
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బంజారాహిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆడిటోరియంలో జరిగిన చైతన్య సదస్సులో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (వెస్ట్ జోన్) నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ,
“రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డ తర్వాత నాకు ఇది రెండో జీవితం. నేను బతికానంటే హెల్మెట్ కారణం,” అని భావోద్వేగంగా తెలిపారు.
తన ప్రమాదం తర్వాత ట్రాఫిక్ రూల్స్ ప్రాముఖ్యత అర్థమైందని,
ప్రతి బైక్ రైడర్ తప్పకుండా హెల్మెట్ ధరించాలని,
కారు డ్రైవర్లు సీట్ బెల్ట్ తప్పక వేసుకోవాలని సూచించారు.
“జీవితం విలువైనది. ఒక చిన్న నిర్లక్ష్యం మన కుటుంబానికి పెద్ద నష్టం తెస్తుంది,” అని యువతను హెచ్చరించారు.
ట్రాఫిక్ నియమాలు తప్పనిసరి
సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ,
“మద్యం తాగి డ్రైవింగ్ చేయడం ప్రాణాంతకం.
ట్రాఫిక్ రూల్స్‌ని ఉల్లంఘించడం అంటే జీవితం పణంగా పెట్టడం,”
అని స్పష్టం చేశారు.
అలాగే ట్రాఫిక్ పోలీసుల పనికి సహకరించాలని, వారి సూచనలు పాటించాలంటూ పిలుపునిచ్చారు.
అధికారులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి,
ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్, వివిధ విభాగాల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సాయి ధరమ్ తేజ్ సందేశం:
“రోడ్డు మీద ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది.
ట్రాఫిక్ రూల్స్‌ని పాటించడం అంటే మన జీవితాన్ని కాపాడుకోవడం.”
https://transport.telangana.gov.in/#nogo
By Veeramusti Sathish
M.A. (Journalism & Mass Communication), M.A. (Political Science)
Independent Digital Journalist & RTI Activist | Founder – Prathipaksham TV
READ MORE:
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ కొత్త భద్రతా చర్యలు

