డ్రీమ్ టీమ్ బ్యానర్ పై , దర్శక నిర్మాత, కధానాయకుడు హరనాధ్ పొలిచెర్ల చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ డ్రిల్. కారుణ్య చౌదరి హీరోయిన్ గా , భవ్య, నిషిగంధ ప్రధాన పాత్రల్లో, తనికెళ్ళ భరణి , రఘుబాబు , జెమినీ సురేష్, కోటేశ్వరరావు, సత్తన్న, విశ్వ , జబ్బర్దస్థ్ ఫణి ప్రధాన తారాగణంగా చేసిన డ్రిల్ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 16 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా చిత్ర టీజర్ ను విడుదల చేశారు.అనంతరం. ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిగా వచ్చిన ఆర్ .పి .పట్నాయక్ మాట్లాడుతూ…అమెరికాలో డాక్టర్ గా సెటిల్ అయిన హరనాథ్ పొలిచెర్ల ఇండియాకు వచ్చి ఎంతోమంది ఆర్థిస్టులకు అవకాశం కల్పిస్తూ తెలుగు సినిమా చెయ్యడం చాలా సంతోషంగా ఉంది. తను ఇలాగే ఇంకా ఎన్నో సినిమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీకి చేదోడు వాదోడుగా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన లిరికల్ సాంగ్స్ , ట్రైలర్ కు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ నెల 16 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న “డ్రిల్” సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
హీరో, దర్శక, నిర్మాత హరనాథ్ పొలిచెర్ల మాట్లాడుతూ..నాకు చిన్నప్పటి నుండి సినిమాలంటే ఇష్టం.ఆ ఇష్టంతోనే గతంలోనే కెప్టెన్ రాణా ప్రతాప్, టిక్ టిక్, చంద్రహాస్, తదితర ఎనిమిది సినిమాలు తియ్యడం జరిగింది. అమెరికాలో డాక్టర్ వృత్తిలో ఎంతో బిజీగా ఉన్నా ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్ తెలుసుకొంటాను. అయితే లవ్ జిహాదీ మీద ఒక్క సినిమా కూడా తెలుగులో రాలేదు . అందుకే ఈ కాన్సెప్ట్ తో సినిమా తియ్యాలని స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఇండియాకు వచ్చి సినిమా తియ్యడం జరిగింది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు బిన్నంగా ఈ సినిమా ఉంటుంది. చూసిన ప్రేక్షకులందరికీ కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది.
జెమినీ సురేష్ మాట్లాడుతూ… హరనాథ్ పొలిచెర్ల గారు చేసే ప్రతి సినిమాకు నన్ను గుర్తుపెట్టుకొని మంచి క్యారెక్టర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సినిమాలో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేయడం జరిగింది.కొత్త కాన్సెప్ట్ తో ఈ నెల 16 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న డ్రిల్ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
హీరోయిన్ కారుణ్య చౌదరి మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్ బేస్డ్ ఉన్న డ్రిల్ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన హరనాథ్ పొలిచెర్ల, గారికి ధన్యవాదాలు అని అన్నారు.
నటీ నటులు
హరనాథ్ పొలిచెర్ల, కారుణ్య చౌదరి, , భవ్య, నిషిగంధ , తనికెళ్ళ భరణి , రఘుబాబు , జెమినీ సురేష్, కోటేశ్వరరావు, సత్తన్న, విశ్వ , జబ్బర్దస్థ్ ఫణి తదితరులు
Previous ArticleTelangana: డిప్యూటీ సీఎంను కలిసిన మంచు విష్ణు
Next Article Kalvakuntla Kavitha:కవిత గాలం వేయాలని చూసింది
Veeramusti Sathish, MAJMC
Independent journalist, RTI activist & founder of PrathipakshamTV.com, specializing in legal and investigative reporting.