
భువనగిరి, అక్టోబర్ 11: హన్మకొండ నుండి హైదరాబాద్ ఉప్పల్‌కు వెళ్తున్న తెలంగాణ రాష్ట్రీయ రవాణా సంస్థ TGSRTC కు చెందిన గరుడ ప్లస్ (Volvo) బస్సు భువనగిరి సమీపంలోని జాతీయ రహదారిపై ఆగిపోవడంతో ప్రయాణికులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. ప్రయాణమధ్యలో గరుడ బస్సు టైరు అకస్మాత్తుగా పేలిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే, బస్సు నంబర్ TS08Z 0281 హన్మకొండ నుండి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్న సమయంలో TGSRTC గరుడ బస్సు వెనుక కుడి వైపు టైరు దెబ్బతింది. టైరు పూర్తిగా చినిగిపోయి రిమ్ నేలని తోసుకుంటూ ఉండటాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తంగా వ్యవహరించాడు. బస్సును ప్రమాదం జరగకముందే హైవే సైడ్‌కు సురక్షితంగా ఆపి పెద్ద ప్రమాదాన్ని తప్పించాడు.
బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ ముందుగా రక్షించడం తన బాధ్యతగా భావించిన డ్రైవర్, వెంటనే ప్రయాణికులను బస్సు నుండి దింపి రోడ్డుపక్కకు సురక్షితంగా నిలబెట్టాడు. అనంతరం TGSRTC నియంత్రణ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించి, సమీపంగా వెళ్తున్న మరో TGSRTC బస్సును ఆపించి ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు పంపేలా ఏర్పాటు చేశాడు.
ప్రయాణికుల ఆగ్రహం – TGSRTC స్పందనపై అసంతృప్తి
సుమారు గంటకు పైగా హైవేపై ఆగిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కొందరు ప్రయాణికులు TGSRTC బస్సుల్లో టైర్ల స్థితి, నిర్వహణ సరిగా చేయడం లేదని ఆరోపించారు.
https://www.tgsrtc.telangana.gov.in/about-vision-legacy
-BY VEERAMUSTI SATHISH,MAJMC
READ MORE:
TGSRTC Recruitment 2025: డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్
