హైదరాబాద్: MANUU లో టీచింగ్ పోస్టుల భారీ భర్తీ – దరఖాస్తులు ప్రారంభం
మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ (MANUU) హైదరాబాద్, ఇటీవల తన కొత్త టీచింగ్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ (Employment Notification No. 72/2025)ని విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు 04 సెప్టెంబర్ 2025 నుండి ప్రారంభమై, 29 సెప్టెంబర్ 2025 వరకు స్వీకరించబడతాయి. హార్డ్ కాపీలు సమర్పించాల్సిన చివరి తేదీ 10 అక్టోబర్ 2025.
MANUU కేంద్ర ప్రభుత్వం స్థాపించిన ఉర్దూ భాష మరియు డిస్టన్స్ విద్యలో పేరు గాంచిన యూనివర్శిటీ. ఇది ప్రధాన క్యాంపస్ గచ్చిబౌలి, హైదరాబాద్లో ఉంది. సెంట్రల్ టీచింగ్ ఇనిస్టిట్యూట్లు, పొలిటెక్నిక్లు, ITIs, మరియు డిస్టాన్స్ & ఆన్లైన్ విద్యా కేంద్రాల ద్వారా విస్తృత శిక్షణను అందిస్తోంది.
భర్తీ విభాగాలు:
ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ (HoD) వంటి వివిధ పోస్టులు.
విభాగాలు: ఎడ్యుకేషన్, లాంగ్వేజ్ & లిటరేచర్, బోటనీ, జూలాజీ, వుమెన్స్ ఎడ్యుకేషన్, లా, బివాక్ (MIT/MLT), పొలిటెక్నిక్ Electrical & Electronics.
మొత్తం 15కి పైగా పోస్టులు విభిన్న క్యాటగిరీలలో.
అర్హతలు:
అసోసియేట్ ప్రొఫెసర్: Ph.D. + కనీసం 8 సంవత్సరాల అధ్యాపన/రిసెర్చ్ అనుభవం + 7 పబ్లికేషన్లు ఉండాలి.
ప్రొఫెసర్: Ph.D. + కనీసం 10 సంవత్సరాల అనుభవం + 10 పబ్లికేషన్లు ఉండాలి.
HoD: Ph.D. లేదా B.Tech/M.Tech + 12–15 సంవత్సరాల అనుభవం తప్పనిసరి.
అన్ని పోస్టులకీ Urdu జ్ఞానం తప్పనిసరి (X, XII, UG/PG స్థాయిలో).
సెలక్షన్ & ఇతర వివరాలు:
వయసు: 65 సంవత్సరాలు మించకూడదు.
రిజర్వేషన్లు: SC/ST/OBC/EWS/PwD ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.
దరఖాస్తు ఫారం: https://curec.samarth.ac.in
ఫీజు: ₹500 (SC/ST/PwD/Women మినహాయింపు)
హార్డ్ కాపీలు అన్ని సర్టిఫికేట్లతో సమర్పించాలి.
MANUU అధికారుల ప్రకారం, దరఖాస్తులు పూర్తిగా ఆన్లైన్లోనే అందించాలి. హార్డ్ కాపీలు నోటిఫికేషన్లో పేర్కొన్న తేదీకి ముందే అందించకపోతే దరఖాస్తు రద్దు అయ్యే అవకాశం ఉంది.
సహాయం / సందేహాలు:
ఈ-మెయిల్: help.teachingpost@manuu.edu.in
https://dde.manuu.edu.in/
-BY VEERAMUSTI SATHISH,MAJMC
READ MORE :
TG LAWCET 2025 స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం – LL.B ఖాళీ సీట్ల భర్తీ ప్రకటన విడుదల

