వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాలను రచిస్తోంది.దానిలో భాగంగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలను షర్మిలకు అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినట్టుగా సమాచారం దీంతో రెండు,మూడు రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే వైయస్సార్సీపీ అసంతృప్త నేతలు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉంటుందని,అంతేకాదు వైఎస్ షర్మిలను జగన్ పై పోటీ చేయిస్తే కాంగ్రెస్ కేడర్ లో ఉత్సాహాన్ని నింపడమే గాక రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుని ఓటు శాతం పెరిగే అవకాశం ఉంటుంది అని పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
షర్మిల తన కుమారుడి పెళ్లికి రాజకీయ ప్రముఖులను ఆహ్వానించడమే కాకుండా పనిలో పనిగా రాజకీయ అంశాలు కూడా చర్చించినట్లు సమాచారం.