హైదరాబాద్, సెప్టెంబర్ 25, 2025: హైదరాబాద్ విశ్వవిద్యాలయం (యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్) రసాయన శాస్త్ర విభాగం సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డు (SERB) నిధులతో నడుస్తున్న పరిశోధనా ప్రాజెక్టులో సీనియర్ రీసెర్చ్ ఫెలో (SRF) పోస్ట్ కి దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రాజెక్ట్ శీర్షిక “మల్టికేషనిక్ పాలిమర్ ఎజ్ అనయాన్ ఎక్స్ఛేంజ్ మెంబ్రేన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్” గా ఉంది. ఈ నియామకం పూర్తిగా తాత్కాలికం.
అర్హతలు:
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఎంఎస్సీ (కెమిస్ట్రీ) పూర్తి చేసి ఉండాలి. పాలిమర్ కెమిస్ట్రీలో కనీసం రెండు సంవత్సరాలకుపైగా పరిశోధనా అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఎంపికైన అభ్యర్థికి నెలకు 42,000/- స్టైపెండ్‌తో పాటు 24% హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) అందజేయబడుతుంది. మొత్తంగా 52,080/- వేతనం లభిస్తుంది. నియామకం ఆరు నెలల కాలానికి ఉంటుంది. అవసరమైతే, పనితీరు ఆధారంగా మరో సంవత్సరం పొడిగించవచ్చు.
Thank you for reading this post, don't forget to subscribe!దరఖాస్తు విధానం:
ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ (CV) ను ప్రొఫెసర్ తుషార్ జనా (ఈమెయిల్: tusharjana@uohyd.ac.in) కు పంపాలి. ఈమెయిల్ సబ్జెక్ట్ లైన్లో తప్పనిసరిగా “Application for the post of SRF-SERB” అని పేర్కొనాలి. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30, 2025.
ఎంపికైన అభ్యర్థులను ఆన్లైన్ ఇంటర్వ్యూ కు పిలుస్తారు. ఇంటర్వ్యూ తేదీ మరియు లింక్ ఈమెయిల్ ద్వారా పంపబడుతుంది. విశ్వవిద్యాలయం ఎటువంటి TA/DA చెల్లించబోదని స్పష్టంచేసింది.
ముఖ్య గమనిక
ఈ నియామకం పూర్తిగా తాత్కాలికమైందే తప్ప, శాశ్వత ఉద్యోగానికి ఇది హామీ ఇవ్వదు.
భారతదేశం గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఫ్యూయల్ వంటి రంగాలలో దృష్టి పెట్టిన వేళ, ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆధునిక శాస్త్రీయ పరిశోధనలో తన పాత్రను కొనసాగిస్తోంది.