తెలంగాణలో రెండు నెలల నుండే యాసంగి పొలం పనులు ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం పోలిస్తే తక్కువ విస్తీర్ణంలో వరి సాగు అవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో 50 శాతం మాత్రమే సాగు అయినట్లు సమాచారం.కొంతమంది రైతులు ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్న పరిస్థితి.నాటు కూలీలు, ఎరువు బస్తాలు ,దుక్కి దున్నిన ఖర్చులు కలిపి నాటు వరకే ఎకరాకు 20 వేల రూపాయల ఖర్చు వస్తుంది.
రైతుబంధు సహాయం, వడ్ల పైసలు జమ ఆలస్యం అవ్వడంతో యసంగి సాగు పెట్టుబడికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. వడ్ల పైసల వారం రోజుల నుండి కొంత మంది జమ అయ్యాయి. దీంతో మిగతా రైతులు తమ ఖాతాల్లో రైతుబంధు డబ్బులు, ధాన్యం డబ్బులు జమైనాయో చెక్ చేసుకోవడానికి పాస్బుక్కులతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
యాసంగి పంటకు పెట్టబడి సహాయంగా ఇచ్చే ఎకరాకు 5000 రూపాయలు ఈ నెలాఖరులోగా జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.