హైదరాబాద్: ఆధార్ కార్డు వివరాల అప్డేట్లకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త ఫీజు నిర్మాణాన్ని ప్రకటించింది. ఇది అక్టోబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చింది. ఈ రుసుములు 2028 సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తాయి.
కొత్త రుసుములు:
-
0–5 ఏళ్ల వయస్సు గల పిల్లల ఆధార్ నమోదు – ఉచితం
Thank you for reading this post, don't forget to subscribe! -
5–17 ఏళ్లలో తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ – ఉచితం
-
17 ఏళ్లు పైబడిన వారికి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ – రూ.125
-
ఇతర బయోమెట్రిక్ అప్డేట్లు – రూ.125
-
డెమోగ్రాఫిక్ అప్డేట్ (పేరు, చిరునామా, DOB, మొబైల్, ఇమెయిల్) – రూ.75
-
డాక్యుమెంట్ అప్డేట్ (POI/POA) enrolment సెంటర్లో – రూ.75
-
డాక్యుమెంట్ అప్డేట్ (myAadhaar పోర్టల్ ద్వారా, 2026 జూన్ 14 వరకు) – ఉచితం
-
ఆధార్ ప్రింట్ అవుట్ (eKYC లేదా ఇతర సాధనాల ద్వారా) – రూ.40 (ప్రస్తుతం), రూ.50 (రెండో దశలో)
పిల్లలకు ఉచిత అప్డేట్లు:
-
5–7 ఏళ్లలో, 15–17 ఏళ్లలో మొదటి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ ఉచితంగా ఉంటుంది.
-
7–15 ఏళ్ల మధ్య వయస్సులో బయోమెట్రిక్ అప్డేట్ సాధారణంగా రూ.125 అయినా, 2026 సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
UIDAI ప్రకటన
UIDAI ప్రకారం, ఈ మార్పులు సర్వీస్ నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చారు. పౌరులు ఆన్లైన్ myAadhaar పోర్టల్ ద్వారా ఉచిత సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు.