సమాచార హక్కు చట్టం ఇది సామాన్యుడు చేతిలో వజ్రాయుధం అని చెప్తూ ఉంటారు ప్రభుత్వ అధికార యంత్రాంగంలో పారదర్శకతను,జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ప్రభుత్వ పరిపాలన వ్యవహారాల్లో గోప్యతను నివారించి ప్రజలకు సమాచారాన్ని అందించడానికి అద్భుత అవకాశం.
మన దేశంలో 2005లో అమల్లోకి వచ్చిన సమాచార హక్కు చట్టం (Right to Information act) ద్వారా దేశ పౌరులందరూ ప్రభుత్వ యంత్రాంగాలకు సంబంధించిన సమాచారాన్ని పొందే హక్కును ఈ చట్టం కల్పిస్తోంది.పౌరులు కోరిన సమాచారాన్ని 30 రోజుల్లోపు, కొన్ని సందర్భాల్లో 48 గంటల్లోపు అందివ్వాలని చట్టం చెబుతోంది.
ఇక అసలు విషయానికొస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టిఐ కమీషనర్లు 2023 ఫిబ్రవరిలో రిటైర్డ్ అయినట్టు సమాచారం ఈ విషయం సామాన్యుడికి తెలుసో లేదో కానీ పిఐఓలకి మాత్రం బాగా తెలుసు అందుకే మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు.? సమాచారం ఇవ్వకున్నా మాకు అయ్యేదేముంది అన్నట్లు ఉంది కొందరి అధికారుల వ్యవహార శైలి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల పోలీస్ స్టేషన్ సంబంధిత పిఐఓకు 5 ఆగస్టు 2023 రోజున ఆర్టిఐ దరఖాస్తు చేశారు.దానికి సమాచారం 30 రోజుల్లో ఇవ్వాల్సింది.. కానీ నాలుగు నెలలు గడిచిన ఇప్పటివరకు సంబంధిత పిఐఓ దరఖాస్తుదారుడుకి సమాచారం ఇవ్వలేదు. దీంతో దరఖాస్తుదారుడు 30వ తేది సెప్టెంబర్ 2023 రోజు జయశంకర్ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కు సంబంధించిన ఫస్ట్ అప్పిలేట్ అథారిటీకి దరఖాస్తు చేసుకున్నాడు దీంతో జిల్లా ఎస్పీ భూపాలపల్లి డిఎస్పికి ట్రాన్స్ఫర్ చేస్తూ దరఖాస్తుదారుడికి సమాచారం ఇవ్వాల్సిందిగా ఆదేశించాడు కానీ డిఎస్పి ఆఫీసు నుంచి గాని, సంబంధిత ఆర్టిఐ అధికారుల నుండి గాని దరఖాస్తుదారుడికి సమాచారము ఇవ్వబడలేదు.
అయితే ఈ పరిస్థితి సామాన్యులకే కాదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి గతంలో ఆర్టిఐ చట్టాన్ని ఉపయోగించుకున్న కొన్ని సందర్భాల్లో ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు కొందరి అధికారుల బాధ్యత రాహిత్యం,వారి నిర్లక్ష్యంపై గతంలో జరిమానా విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా తెలంగాణ రాష్ట్రానికి ఆర్టిఐ కమీషనర్లను నియమించాలని ఆర్టిఐ కార్యకర్తలు,ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు.
దీనిపై ప్రతిపక్షం TV తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ ఉద్యోగిని సంప్రదించగా వారు తెలిపిన వివరాల ప్రకారం..ఆర్టిఐ కమీషనర్లు గత సంవత్సరం ఫిబ్రవరిలోనే రిటైర్ అయ్యారు వారు ఉన్నంతవరకు పనిచేశారు ఆ తర్వాత దరఖాస్తులన్నీ పెండింగ్ లోనే ఉన్నాయి ఇప్పుడు కొత్త ఆర్టిఐ కమీషనర్లు అపాయింట్ అయాకే అప్లికేషన్స్ అన్ని చూస్తారు.