AIIMS మంగళగిరి నియామకాలు 2025: 121 ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), మంగళగిరి, ఆంధ్రప్రదేశ్ ఇటీవల ఫ్యాకల్టీ పోస్టుల (గ్రూప్ A) నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.
Thank you for reading this post, don't forget to subscribe!మొత్తం 121 ఖాళీలు ప్రకటించబడ్డాయి. వీటిలో ప్రొఫెసర్, అదనపు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థానాలు ఉన్నాయి.
ముఖ్య వివరాలు:
-
నోటిఫికేషన్ తేదీ: 27-సెప్టెంబర్-2025
-
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: త్వరలో ప్రకటిస్తారు
-
దరఖాస్తు చివరి తేదీ: ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రచురణ తేదీ నుంచి 30 రోజులు
-
హార్డ్ కాపీ పంపే చివరి తేదీ: ఆన్లైన్ ముగిసిన తర్వాత 10 రోజులు
-
అధికారిక వెబ్సైట్: www.aiimsmangalagiri.edu.in
ఖాళీలు (మొత్తం – 121 పోస్టులు)
-
ప్రొఫెసర్ – విభిన్న విభాగాల్లో
-
అదనపు ప్రొఫెసర్ – స్పెషాలిటీలలో
-
అసోసియేట్ ప్రొఫెసర్ – అనస్థీషియా, న్యూరాలజీ, పాథాలజీ మొదలైన విభాగాల్లో
-
అసిస్టెంట్ ప్రొఫెసర్ – ఎక్కువ సంఖ్యలో ఖాళీలు (70+)
అర్హతలు
-
మెడికల్ అభ్యర్థులు: MBBS + MD/MS/DM/M.Ch సంబంధిత స్పెషాలిటీలో, అవసరమైన బోధన/రిసెర్చ్ అనుభవం.
-
నాన్-మెడికల్ అభ్యర్థులు: మాస్టర్స్ డిగ్రీ + పీహెచ్డీ సంబంధిత సబ్జెక్ట్‌లో, బోధన/రిసెర్చ్ అనుభవం.
-
వయసు పరిమితి:
-
ప్రొఫెసర్/అడిషనల్ ప్రొఫెసర్ – గరిష్టంగా 58 ఏళ్లు
-
అసోసియేట్/అసిస్టెంట్ ప్రొఫెసర్ – గరిష్టంగా 50 ఏళ్లు
-
రిజర్వేషన్ ప్రకారం వయసు సడలింపు (SC/ST – 5 ఏళ్లు, OBC – 3 ఏళ్లు, PwBD – 10 ఏళ్లు)
-
అప్లికేషన్ ఫీజు
-
UR/EWS/OBC: ₹3100
-
SC/ST/మహిళలు: ₹2100
-
PwBD: ₹100
దరఖాస్తు విధానO
-
ముందుగా AIIMS మంగళగిరి వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తు చేయాలి.
-
ఫిల్ చేసిన అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసి, సంతకం చేసి, అవసరమైన డాక్యుమెంట్లతో కలిపి స్పీడ్ పోస్ట్/కూరియర్ ద్వారా ఈ చిరునామాకు పంపాలి:
Recruitment Cell,
Room No. 205, 2nd Floor, Library & Admin Building,
AIIMS Mangalagiri, Guntur District, Andhra Pradesh – 522503.
-
స్కాన్ చేసిన డాక్యుమెంట్లు facultyrec@aiimsmangalagiri.edu.in కు మెయిల్ చేయాలి. APPLICATION LINK :
AIIMSMangalagiri-290925
AIIMS Mangalagiri Recruitment | 121 Faculty Posts – Apply Online