నల్గొండ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 59 జీవోను అడ్డం పెట్టుకుని పానగల్ వద్ద ఇరిగేషన్ శాఖకు సంబంధించిన సుమారు రూ 10 కోట్ల విలువ గల ప్రభుత్వ భూమి అక్రమ పద్దతిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న జర్నలిస్టులు .
మర్రి మహేందర్ రెడ్డి (నమస్తే తెలంగాణ 350 గజాలు),బూర రాము గౌడ్ (TNEWS 350 గజాలు),మార బోయిన మధుసూదన్ (ఆంధ్రజ్యోతి బ్యూరో 350 గజాలు),ముప్ప రేవన్ రెడ్డి (TV9 350 గజాలు),పసుపులేటి కిరణ్ కుమార్ (వెలుగు బ్యూరో 700 గజాలు ఇందులో 350 గజాలు సీమాంద్రకు చెందిన ప్రధాన పత్రిక బ్యూరో ది అని సమాచారం),బోయపల్లి రమేష్ గౌడ్ (RTV యూట్యూబ్ చానెల్ 350 గజాలు),క్రాంతి (ఓ యూట్యూబ్ చానెల్ 350 గజాలు),రామాజుల రెడ్డి (350 గజాలు ఈనాడు బ్యూరో దత్తు రెడ్డి భినామీ అని సమాచారం)
సుమారు 10 కోట్ల రూపాయల విలువగల భూమి అన్యాక్రాంతం అయినప్పటికీ అధికారులు గానీ జర్నలిస్టుల యాజమాన్యాలు గాని ఇప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ రిజిస్ట్రేషన్ లు రద్దు చేయాలని నల్గొండ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ సభ్యులు జిల్లా కలెక్టర్ హరి చందనకు వినతి పత్రం అందజేశారు.ప్రభుత్వాన్ని తప్పు దోవ పట్టించి,జీవో ను వైలెట్ చేసిన అక్రమార్కులపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్ట్ సంఘాల నేతలు,వివిధ పత్రికలు,ఛానెల్స్ జర్నలిస్టులు,ఫోటో,వీడియో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.