హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉందని లోక్‌పోల్ మెగా బైపోల్ సర్వే తేల్చింది. మొత్తం 3,100 మంది ఓటర్లను ఆధారంగా చేసుకుని నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి 44% ఓట్ల శాతం లభించే అవకాశం ఉండగా, బీఆర్ఎస్ (BRS) పార్టీ 38%, భాజపా (BJP) 15%, ఇతర పార్టీలకు 3% ఓట్లు లభించే అవకాశం ఉందని వెల్లడించింది.
కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం
సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, యువ బీసీ వర్గానికి చెందిన స్థానిక అభ్యర్థి నమ్మకం వంటి అంశాలు కాంగ్రెస్‌కు బలంగా మారాయి. జూబ్లీహిల్స్ ప్రజా అనుబంధం కలిగిన అభ్యర్థి స్థానిక సమస్యల పరిష్కారంలో తాను అందుబాటులో ఉంటాననే హామీతో ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నట్లు సర్వే పేర్కొంది.
ముస్లిం ఓటర్ల ప్రభావం
ఎంఐఎంఐఎం మద్దతు, హెచ్వైసీ సల్మాన్ నామినేషన్ తిరస్కరణ వంటి పరిణామాలు ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు అదనపు బలాన్ని అందించాయి. నవీన్ యాదవ్ వంటి అభ్యర్థికి సమాజ నాయకులతో ఉన్న అనుబంధం మైనార్టీ ఓటర్లలో సానుకూల వాతావరణాన్ని కలిగించిందని విశ్లేషకులు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ స్థితి క్షీణిస్తోంది
కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రచారం కొనసాగుతున్నప్పటికీ, పార్టీ తన పాత బలాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమవుతోంది. స్థానిక అసంతృప్తి, సంవత్సరాల నిర్లక్ష్యం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈసారి sympathy factor పై బీఆర్ఎస్ ఆధారపడాల్సి వస్తోందని సర్వే పేర్కొంది.
భాజపా ప్రభావం పరిమితం
భాజపా పార్టీ హిందూ ఓటర్లపై దృష్టి సారించినా, పెద్దగా మార్పు తేగలగలదని సర్వేలో కనిపించడం లేదు. పార్టీ ప్రచారం లో-కీ స్థాయిలో ఉండటంతో ప్రధాన పోటీలోకి రావడం కష్టమవుతుందని విశ్లేషకులు తెలిపారు.
సారాంశం:
మొత్తం 3,100 మంది ఓటర్ల అభిప్రాయాలపై ఆధారపడి రూపొందించిన ఈ సర్వే ప్రకారం, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉన్నట్లు తేలింది. బీఆర్ఎస్ మరియు భాజపా తమ స్థిరమైన ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
అయితే… ఫలితం ఎవరి వైపు?
జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై పలు సంస్థలు చేసిన సర్వేలు వేర్వేరు అంచనాలను వెల్లడిస్తున్నాయి. కొన్నింటిలో కాంగ్రెస్‌కు ఆధిక్యం చూపించగా, మరికొన్ని సర్వేలు బీఆర్ఎస్ మరియు భాజపా బలాన్ని కూడా సూచిస్తున్నాయి. సర్వేలలో వ్యత్యాసం ఉన్నా, తుది ఫలితం ఎవరికి అనుకూలంగా మారుతుందో స్పష్టత త్వరలోనే రానుంది.
By Veeramusti Sathish
M.A. (Journalism & Mass Communication), M.A. (Political Science)
Independent Digital Journalist & RTI Activist | Founder – Prathipaksham TV
READ MORE :
Jubilee Hills Bypoll: Telangana Voters Lose Faith in All Parties
Jubilee Hills Bypoll 2025: Congress vs BRS in a Battle of Power and Sympathy

