U-Go స్కాలర్షిప్ ప్రోగ్రాం 2025-26: యువతులకి చదువుకు ఆర్థిక సహాయం
U-Go (కేలిఫోర్నియా, USA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న U-Go Scholarship Program 2025-26 ద్వారా భారతదేశంలోని ప్రతిభావంతమైన యువతులకి ఆర్థిక సహాయం అందించబడుతుంది.
ఈ స్కాలర్షిప్ మెడిసిన్, ఇంజినీరింగ్, నర్సింగ్, టీచింగ్, ఫార్మసీ, లా, ఆర్కిటెక్చర్ వంటి ప్రొఫెషనల్ కోర్సులకి వర్తిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి సంవత్సరం గరిష్టంగా ₹60,000 (4 సంవత్సరాల వరకు) అందించబడుతుంది.
అర్హతలు
ప్రొఫెషనల్ అండర్గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న యువతులు మాత్రమే.
ఫైనల్ ఇయర్ విద్యార్థులు కాకూడదు.
10వ & 12వ తరగతుల్లో కనీసం 70% మార్కులు ఉండాలి.
కుటుంబ ఆదాయం సంవత్సరానికి ₹5 లక్షల లోపు ఉండాలి.
భారతదేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు అర్హులు.
ప్రయోజనాలు
టీచింగ్ కోర్సులు: ₹40,000/సంవత్సరం (2 సంవత్సరాలు)
నర్సింగ్/ఫార్మసీ: ₹40,000/సంవత్సరం (4 సంవత్సరాలు)
3 ఏళ్ల కోర్సులు (BCA, BSc, etc.): ₹40,000/సంవత్సరం (3 సంవత్సరాలు)
ఇంజినీరింగ్, MBBS, BDS, లా, ఆర్కిటెక్చర్: ₹60,000/సంవత్సరం (4 సంవత్సరాలు)
అవసరమైన డాక్యుమెంట్లు
10వ & 12వ తరగతి మార్క్స్ మెమోలు, సర్టిఫికేట్లు
ఆధార్ / ఓటర్ ఐడి / పాన్ కార్డ్ / డ్రైవింగ్ లైసెన్స్
అడ్మిషన్ ప్రూఫ్ (ఫీ రిసీట్ / బోనాఫైడ్ / కాలేజ్ ఐడి)
కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం
బ్యాంక్ అకౌంట్ వివరాలు
పాస్పోర్ట్ సైజ్ ఫోటో
దరఖాస్తు విధానo:
Buddy4Study వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి.
U-Go Scholarship Program 2025-26ని ఎంచుకోండి.
అప్లికేషన్ ఫార్మ్ నింపి అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి.
31-అక్టోబర్-2025 లోపు అప్లికేషన్ సమర్పించండి.
-BY VEERAMUSTI SATHISH ,MAJMC
READ MORE:
U-Go Scholarship ProgramIApply Online for INR 60,000 Scholarship

