వరద బాధితులకు సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ఎస్బీఐ ఉద్యోగుల బృందం జూబ్లీ హిల్స్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గార్లను కలిసి ఎస్బీఐ ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.5 కోట్ల విరాళం చెక్కును అందజేశారు. సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో ఎస్బీఐ సీజీఎం రాజేష్ కుమార్ , డీజీఎం జితేందర్ శర్మ , ఏజీఎంలు దుర్గా ప్రసాద్ , తనుజ్ తదితరులు ఉన్నారు. బాధితులకు అండగా నిలుస్తున్న వారికి ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.