇస్తున్నారు
-
ఎకరాకు రైతు పెట్టుబడి ₹30,000–₹40,000 వరకు
-
మొత్తం ఖర్చు సుమారు ₹50,000, కానీ దిగుబడి లాభం లేకుండా పోతుంది
-
రైతులు: కనీసం ₹10,000 మద్దతు ధర కావాలి
ధరలు కుప్పకూలిన పత్తి మార్కెట్
వరంగల్ : గత సంవత్సరం రికార్డు స్థాయిలో పత్తికి క్వింటాల్‌కు ₹14,000 పలికింది. ఈసారి రైతులు ఎక్కువగా పత్తి సాగు వైపు మొగ్గు చూపారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ మద్దతు ధర కేవలం ₹7,020 మాత్రమే ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!పెట్టుబడులు – లాభం లేకుండా
ఎకరా పత్తి సాగుకు సగటున ₹30,000 నుంచి ₹40,000 వరకు ఖర్చు అవుతుంది. అదనంగా పత్తి ఏరుడుకు సుమారు ₹15,000 ఖర్చు అవుతుంది. మొత్తంగా ఒక ఎకరాకు ₹50,000 ఖర్చవుతుంది. కానీ దిగుబడి కేవలం 5 నుంచి 8 క్వింటాళ్లు మాత్రమే రావడంతో రైతులకు పెట్టుబడి కూడా తిరిగి రాకుండా పోతుంది.
కౌలు రైతుల దుస్థితి
ఇక కౌలు రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి నష్టాల పాలు అవుతున్నారు. వడ్డీ భారం పెరుగుతోంది.
రైతుల డిమాండ్
ఈ నేపథ్యంలో రైతులు ప్రభుత్వం తక్షణమే స్పందించి క్వింటాల్‌కు కనీసం ₹10,000 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
Paddy : తగ్గిన యాసంగీ సాగు
Agriculture: Modi Govt Hikes MSP for Kharif Crops 2024-25
Paddy Crop: వినూత్న పద్దతిలో వరి సాగు