సికింద్రాబాద్ పీజీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో మొన్న శుక్రవారం రాత్రి ఇద్దరు ఆగంతకులు హాస్టల్ లోకి చొరబడగా.. హాస్టల్లో ఉండే విద్యార్థినులు అప్రమత్తమై ఆ అగంతకున్ని పట్టుకున్నారు.ఆ తరువాత తమకు రక్షణ కావాలి అంటూ ఆందోళన చేసిన సంగతి అందరికి తెలిసిందే.
అయితే ఎప్పుడూ కాలేజీ ప్రాంగణంలో కనిపించని పోలీసులు..ఈ ఘటన తర్వాత సుమారు పది మంది పోలీసులు శని,ఆదివారాలు పొద్దంతా అక్కడే కాలేజ్ లో గస్తి నిర్వహించారు.
దీనిపై ప్రతిపక్షం టీవీ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా.. పీజీ కాలేజ్ హాస్టల్ దగ్గర సీసీ కెమెరాలు లేకపోవడం, కాలేజీ ప్రిన్సిపల్, యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ నిర్లక్ష్యం ఉందని గత పదిఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు ,కాలేజీలకు మెరుగైన వసతులు కల్పించకపోవడం నిధులు కేటాయించకపోవడం కారణం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.