జనసేన గ్రేటర్ హైదరాబాద్ బలోపేతం కోసం సమన్వయ సమావేశం
జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాదారం రాజలింగం గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో గ్రేటర్ పార్టీ శ్రేణులతో సమన్వయ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—
రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాయకులు ముందుగానే సిద్ధం కావాలని సూచించారు. ప్రజల సమస్యలపై, ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల పక్షాన నిలబడి, పార్టీని భారీ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారు పాల్గొని, గ్రేటర్ నాయకులంతా ఏకాభిప్రాయంతో పని చేస్తూ జనసేనను బలోపేతం చేయాలని కోరారు.
సమావేశంలో వీర మహిళల విభాగం చైర్మన్ మండపాక కావ్య, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పొన్నూరు శిరీష, వైస్ చైర్మన్ రత్న పిల్ల తో పాటు గ్రేటర్ నాయకులు, ఇన్చార్జిలు వెంకటాచారి, నందగిరి సతీష్, బిట్ల రమేష్, ఎడమ రాజేష్, మాధవరెడ్డి, శివ కార్తీక్, నాయకుడు సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

