భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ,తెలంగాణలోని ఖమ్మం పట్టణం నీట మునిగింది. అక్కడి ప్రజలు ఇంకా జలదిగ్బందంలోనే ఉన్నారు, సాయం కోసం ఎదురుచూస్తున్నారు . ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ ప్రముఖులు ముందుకొచ్చి పెద్దెత్తున విరాళాలు అందిస్తున్నారు.
నా వంతుగా కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను అని అన్నారు. అలాగే పదుల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం అని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో ప్రభుత్వంలో పరిస్థితిని మెరుగుపరిచేందుకు సాయశక్తుల ప్రయత్నిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితులు త్వరగా తొలిగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని ఆయన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ షేర్ చేశారు.
సినీ ప్రముఖుల విరాళాలు:
• నటుడు ప్రభాస్ రూ.2 కోట్లు,
• హెరిటేజ్ ఫుడ్స్ రూ.2 కోట్ల,
• అల్లు అర్జున్ రూ 1 కోటి
• మాజీ సీజేఐ ఎన్వీ రమణ రూ.20 లక్షలు,
• నిర్మాత అశ్విని దత్ 25 లక్షలు,
• ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 1 కోటి రూ.,
• విశ్వక్ సేన్ 10లక్షలు,
• సిద్ధూ జొన్నలగడ్డ తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.30 లక్షలు,
• సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 1 కోటి రూ,
• బాలకృష్ణ రూ. 1 కోటి,
• పవన్ కళ్యాణ్ రూ.1కోటి ,
• నటి అనన్య నాగళ్ళ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.5 లక్షలు .
https://www.telangana.gov.in/
https://apcmrf.ap.gov.in/Home/Index
-BY VEERAMUSTI SATHISH,MAJMC
READ MORE
Megastar Chiranjeevi Honored with Lifetime Achievement Award at UK Parliament | Bridge India Award
Chiranjeevi: ‘సుందరం మాస్టర్’ ట్రైలర్ సూపర్ – ప్రతిపక్షం TV
Chiranjeevi vs Balakrishna: Mega Star Issues Clarification on AP Assembly – ప్రతిపక్షం TV

