చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో డా. బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తక్షణమే జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందిన రెండు గంటలలోపే కమిషన్ స్పందించి జిల్లా కలెక్టర్, ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలు, సెక్షన్లు, నిందితుల అరెస్టులు, చార్జ్ షీట్ ప్రగతి, అలాగే బాధితులకు చెల్లించిన పరిహారం వివరాలను 30 రోజుల్లోగా సమగ్ర నివేదికగా సమర్పించాలని ఆదేశించింది.
Thank you for reading this post, don't forget to subscribe!అలాగే, నిర్దిష్ట గడువులోగా సమాధానం ఇవ్వకపోతే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం సివిల్ కోర్టు అధికారాలను వినియోగించి సంబంధిత అధికారులను స్వయంగా లేదా ప్రతినిధి ద్వారా కమిషన్ ముందు హాజరు కావాలని హెచ్చరించింది.
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ – “షెడ్యూల్డ్ కులాల భద్రత, గౌరవం కాపాడటం మనందరి బాధ్యత. సామాజిక న్యాయం ప్రతీకలపై దాడులను సహించం. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని స్పష్టం చేశారు.