మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు. డిసెంబర్ 28న సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన రాయుడు, కేవలం 10 రోజుల్లోనే పార్టీకి రాజీనామా చేసినట్లు ట్వీట్ చేశారు.
రాజకీయాలకు విరామం
కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటాను. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను’ అని అంబటి రాయుడు తన అధికారిక ‘ఎక్స్’ అకౌంట్లో ప్రకటించారు.
వైసీపీ లెక్కలపై ప్రభావం
కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు వైసీపీ బలాన్ని పెంచుతారని పార్టీ భావించింది. గుంటూరు ఎంపీ టికెట్ రాయుడికి ఇస్తారని ప్రచారం జరిగినా, ఆ దిశగా ఎలాంటి హామీ రాలేదన్న కారణంగా ఆయన వెనక్కి తగ్గారని సమాచారం.
భవిష్యత్ రాజకీయ దిశపై సందేహాలు
అంబటి రాయుడు త్వరలోనే వేరే పార్టీలో చేరతారా? కాపు కమ్యూనిటీకి చెందిన రాయుడు జనసేన వైపు మొగ్గు చూపుతారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రాబోయే రోజుల్లో రాయుడు రాజకీయ భవిష్యత్తు ఏ దిశగా వెళ్తుందో ఆసక్తికరంగా మారింది.
https://x.com/rayuduambati?lang=en
READ MORE :
https://prathipakshamtv.com/ysrcp%e0%b0%b5%e0%b1%88%e0%b0%b8%e0%b1%80%e0%b0%aa%e0%b1%80-%e0%b0%ae%e0%b1%82%e0%b0%a1%e0%b1%8b-%e0%b0%9c%e0%b0%be%e0%b0%ac%e0%b0%bf%e0%b0%a4%e0%b0%be-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a1%e0%b1%81%e0%b0%a6/
