అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన 10 ఎకరాల భూమిని జేఎన్ఏఎఫ్ఎ యూనివర్సిటీకి కేటాయించవద్దని ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్ గంట చక్రపాణి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా అనేక మంది పేద విద్యార్థులకు మేలు జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. భూమిని ఇతర యూనివర్సిటీలకు కేటాయించడం ద్వారా భవిష్యత్తులో ఓపెన్ యూనివర్సిటీ అవసరాలకు ఇబ్బంది ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయాలని ట్విట్టర్ ఎక్స్ వేదికగా సిఎం రేవంత్ రెడ్డిని కోరారు.