హైదరాబాద్, అక్టోబర్ 6 : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం సామాజిక సమానత్వం మరియు బీసీ హక్కులపై కొత్త చర్చకు దారితీసింది. వేదికపై కనిపించిన నేతల్లో ఎక్కువమంది ఒకే వర్గానికి చెందినవారే కావడం, బీసీ వర్గాల ఆగ్రహాన్ని రేకెత్తించింది.
ఈ సమావేశంలో వేదికపై ఉన్నవారిలో మహేశ్వర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఏ.వి.ఎన్. రెడ్డి, డీకే అరుణ రెడ్డి, జి. కిషన్ రెడ్డి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఇలా ఆరుగురు రెడ్డీ వర్గానికి చెందిన నాయకులు ఉండగా, రామ్ చందర్ రావు ఒక్కరే బ్రాహ్మణ వర్గానికి చెందిన నాయకుడిగా ఉన్నారు.
బీసీ ముఖ్యమంత్రి మాటలతో మభ్యపెట్టడం ఆపాలి” బీసీ నేతల వ్యాఖ్యలు
బీసీ నాయకులు తీవ్రంగా స్పందిస్తూ,
“రాష్ట్ర కమిటీలో ఒకే వర్గానికి చెందిన నేతలతో నిండిపోయి, ‘మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం’ అని చెప్పడం ప్రజల చెవుల్లో కమలం పువ్వు పెట్టినట్టే. ఇది మోసపూరిత రాజకీయాలే,” అన్నారు.
“బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్— అన్ని పార్టీలూ అగ్రవర్ణాల ఆధిపత్యంలో నడుస్తున్నాయి. కానీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు నిజమైన రాజకీయ ఆత్మగౌరవం ఇవ్వగల పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే,” అని స్పష్టం చేశారు.
మా పార్టీలో ఓనర్లు మేమే” – తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రకటన
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ,
“మా పార్టీ లో ఓనర్లు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు. మా పార్టీ లక్ష్యం – సమాన రాజకీయ అవకాశాలు, గౌరవం, మరియు అధికారం పంచుకోవడం. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ యాత్ర” అన్నారు.
సామాజిక సమానత్వమే ప్రధాన అజెండా
ఈ పరిణామాలతో బీసీల హక్కులు, సామాజిక సమానత్వం, రాజకీయ ప్రతినిధ్యం అనివార్యత ఏర్పడింది . అందుకోసం కాంగ్రెస్ బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పిస్తాం అని చెప్పడం అందులో భాగమే. ఈ అంశం హైకోర్టు, సుప్రీమ్ కోర్టుల చుట్టు తిరుగుతోంది. చివరకు ఏం జరుగుతుందో మరి కొద్ది రోజుల్లో తేలనుంది.
READ IN ENGLISH
BJP Telangana Meeting Sparks BC Outrage – Rajyadhikara Party Demands Equality
