తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి వేడకల్లో పాల్గొన్న కంచ ఐలయ్య మాట్లాడుతూ .. కేసీఆర్,కవితపై కొన్ని సెన్షేషనల్ కామెంట్స్ చేశారు.గద్దర్ బతికుండగా రెండు మహా గొప్ప అవమానాలు భరించిండని, అధికారం లోకి వచ్చిన తర్వాత ఈ రెండు అవమానాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి సమాధానం చెప్పిందని సీఎం రేవంత్ రెడ్డిని కొనియాడారు.
• పోయిన ముఖ్యమంత్రి ఇంటిముందు రెండు నిమిషాలు కలిసి మాట్లాడతానని ఆ బార్కెడ్ల ముందు కూర్చున్నాడు కానీ ఆయనను లోపలికి రానివ్వలేదు..మాట్లాడనివ్వలేదు.ప్రగతి భవన్ ఎదుట గేటు దగ్గర ఎండలో 3 గంటలపాటు కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం వేచి చూశారని ఇది మొదటి అవమానం అని, అలా గద్దర్ ని అవమానపరిచిన బారీకేడ్లను ప్రమాణ స్వీకారం రోజు బద్దలు కొట్టించారని అన్నారు.
• అలాగే ఉద్యమ సమయంలో కేసీఆర్ ని విమర్శించాడని, ఆ ఫుట్ పాత్ గాడా నన్ను విమర్శించేది అని కేసీఆర్ గద్దర్ ను తిట్టారని, ఈ ఫుట్పాత్ గాడికి జయంతి వేడుకల రోజే విగ్రహం పెట్టించాలని మిమ్మల్ని కోరానని, దానికి మీరు అండగా నిలబడటంతో ఈ విగ్రహం పెట్టించానని ఇది రెండో సక్సెస్ అన్నారు.
• అలాగే గద్దర్ ను ఫుట్పాత్ గాడు అన్నందుకు కేసీఆర్ మొహం కాని,వారి కుటుంబసభ్యుల మొహం కాని చూడొద్దని నేను నిర్ణయించుకున్నాని అన్నారు. అయితే పదేళ్లు పదవిలో ఉండగా కనీసం పలకరించని కల్వకుంట్ల కవిత ఈ మధ్యే నాకు కాల్ చేసిందని అయితే ఏ కవిత అని అడగ్గా..నేను కేసీఆర్ బిడ్డ కవితని మాట్లాడుతున్నానని చెప్పింది. నేను వెంటనే మీరు రాంగ్ నంబర్ కి కాల్ చేశారని చెప్పాను. కాదు సార్, అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టడానికి స్పీకర్ కు వినతి పత్రం ఇచ్చామని, దాని గురించి మీటింగ్ పెడుతున్నాం మీరు రావాలని కోరింది.దానికి నేను పూలే నాకు దగ్గరి వాడే కానీ..మీరు నాకు దగ్గరి వారు కాదు కదా.. అని ఫోన్ పెట్టేశానని తెలిపారు. అయితే కల్వకుంట్ల కవిత నాకే గాలం వేయాలని చూసిందని అన్నాడు.
• కేసీఆర్ మైసూర్ ప్యాలెస్ లా కట్టుకున్న ప్రగతి భవన్ కి మహాత్మా పూలే అని పేరు పెట్టి కేసీఆర్ అహంకారం మీద దెబ్బ కొట్టడం నాకు చాలా ఆనందంగా అనిపించిందన్నారు. ఇక గద్దర్ సినిమాల్లోకి వచ్చి నటించి ఉంటే ఎన్టీఆర్ కంటే పెద్ద హీరో అయ్యి ఉండేవాడని అన్నారు.గద్దర్ పేరుపై తెలంగాణ సాంస్కృతిక మ్యూజియం ఏర్పాటు చేసేందుకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.