బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ సినిమా తరపున ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ప్రాతినిధ్యం.
ఇటీవల పుష్ప చిత్రంలో ఉత్తమ నటనకు గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ఈ ఉత్తమనటుడి పురస్కారం అందుకున్న ఏకైక తెలుగు నటుడుగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఐకాన్ స్టార్ మరో అరుదైన గౌరవాన్ని పొందారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే
బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ సినిమా తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం అల్లు అర్జున్‌కు దక్కింది. ఈ సందర్భంగా ఆయన బెర్లిన్ 74వ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు గురువారం జర్మనీకి పయనమయ్యారుపుష్ప చిత్రంతో ఆయన ప్రతిభ ప్రపంచమంతటా గుర్తించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15న విడుదల కానున్నపుష్ప-2 ,చిత్రంలో ఆయన ప్రపంచమంతటా మరింత పాపులారిటిని పొందనున్నారు.
Allu Arjun:బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ సినిమా తరపున అల్లు అర్జున్
Previous Articleశివకార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ సినిమా
Next Article Chiranjeevi: ‘సుందరం మాస్టర్’ ట్రైలర్ సూపర్
Veeramusti Sathish, MAJMC
Independent journalist, RTI activist & founder of PrathipakshamTV.com, specializing in legal and investigative reporting.