సీనియర్ సినీ పాత్రికేయుడు, పిఆర్వో ఎ.వెంకట్ నాయుడు ( గడ్డం వెంకట్) గారు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సూర్యాపేటలోని స్వగృహంలో 20-09-2024 శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణ వార్త విని ఆత్మీయులు, బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు, పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయనతో ఎన్నో ఏళ్లు కలిసి ప్రయాణం చేశామని, ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు అని మిత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఇండస్ట్రీ లో విస్తృత పరిచయాలు ఉన్న గడ్డం వెంకట్ నాయుడు సినిమా జర్నలిస్టుగా తనదైన ముద్ర వేశారు, సినిమా పీఆర్వో గానే కాక సినిమా నటుడిగా పలు చిత్రాల్లో నటించారు. అంతేకాదు ఇప్పుడున్న సినీ జర్నలిస్టులు కొంతమంది ఆయన దగ్గర శిష్యరికం చేసినవారే, గడ్డం వెంకట్ గారి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.