Author: prathipakshamtv

విజయవాడ నుండి రేపల్లె కరకట్ట వైపు వెళ్లేందుకు ప్రతి 40 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని ఏపీ ఆర్టీసీ అధికారులు విజయవాడ బస్టాండ్ లో బోర్డు ఏర్పాటు చేశారు. అయితే వాస్తవానికి ఇది భిన్నంగా ఉంది. ఇక అసలు విషయాని కొస్తే.. 11 అక్టోబర్ 2024న కరకట్ట వైపు వెళ్ళేందుకు ప్రయాణికులు సుమారు 3 గంటలు వేచి చూసినప్పటికీ బస్సులు అందుబాటలో లేకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ విషయంపై ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను సంప్రదించగా..వస్తది వేయిట్ చేయండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో ఆర్టీసీ అధికారుల తీరుపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read More

చిట్యాల,సెప్టెంబర్ 27 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులతో కిటకిటలాడింది. రేపు,ఎల్లుండి వరుసగా శని, ఆదివారాలు కావడంతో జనం భారీగా కనిపించారు. కొంతమంది డబ్బులు డ్రా చేసుకోవడానికి వస్తే.. మరికొందరు డబ్బులు పడ్డాయా లేదా అని చెక్ చేసుకువడాని, రుణాల రెన్యూవల్‌, సొమ్ము డిపాజిట్ చేసుకోవడానికి వినియోగదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే వృద్ధులు, మహిళలు చాలాసేపు పడిగాపులు కాశారు, గంటల కొద్దీ నిలబడలేక అసహనం వ్యక్తం చేశారు..ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంక్‌ కిటకిటలాడింది. అయితే బ్యాంకు అధికారులు, సిబ్బంది నాణ్యమైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వివిధ గ్రామాల నుండి వచ్చిన కొంత మంది వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు.

Read More

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీకి చెందిన 10 ఎకరాల భూమిని జేఎన్‌ఏఎఫ్ఎ యూనివర్సిటీకి కేటాయించవద్దని ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్ గంట చక్రపాణి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా అనేక మంది పేద విద్యార్థులకు మేలు జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. భూమిని ఇతర యూనివర్సిటీలకు కేటాయించడం ద్వారా భవిష్యత్తులో ఓపెన్‌ యూనివర్సిటీ అవసరాలకు ఇబ్బంది ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయాలని ట్విట్టర్ ఎక్స్ వేదికగా సిఎం రేవంత్ రెడ్డిని కోరారు.

Read More

డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ భూముల్ని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు కోసం  కేటాయించే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ యూనివర్సిటీ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ఈ యూనివర్సిటీ అందరికీ విద్య అనే నినాదంతో..రెండు తెలుగు రాష్ట్రాలలో లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించింది.ఇది రాళ్లు ,రప్పలు ,కొండల మీద ఉంది దీన్ని  ప్రభుత్వం అభివృద్ధి చేయకపోగా ఉన్న భూమిలో కొంత జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీకి కేటాయిస్తే అంబేద్కర్ యూనివర్సిటీకి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరింత విస్తరించడానికి అవకాశం లేకుండా పోతుందని ఉద్యోగులందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ శ్రీనివాస్ వడ్డానం మాట్లాడుతూ..ఈ భూమి కేటాయింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని లేని యెడల అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థులు, ఉద్యోగులందరం కలసి ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని వ్యాఖ్యానించారు. ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు…

Read More

సీనియర్ సినీ పాత్రికేయుడు, పిఆర్వో ఎ.వెంకట్ నాయుడు ( గడ్డం వెంకట్) గారు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సూర్యాపేటలోని స్వగృహంలో 20-09-2024 శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణ వార్త విని ఆత్మీయులు, బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు, పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయనతో ఎన్నో ఏళ్లు కలిసి ప్రయాణం చేశామని, ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు అని మిత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఇండస్ట్రీ లో విస్తృత పరిచయాలు ఉన్న గడ్డం వెంకట్ నాయుడు సినిమా జర్నలిస్టుగా తనదైన ముద్ర వేశారు, సినిమా పీఆర్వో గానే కాక సినిమా నటుడిగా పలు చిత్రాల్లో నటించారు. అంతేకాదు ఇప్పుడున్న సినీ జర్నలిస్టులు కొంతమంది ఆయన దగ్గర శిష్యరికం చేసినవారే, గడ్డం వెంకట్ గారి మృతి…

Read More

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు జర్నలిస్టులను సమాజానికి చికిత్స చేసే డాక్టర్లుగానే తమ ప్రభుత్వం చూస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పాత్రికేయుల సమస్యలను పరిష్కరించి, వారికి సంక్షేమాన్ని అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ వెనుకడుగు వేయలేదని, అర్హులైన జర్నలిస్టులకు న్యాయం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీలోనూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం 38 ఎకరాల భూమికి సంబంధించి స్వాధీన పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ (మ్యాక్‌) హౌసింగ్ సొసైటీకి అప్పగించారు. గత కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించిన ప్రభుత్వానికి ఈ సందర్భంగా పాత్రికేయులు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే, చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 1 లక్ష చొప్పున చెక్కులను సీఎం పంపిణీ చేశారు. ప్రజాభిప్రాయం,పాత్రికేయుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే,వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే తమ…

Read More

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల పథకాలలో ప్రధానమైనది రైతు భరోసా పథకం. ఈ పథకం కింద ఏటా రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం, ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం,వరి పంటకు అదనంగా రూ.500 బోనస్. అయితే రైతు భరోసా పథకం అనేది పంట సాగుకు ముందు ప్రభుత్వం రైతులకు ఇచ్చే ఆర్థిక సహాయం, ఇది రైతులు సాగు పనులు చేసుకోవడానికి ఉపయోగించుకునేది..రైతులు ఖరీఫ్ పంట సాగు చేసి మూడు నెలలు ఇప్పటికే గడిచిపోయింది..రైతులు పెట్టుబడి కోసం అప్పో సప్పో చేసి పంట సాగు చేశారు. వ్యాపారస్తుల దగ్గర తెచ్చిన అప్పు అధిక వడ్డీలతో మోత మోగిపోతుంది..ఈ ఖరీఫ్ పంట చేతికి రావాలంటే ఇంకా ఎకరాకు సుమారు 15 వేల నుంచి 20 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.. అయితే ఖరీఫ్ సీజన్ మొదట్లో రైతు భరోసా నిధులు అమలు ఇదిగో అదిగో అంటూ ఊరించారు…

Read More

ఏ.ఐ.జీ హాస్పిటల్స్ (AIG Hospitals) యాజమాన్యం వరద బాధితులకు అండగా నిలిచేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం ఇచ్చారు. ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి ,వైస్ చైర్మన్ పీవీఎస్ రాజు జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గార్లను కలిసి విరాళం చెక్కును అందజేశారు.

Read More

వరద బాధితుల సహాయార్థం అరబిందో ఫార్మా సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్లు విరాళం అందించింది. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క గార్లను సంస్థ ప్రతినిధులు కలిసి విరాళం చెక్కును అందజేశారు.సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసిన వారిలో అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానంద రెడ్డి , డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి , సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఐఎస్ఆర్ రావు తదితరులు ఉన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో అరబిందో ఫార్మా సంస్థ చూపిన ఔదార్యాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.

Read More

వరద బాధితులకు సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ఎస్‌బీఐ ఉద్యోగుల బృందం జూబ్లీ హిల్స్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గార్లను కలిసి ఎస్బీఐ ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.5 కోట్ల విరాళం చెక్కును అందజేశారు. సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో ఎస్‌బీఐ సీజీఎం రాజేష్ కుమార్ , డీజీఎం జితేందర్ శర్మ , ఏజీఎంలు దుర్గా ప్రసాద్ , తనుజ్ తదితరులు ఉన్నారు. బాధితులకు అండగా నిలుస్తున్న వారికి ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Read More

భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలలో జనజీవనం అస్తవ్యస్తమైంది.బీఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ,తెలంగాణలోని ఖమ్మం పట్టణం నీట మునిగింది. అక్కడి ప్రజలు ఇంకా జలదిగ్బందంలోనే ఉన్నారు, సాయం కోసం ఎదురుచూస్తున్నారు . ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ ప్రముఖులు ముందుకొచ్చి పెద్దెత్తున విరాళాలు అందిస్తున్నారు. నా వంతుగా కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను అని అన్నారు. అలాగే పదుల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం అని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో ప్రభుత్వంలో పరిస్థితిని మెరుగుపరిచేందుకు సాయశక్తుల ప్రయత్నిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితులు త్వరగా తొలిగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని ఆయన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ షేర్ చేశారు. తెలుగురాష్ట్రాల్లో వరద బాధితులకు పలువురు ప్రముఖుల విరాళాలు: • నటుడు ప్రభాస్ రూ.2 కోట్లు,• హెరిటేజ్‌ ఫుడ్స్‌…

Read More

డా.బీ.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం గడువును పొడిగించారు.అర్హులైన వారు సెప్టెంబర్ 30 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు .అలాగే విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ లో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును ఈనెల 30 లోగా చెల్లించాలని తెలిపారు. అంబేడ్కర్ యూనివర్సిటీ అందిస్తున్న పలు కోర్సులు: Ph.D 16 Departments: English, Hindi, Telugu, Business Management, Commerce, Education, Chemistry, Environmental Science, Mathematics, Physics, Economics, History, Library and Information Science, Political Science, Public Administration, and Sociology Master’s Programmes:M.A. Economics (Telugu Medium),M.A. History (Telugu Medium), M.A.Political Science (Telugu Medium),M.A. Public Administration (Telugu Medium),M.A. Sociology (Telugu Medium),M.A. Journalism and Mass Communication (English Medium),M.A. English (2003)M.A. Hindi (2008)M.A. Telugu…

Read More

తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ అమలుపై ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న అప్పును మాఫీ చేయడానికి విధివిధానాలు ఖారారు చేసే పనిలో ఉంది రేవంత్‌ ప్రభుత్వం . ఆగస్టు 15వ తేదీలోపు ఈ రుణమాఫీ క్లోజ్ చేయాలని ప్రభుత్వా అధికారులు భావిస్తున్నారు. రైతుల శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తున్న సీఎం రేవంత్.. రైతు రుణమాఫీపై ప్రత్యేక శ్రద్ద పెట్టారని చెప్పుకొవచ్చు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఇవ్వడానికి రంగం సిద్దం చేస్తుంది. ఈ ఆగస్టు 15 లోగా రైతు రుణమాఫీ పూర్తవుతుందని ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2023 డిసెంబరు 10వ తేదీ వరకు రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ మాఫీ వర్తిస్తుందని రేవంత్‌ వెల్లడించారు. ఎన్నికల కోడ్ ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీకి బ్రేక్ పడింది. ఇప్పుడు ఎన్నికల కోడ్…

Read More

ఢిల్లీలో కేంద్ర కేబినేట్ సమావేశం జరిగింది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ అధ్యక్షతన జరిగిన ఈ మొదటి సమావేశంలో ధాన్యం, రాగి, జవార్, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు మద్దతు ధర పెంచుతూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024-25 ఖరీఫ్ సీజన్‌లో వివిధ పంటల మద్దతు ధరలు.వరి: రూ. 2,300పత్తి: రూ. 7,521మొక్కజొన్న: రూ.2,225 నువ్వులు: రూ. 9,267వేరుశనగ: రూ.6,783మూంగ్: రూ. 8,682టర్: రూ. 7,550ఉరద్: రూ. 7,400రేప్ సీడ్స్: రూ. 8,717పొద్దుతిరుగుడు: రూ. 7,280సోయాబీన్: రూ.4,892 ,జోవర్: రూ. 3,371రాగి: రూ. 2,490బజ్రా: రూ. 2,625

Read More

సీఎం చంద్రబాబు నాయుడు – సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు . పవన్‌ కల్యాణ్‌ – డిప్యూటీ సిఎం & పంచాయతీరాజ్‌ & గ్రామీణాభివృద్ధి. నారా లోకేష్‌ – మానవ వనరులు, ఐటీ శాఖ అచ్చెన్నాయుడు – వ్యవసాయం,సహకార, మార్కెటింగ్ వంగలపూడి అనిత – హోంశాఖకొల్లు రవీంద్ర – గనులు,ఎక్సైజ్‌ శాఖనాదెండ్ల మనోహర్‌ – పౌరసరఫరాల శాఖనారాయణ – మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖనిమ్మల రామానాయుడు – జలవనరుల శాఖ సత్యకుమార్ యాదవ్ – వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం.ఫరూక్‌ – న్యాయ, మైనార్టీ శాఖరాంనారాయణరెడ్డి – దేవదాయశాఖపయ్యావుల కేశవ్‌ – ఆర్థిక శాఖసత్యప్రసాద్ – రెవెన్యూశాఖపార్థసారథి – హౌసింగ్‌, సమాచారశాఖబాల వీరాంజనేయ స్వామి – సాంఘిక సంక్షేమ శాఖగొట్టిపాటి రవికుమార్‌ – విద్యుత్ శాఖకందుల దుర్గేష్‌ – టూరిజం, సినిమాటోగ్రఫీగుమ్మడి సంధ్యారాణి – మహిళా, గిరిజన సంక్షేమ శాఖజనార్ధన్‌రెడ్డి – రోడ్లు, భవనాల శాఖటీజీ భరత్‌ – పరిశ్రమలు,…

Read More

TSPSC Groups Exam Dates 2024 : టీఎస్పీఎస్పీ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ తో పాటు గ్రూప్ 2, 3 పరీక్షల తేదీలను ఖరారు చేసింది. అక్టోబర్ 21 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు నవంబర్‌ 17, 18 తేదీల్లో గ్రూప్‌-3 పరీక్షలు నిర్వహించనున్నట్లు టిఎస్పిఎస్సి కమిషన్ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం కీలక ప్రకటన విడుదల చేసింది. •19 ఫిబ్రవరి 2024 న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి. వీటికి సుమారు ఐదు నుండి ఆరు లక్షల మధ్య అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.• 2022 డిసెంబర్ లో 783 పోస్టులకు గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేశారు వీటికి 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు.• ఇక గ్రూప్ 3…

Read More

యువ చంద్ర కృష్ణ, సాహిత్ మోత్ఖూరి, నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ ‘పొట్టేల్’ నుండి పవర్ ఫుల్ మాస్ సాంగ్ ‘వవ్వరే’ విడుదల  గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమాల్లో ఫ్రెష్ నెస్ , హానెస్టీ ఉంటుంది. పల్లెటూరి వాతావరణంలో జరిగే సినిమాల్లో ఎమోషన్స్ పండితే అద్భుతాలు సృష్టిస్తాయి. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహించిన పొట్టేల్  గ్రామీణ నేపథ్యంలో కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన లభించగా, మొదటి సింగిల్ నాగిరో చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ పాట సినిమాలోని రొమాంటిక్ లేయర్‌ని ఆవిష్కరించింది.మ్యూజికల్ జర్నీలో భాగంగా రెండో సింగిల్ వవ్వరేతో ముందుకు వచ్చారు మేకర్స్. శేఖర్ చంద్ర స్వరపరిచిన వవ్వరే మాస్ ని కట్టిపడేసి పాట. థంపింగ్ బీట్‌లతో ఒక రూరల్ , మాస్ నంబర్‌ను స్కోర్ చేసారు. కాసర్ల శ్యామ్ తన అద్భుతమైన లిరిక్స్ తో విలేజ్ బ్యూటీ ని…

Read More

ఊరు పేరు భైరవకోన’ ప్రీమియర్స్ కు యూనిమస్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది: బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో సందీప్ కిషన్ & టీంయంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇప్పటికే ప్రదర్శించిన ప్రీమియర్స్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి16) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర బృందం బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ సక్సెస్…

Read More

డిఫరెంట్ చిత్రాలను ఆదరించే ప్రేక్షకుల సహకారంతో ‘సుందరం మాస్టర్’ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి : ‘సుందరం మాస్టర్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మెగ్టాసార్ చిరంజీవిఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్’. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్ అయింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్ మాట్లాడుతూ..వీడియో సందేశం ద్వారా చిరంజీవి మాట్లాడుతూ.. ‘ ‘సుందరం మాస్టర్’ ట్రైలర్ చాలా బాగుంది. హర్ష కోసమే ఈ పాత్ర పుట్టినట్టుగా ఉంది. తనకు తాను, తన టాలెంట్‌ను తాను నమ్ముకుని హర్ష ఈ స్థాయికి వచ్చాడు. ఈ రోజు హీరో స్థాయికి ఎదిగాడు.…

Read More

బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఇండియ‌న్ సినిమా త‌ర‌పున ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ప్రాతినిధ్యం.ఇటీవ‌ల పుష్ప చిత్రంలో ఉత్త‌మ న‌ట‌న‌కు గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ పుర‌స్కారం అందుకున్న సంగ‌తి తెలిసిందే. భార‌త‌దేశంలో సినీ రంగంలో అత్యున్న‌త పుర‌స్కారంగా భావించే ఈ ఉత్త‌మ‌న‌టుడి పుర‌స్కారం అందుకున్న ఏకైక తెలుగు న‌టుడుగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఐకాన్ స్టార్ మ‌రో అరుదైన గౌర‌వాన్ని పొందారు.  అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే బెర్లిన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్లో  ఇండియ‌న్ సినిమా  త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించే అవ‌కాశం అల్లు  అర్జున్‌కు ద‌క్కింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న బెర్లిన్ 74వ ఇంట‌ర్నేష‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో పాల్గొనేందుకు గురువారం   జర్మ‌నీకి ప‌య‌న‌మయ్యారుపుష్ప చిత్రంతో ఆయ‌న ప్ర‌తిభ ప్ర‌పంచ‌మంత‌టా గుర్తించిన సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్టు 15న విడుద‌ల కానున్న‌పుష్ప‌-2 ,చిత్రంలో ఆయ‌న ప్ర‌పంచ‌మంత‌టా మ‌రింత పాపులారిటిని పొంద‌నున్నారు.

Read More

శివకార్తికేయన్-ఏఆర్ మురుగదాస్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ షూటింగ్ పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభంశివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో భారీగా నిర్మిస్తున్న చిత్రం నిన్న పూజా కార్యక్రమాలో లాంఛనంగా ప్రారంభమైయింది. తెలుగు, తమిళ్ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఉదయం మొదలైయింది.అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో టాప్ లీగ్ యాక్టర్ శివకార్తికేయన్ హీరోగా రాబోయే యాక్షన్ చిత్రం గురించిన వార్తలను విన్న అభిమానులు థ్రిల్ అయ్యారు. షూటింగ్ ప్రారంభమైనట్లు అధికారికంగా ధృవీకరించడం అభిమానులకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది.దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన పాపులర్ స్టొరీ టెల్లింగ్ స్టయిల్ లో, యునిక్ సెట్టింగ్‌తో చిత్రాన్ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రాబోయే మాస్టర్‌పీస్ హై యాక్షన్-ప్యాక్డ్ అనుభూతిని అందిస్తుంది.వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందజేస్తున్న హీరో శివకార్తికేయన్ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్, గ్రాండియస్ట్ చిత్రం…

Read More

పద్మ వ్యూహంలో చక్రధారి’ తప్పకుండా ప్రేక్షకులని అద్భుతంగా అలరిస్తుంది: టైటిల్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య, కృష్ణ చైతన్య & సినిమా యూనిట్యంగ్ ట్యాలెంటెడ్ ప్రవీణ్ రాజ్ కుమార్ హీరోగా శశికాటిక్కో, ఆషు రెడ్డి కీలక పాత్రలలో సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో ఓ యూనిక్ ప్యూర్ లవ్ ఎమోషనల్ డ్రామా రూపొందుతోంది. కె.ఓ.రామరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘పద్మ వ్యూహంలో చక్రధారి’అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. ఈ సందర్భంగా టైటిల్ లాంచ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.ప్రెస్ మీట్ లో ముఖ్య అతిదిగా వచ్చిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ..’పద్మ వ్యూహంలో చక్రధారి’ టైటిల్ , పోస్టర్ చాలా ఆసక్తికరంగా వున్నాయి. ప్రవీణ్ రాజ్ కుమార్, ఆషు రెడ్డి, శశికా టిక్కో, మదునందన్, భూపాల్ రాజు. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది” అన్నారు,దర్శకుడు కృష్ణ చైతన్య…

Read More

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ విడుదలస్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘టిల్లు స్క్వేర్’ మరోసారి మ్యాడ్ నెస్ ని ఆవిష్కరించింది!స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ చిత్రంతో సంచలన బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. అలాగే ఆ సినిమాలో ఆయన పోషించిన టిల్లు పాత్ర యువతలో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాయి. ‘డీజే టిల్లు’లో  సిద్ధు పలికిన “అట్లుంటది మనతోని” వంటి పలు మాటలు.. టిల్లు అభిమానులతో పాటు సామాన్యులలో కూడా రోజువారీ సంభాషణలుగానూ మారిపోయాయి.’డీజే టిల్లు’ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో, టిల్లు పాత్రతో మరోసారి వినోదాన్ని పంచాలన్న ఉద్దేశంతో ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. అదే ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి…

Read More

పుల్వామా అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్& ఆపరేషన్ వాలెంటైన్ టీంమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్ర బృందం పుల్వామా స్మారక ప్రదేశాన్ని సందర్శించింది. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భారత భద్రతా సిబ్బందిని తీసుకువెళుతున్న వాహనాల కాన్వాయ్‌పై జరిగిన ఉగ్ర దాడిలో40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు వరుణ్ తేజ్, చిత్ర బృందం ఘనంగా నివాళులర్పించారు.ఆపరేషన్ వాలెంటైన్ భారతదేశం వైమానిక దళ ధైర్య సాహసాలు, త్యాగాల స్ఫూర్తితో నిజమైన సంఘటనల ప్రేరణతో రూపొందించారు. ఇది దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్. మన వైమానిక దళ వీరుల అసమానమైన స్ఫూర్తిని, పోరాటాన్ని, భయంకరమైన వైమానిక దాడులలో ఎదుర్కొన్న సవాళ్లను అద్భుతంగాచుపించనున్నారు.ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. గ్రిప్పింగ్ టీజర్, వందేమాతరం, గగనాల చార్ట్ బస్టర్…

Read More

ఆహాలో ఫిబ్రవరి 16న రాబోతోన్న ‘భామా కలాపం 2’ని అందరూ ఆదరించండి.. ప్రెస్ మీట్‌లో ప్రియమణిఆహా స్టూడియోస్‌తో కలిసి బాపినీడు, సుధీర్ ఈదర అసోసియేషన్ డ్రీమ్ ఫార్మర్స్ ‘భామా కలాపం 2’ నిర్మించారు. ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అభిమన్యు తడిమేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ‘భామా కలాపం 2’ ఫిబ్రవరి 16న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించారు. ఈ ఈవెంట్‌లో ప్రియమణి మాట్లాడుతూ.. ‘భామా కలాపం 2లో అన్నీ డబుల్ ఉంటాయి. ఎక్కువ థ్రిల్స్, ట్విస్ట్‌లుంటాయి. అంతే కాకుండా ఈ సారి కాస్త డేంజరస్‌గా కూడా ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలంటే సినిమాను చూడాలి. మా దర్శకుడు అభిమన్యుతో రెండో సినిమా చేస్తున్నాను. ఆయన తక్కువగా మాట్లాడతారు.. కానీ పని అద్భుతంగా చేస్తారు. మాటలు…

Read More

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, గోపీనాథ్ నారాయణమూర్తి, న్యూ నార్మల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్‌ హోల్సమ్ ఎంటర్ టైనర్ టైటిల్ ‘బంగారు గుడ్డు’- ఫస్ట్ లుక్ విడుదల  బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా గోపీనాథ్ నారాయణమూర్తి దర్శకత్వంలో న్యూ నార్మల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ,  పీవీఎస్ గరుడ వేగ లాంటి సూపర్ హిట్ అందించిన జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్స్ పై కేఎం ఇలంచెజియన్ & ఎం. కోటేశ్వర రాజు తెలుగు, తమిళ ద్విభాష చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హోల్సమ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘బంగారు గుడ్డు’ అనే క్యాచి టైటిల్ పెట్టారు.  మంచి భావోద్వేగాలతో కూడిన వినోదంతో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ వాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా క్యిరియాసిటీని పెంచింది. వాలంటైన్స్ డే రోజున టైటిల్ లుక్ ని ఎందుకు విడుదల చేశామో సినిమా…

Read More

భూములిచ్చిన రైతుల సంఘర్షణ, పోరాటమే ‘రాజధాని ఫైల్స్’. ఇది పొలిటికల్ సినిమా కాదు.. ప్రజల సినిమా. యూనివర్సల్ గా అందరికీ నచ్చుతుంది: డైరెక్టర్ భానువాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’. శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై భాను దర్శకత్వంలో, కంఠంనేని రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. ఇటివలే విడుదలైన ట్రైలర్ అద్భుతమై స్పందనతో సంచలనం సృష్టించింది. ఈ చిత్రం ఫిబ్రవరి 15న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు భాను విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.  అమరావతి ఫైల్స్ పేరుని ‘రాజధాని ఫైల్స్’ గా మార్చడానికి కారణం ?-మొదట అమరావతి ఫైల్స్ పేరుతోనే తీశాం. సెన్సార్ కి వెళ్ళినప్పుడు ఫిక్షనల్ చేస్తేనే సెన్సార్ ఇస్తామని చెప్పారు. వారు చెప్పిన కరెక్షన్స్ చేశాం. టైటిల్ ని రాజధాని ఫైల్స్ గా…

Read More

పలాస 1978’లో అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు రక్షిత్ అట్లూరి. అలాంటి రక్షిత్ అట్లూరి ప్రస్తుతం పూర్తి ప్రేమ కథా చిత్రంతో రాబోతోన్నారు. రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలి హీరోయిన్‌గా ‘శశివదనే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రచయిత, దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన చేసిన ఈ చిత్రాన్ని అహితేజ బెల్లంకొండ నిర్మించారు. ఇది AG ఫిల్మ్ కంపెనీ, SVS స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.శశి వదనే సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ అందరినీ ఆకట్టుకుంది. టీజర్‌తో ఈ చిత్రం ఎలా ఉంటుంది.. మళ్లీ గోదావరి జిల్లాల అందాలను ఎలా చూపించబోతోన్నారు అనే దానిపై ఓ స్పష్టత వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ వదిలిన పోస్టర్ సైతం అందరినీ ఆకట్టుకుంటోంది.ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ‘మనసులో పుట్టే…

Read More

స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణం లో   తెరకెక్కుతున్న ద్విభాష చిత్రం “రామం రాఘవం”.  నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ప్రేమికుల రోజు సందర్భంగా రామం రాఘవం చిత్ర గ్లిమ్స్ ను హీరో ఉస్తాద్ రామ్ పోతినేని తన ట్విట్టర్ ఖాతాలో డిజిటల్ విడుదల చేసి చిత్రం పెద్ద విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.. అలాగే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ మీడియా గ్లిమ్ ను రిలీజ్ చేసిన అనంతరం మాట్లాడుతూ… ధనరాజ్ నటుడిగా బిజీగా ఉన్నా.. ఒక మంచి కథను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో రామం రాఘవం సినిమాను తీశారు. గ్లిమ్ చాలా ఆసక్తికరంగా ఉంది, ఎమోషనల్ జర్నీ తో రాబోతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రేమికుల రోజును తండ్రి కొడుకుల మధ్య ఉన్న బాండింగ్ ను…

Read More

మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, హరీష్ శంకర్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్‌ దర్శకత్వంలో చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్‌’లో ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే తో అందమైన లవ్ ట్రాక్ ఉంటుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ రవితేజ, భాగ్యశ్రీ ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నట్లు చూపించే రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ మ్యాజికల్ మాస్ కాంబోలో రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇటివలే చిత్ర యూనిట్ కారంపూడిలో షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.’నామ్ తో సునా హోగా’ అనే ట్యాగ్‌లైన్‌ తో…

Read More

మైత్రీ మూవీ మేకర్స్, ఫణీంద్ర నర్సెట్టి సినిమా ఆసక్తికరమైన టైటిల్ ‘8 వసంతాలు’మోస్ట్ సక్సెస్ ఫుల్  పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ హై బడ్జెట్‌లో స్టార్ హీరోల సినిమాలను నిర్మించడంతో పాటు,  ఆసక్తికరమైన వినూత్నమైన కాన్సెప్ట్‌లతో కూడిన చిత్రాలనీ రూపొందిస్తున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫణీంద్ర నర్సెట్టితో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు.అవార్డ్ విన్నింగ్ బ్లాక్ బస్టర్ షార్ట్ ఫిల్మ్ మధురం తీసి, విమర్శకుల ప్రశంసలు అందుకుని, ‘మను’ సినిమాతో తన ఫీచర్ ఫిల్మ్ దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఫణీంద్ర నర్సెట్టి ‘8 వసంతాలు’ అనే మరో ఆసక్తికరమైన చిత్రంతో రాబోతున్నాడు.8 వసంతాలు అంటే ‘8 స్ప్రింగ్స్’, ఈ న్యూ ఏజ్ రోమాన్స్ డ్రామా, ఇది 8 సంవత్సరాల కాలంలో కాలక్రమానుసారంగా సాగే కథనం, ఒక అందమైన యువతి జీవితంలోని ఒడిదుడుకులు, ఆసక్తికరమైన ప్రయాణాన్ని ఎక్స్ ఫ్లోర్ చేయనుంది.  టైటిల్, టైటిల్ పోస్టర్‌తో దర్శకుడు తన వినూత్న…

Read More

వాలంటైన్స్ డే కానుక‌గా బ్యూటిఫుల్ ల‌వ్‌స్టోరి ఉషా ప‌రిణయం ఫ‌స్ట్ లుక్ విడుద‌లతెలుగు సినీ రంగంలో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన కె.విజ‌య్‌భాస్క‌ర్ మ‌ళ్లీ ఓ స‌రికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్టాడు. నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఉషా ప‌రిణ‌యం  బ్యూటిఫుల్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. క్రాఫ్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపైకె.విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో విజ‌య్‌భాస్క‌ర్ త‌న‌యుడు  శ్రీ‌క‌మ‌ల్ హీరోగా న‌టిస్తుండ‌గా,   తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ‌తెలుగ‌మ్మాయి ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతుంది. వాలంటైన్స్ డే సంద‌ర్బంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన చిత్రీక‌ర‌ణ‌తో టాకీపార్ట్ పూర్త‌యింద‌ని, త్వ‌ర‌లోనే పాట‌ల చిత్రీక‌ర‌ణ‌కు విదేశాల‌కు వెళుతున్నాన‌మ‌ని చిత్ర…

Read More

గల్లీ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘పరాక్రమం’ చిత్రం 2024 సమ్మర్ లో విడుదలకు సిద్ధం అవుతోంది.. గతంలో డిజిటల్ లో విడుదల అయిన ‘మాంగల్యం’ చిత్రం బండి సరోజ్ కుమార్ కి మంచి పేరు సంపాదించి పెట్టింది. ఇప్పుడు పరాక్రమం చిత్రం గల్లీ క్రికెట్ నేపథ్యంలో ఉంటుంది. సినిమా అభిమానులకి, క్రికెట్ అభిమానులకు మరియు బండి సరోజ్ కుమార్ ఫాన్స్ కి ఈ చిత్రం అలరించబోతోంది.బండి సరోజ్ కుమార్ పరాక్రమం చిత్రంలో హీరో గా నటించడమే కాకుండా దర్శకత్వం, సంగీతం, ఎడిటింగ్, రచన, పాటలు మరియు నిర్మాతగా కూడా వ్యవహరించారు. గతంలో తన మూడు సినిమాలు డిజిటల్ లో ‘వాచ్ అండ్ పే’ (డబ్బు కట్టి సినిమా చూసే పద్ధతి) ద్వారా విడుదల చేసి, విజయం సాధించారు, ఇప్పుడు ఈ పరాక్రమం చిత్రాన్ని థియేటర్ లో తన సొంత బ్యానర్ బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ (BSK Mainstream) ద్వారా…

Read More

దీపక్ సరోజ్, వి యశస్వీ ‘సిద్ధార్థ్ రాయ్’ నుంచి పవర్ ఫుల్ ఎమోషనల్ సాంగ్ ‘సిద్ధాంతం’ విడుదల  టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో పనిచేసిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ ‘సిద్ధార్థ్ రాయ్’ తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల వద్ద పనిచేసిన వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ‘సిద్ధాంతం’ పాటని విడుదల చేశారు. సినిమాలో చాలా కీలకమైన ఈ పాటని రధన్ పవర్ ఫుల్ ఎమోషనల్ నెంబర్ గా కంపోజ్ చేశారు. బాలాజీ రాసిన సాహిత్యం కథలోని లోతుని డెప్త్ ని తెలియజేస్తుంది. సింగర్ శరత్ సంతోష్ మనసుని హత్తుకునేలా పాటని ఆలపించాడు.ఎమోషనల్ నెంబర్ లో దీపక్ సరోజ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్ ట్రార్డినరీ…

Read More

రాజధాని ఫైల్స్’ ప్రజల సినిమా. సామాజిక బాధ్యతగా తీసిన ఈ చిత్రానికి అఖండ విజయం అందించి రైతులకు సంఘీభావాన్ని తెలియజేయాలని ప్రేక్షకులని కోరుతున్నాం: ప్రెస్ మీట్ లో ‘రాజధాని ఫైల్స్’ చిత్ర యూనిట్వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’. శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై భాను దర్శకత్వంలో, కంఠంనేని రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. ఇటివలే విడుదలైన ట్రైలర్ అద్భుతమై స్పందనతో సంచలనం  సృష్టించింది. ఈ చిత్రం ఫిబ్రవరి 15న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.ప్రెస్ మీట్ లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. రైతులు స్వచ్చందంగా ఇన్ని వేల ఎకరాల భూములు ఇస్తే దానిని హేళన చేస్తూ, వాళ్ళని క్షోభగురి చేసిన పరిణామాలు చోటు చేసుకున్నాయి. దానిని స్ఫూర్తిగా తీసుకొని రైతుల…

Read More

ట్రైలర్ తో సంచలనం సృష్టించిన మమ్ముట్టి ‘భ్రమయుగం’ చిత్రం విడుదలపై కీలక ప్రకటనవైవిధ్యమైన చిత్రాలతో అలరించే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతగానో చేరువయ్యారు. ఇప్పుడు ఆయన మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమయ్యారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మలయాళ చిత్రం ‘భ్రమయుగం’. హారర్-థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడం కోసం ప్రత్యేకంగా ఏర్పడిన నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌.. వైనాట్ స్టూడియోస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది.ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకోవడంతో ‘భ్రమయుగం’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ కట్టిపడేసింది. ఫిబ్రవరి 10న అబు దాబిలో జరిగిన వేడుకలో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల…

Read More

నేటి యువ‌త‌తో పాటు అంద‌రూ ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించాల‌ని, రోడ్డు ప్రమాదాలు జ‌ర‌గ‌కుండా అవేర్‌నెస్‌తో వుండాల‌ని సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌ అన్నారు. జాతీయ రోడ్డు భ‌ద్ర‌తా మాసోత్స‌వాల్లో భాగంగా సోమ‌వారం హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీస్ (వెస్ట్ జోన్‌) ఆధ్వ‌ర్యంలో బంజ‌రా హిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేష‌న‌ల్ సోసైటీ ఆడిటోరియంలో ర‌హ‌దారి భ‌ద్ర‌తా చైత‌న్య స‌ద‌స్సు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి విశిష్ట అతిథిగా హాజర‌య్యారు క‌థానాయ‌కుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న త‌న‌కు ఇది రెండో జీవితమ‌ని తెలిపారు. ప్ర‌మాదం నుంచి బ‌య‌ప‌డ‌టానికి హెల్మెట్ కార‌ణమైంద‌ని, అభిమానులు, మీలాంటి వాళ్లు, ప్రేక్ష‌కుల ఆశ్సీస్సుల‌తో ఈ రోజు మీ ముందు ఇలా నిల‌బ‌డ్డానికి కార‌ణ‌మ‌ని చెప్పారు. త‌ప్ప‌కుండా టూవీల‌ర్ డ్రైవ్ చేసే వాళ్లంతా హెల్మెట్‌ను త‌ప్ప‌క ధ‌రించాల‌ని, కార్లు డ్రైవ్ చేసే వారు సీటు బెల్డ్‌లు విధిగా ధ‌రించాల‌ని, ఈ సంద‌ర్భంగా…

Read More

యంగ్ టాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. వి.ఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం ఫిబ్రవరి16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో నిర్మాత రాజేష్ దండా ‘ఊరు పేరు భైరవకోన’ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.• ఊరు పేరు భైరవకోన’ ఎలా మొదలైయింది ?-సందీప్ కిషన్, నేను, విఐ ఆనంద్ మంచి ఫ్రెండ్స్. డిస్ట్రిబ్యుటర్ గా 12 ఏళ్ల పాటు చేశాను. నిర్మాతగా చేయాలనుకున్నపుడు హాస్య మూవీస్ బ్యానర్‌ లో మొదట అనుకున్న సినిమానే ‘ఊరు పేరు…

Read More

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు దూరవిద్యా కేంద్రం కోర్సుల వివరాలకు ఆహ్వానం పలుకుతుంది పి.జి. డిప్లొమా కోర్సులు – P.G. DIPLOMA COURSES:1. టి.వి. జర్నలిజం – TV. JOURNALISM అర్హత: డిగ్రీకాలం: సంవత్సరంమాధ్యమం: తెలుగు అడ్మిషన్: రూ. 300 కోర్స్ ఫీజు: రూ 6300 , ఎగ్జామ్ ఫీజు: రూ 1200 2. జ్యోతిరాస్తు – JYOTHIRVASTHU అర్హత: డిగ్రీకాలం: సంవత్సరంమాధ్యమం: తెలుగు అడ్మిషన్: రూ. 300 కోర్స్ ఫీజు: రూ 4800 ఎగ్జామ్ ఫీజు: రూ 1200 డిప్లొమా కోర్సులు – DIPLOMA COURSES 3. లలిత సంగీతం – LIGHT MUSIC- FILM WRITING4. సినిమా రచన5. జ్యోతిష – JYOTHISHAM • సర్టిఫికెట్ కోర్సులు CERTIFICAT COURSES6. జ్యోతిష- JYOTHISHAM7. సంగీత విశారద – SANGEETA VISARADA8. ఆధునిక తెలుగు – CERTIFICATE

Read More

అభిషేక్ పచ్చిపాల ,నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి మరియు సతీష్ సారిపల్లి ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా- “జస్ట్ ఎ మినిట్ ” రెడ్ స్వాన్ ఎంటర్టై్మెంట్ మరియు కార్తీక్ ధర్మపురి ప్రెజెంట్స్ బ్యానర్లపై అర్షద్ తన్వీర్ మరియు డా. ప్రకాష్ ధర్మపురి నిర్మాతలుగా, పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రెండోవ సాంగ్ రిలీజ్.ఈ సందర్భంగా సినిమా దర్శకుడు పూర్ణస్ యశ్వంత్ మాట్లాడుతూ : గతంలో మేం రిలీజ్ చేసిన ఫస్ట్-లుక్‌ కి చాలా మంచి స్పందన లభించింది. తర్వాత టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తూ, డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ అని మెచ్చుకోవడం మాకు మంచి ధైర్యాన్నిస్తోంది. అతి త్వరలో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నాం. ట్రైలర్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ రివీల్ అవుతాయి. గతంలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన…

Read More

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మేడిన్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రామిస్ చేసిన గ్రిప్పింగ్ టీజర్, వందేమాతరం, గగనాల చార్ట్ బస్టర్ సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఐఏఎఫ్ ఆఫీసర్‌గా నటిస్తుండగా, మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ రుహాని శర్మ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.తాజాగా మేకర్స్ రుహాని శర్మను తాన్య శర్మగా పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఎయిర్ ఫోర్స్ పైలెట్ యూనిఫాంలో డైనమిక్ గా కనిపించింది రుహాని శర్మ.’ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటాన్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొనే సవాళ్లను అద్భుతంగా చూపించబోతుంది.ఆపరేషన్ వాలెంటైన్’ కు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా…

Read More

‘ఊరు పేరు భైరవకోన’ గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సూపర్ నేచురల్ ఫాంటసీ ఎంటర్ టైనర్. యూత్ అండ్ ఫ్యామిలీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు: డైరెక్టర్ విఐ ఆనంద్యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం ఈ సినిమాకి వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించిన ఈ సినిమా హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం ఫిబ్రవరి16 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు విఐ ఆనంద్ ‘ఊరు పేరు భైరవకోన’ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు. ఊరు…

Read More

ప్రతిష్టాత్మకమైన బిహైండ్‌వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమర్స్ ఈవెంట్ అనేక మంది ప్రముఖ స్టార్స్ సమక్షంలో చాలా గ్రాండ్ గా జరిగింది. విమర్శకుల ప్రశంసలు, కమర్షియల్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న 3 అవార్డులను గెలుచుకుంది.హాయ్ నాన్నలో తన పాత్రకు ప్రశంసలు అందుకున్న నాని, ది బిహైండ్‌వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమ్ యాక్టర్ ఇన్ ఎ లీడ్ రోల్ 2023 అవార్డును అందుకున్నారు. మృణాల్ ఠాకూర్, హాయ్ నాన్నాలో తన అద్భుతమైన నటనకు గాను బిహైండ్‌వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమ్ ఉత్తమ నటి అవార్డుని అందుకుంది.తన అద్భుతమైన విజన్ ‘హాయ్ నాన్న’ను డైరెక్ట్ చేసిన దర్శకుడు శౌర్యవ్ 2023 బిహైండ్‌వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమ్ ఫిల్మ్‌మేకర్‌ అవార్డ్ ని అందుకున్నారు.హాయ్ నాన్నా చిత్రం థియేటర్లలో విడుదలైన తర్వాత యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. OTT విడుదలైన తర్వాత ఈ చిత్రం అద్భుతమైన…

Read More

మనిషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం లైఫ్ లవ్ యువర్ ఫాదర్. మనిషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ గతంలో శుభలగ్నం, యమలీల, మాయలోడు, వినోదం లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సంస్థ శ్రీ హర్ష, కషిక కపూర్ హీరో హీరోయిన్లుగా పవన్ కేతరాజు దర్శకత్వంలో కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ ప్రొడ్యూసర్స్ గా వస్తున్న సినిమా LYF ‘Love Your Father’ మూవీ పూజా కార్యక్రమం మల్లారెడ్డి కాలేజీలో చాలా ఘనంగా జరిగింది. ఈ మూవీ కెమెరా స్విచ్ ఆన్ చేసింది నెంబర్ ఆఫ్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కామకూర శాలిని. క్లాప్ కొట్టింది సిఎంఆర్ గ్రూప్ చైర్మన్ గోపాల్ రెడ్డి గారు. స్క్రిప్ట్ నీ అందించింది గోపాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, శ్రీశైలం రెడ్డి మరియు సంతోష్ రెడ్డి. ఈ వేడుకలో…

Read More

బాబీ సింహా,వేదిక,అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే నటీనటులుగా స‌మ‌ర్ వీర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మించిన చిత్రం ‘రజాకార్’. ఈ చిత్రం నుంచి ఆల్రెడీ ‘భారతి భారతి ఉయ్యాలో’ అనే పాటను విడుదల చేశారన్న సంగతి తెలిసిందే.మార్చి 1న ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మరాఠీ, హిందీ భాషల్లోనూ సినిమాను విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘రజాకార్ లాంటి చిత్రాన్ని నిర్మించిన గూడూరు నారాయణ రెడ్డి గారికి థాంక్స్. చరిత్ర గురించి యువతకు చెప్పాలని ఈ చిత్రాన్ని తీశారు. ఎంతో మంది త్యాగాలు చేస్తే ఈ రోజు మనం ప్రశాంతంగా ఉన్నాం. చరిత్రను ఇలా దృశ్యరూపంలో చూపిస్తే మరింతగా…

Read More

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం పదవి కోసం 5 వేల కోట్లు రూపాయలు సిద్ధం చేసి పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ డబ్బు ఎక్కడ దాచి పెట్టారో వెలికి తీయాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కవిత,సంతోష్ కూడా కొన్ని వేల కోట్లు బ్లాక్ చేశారని ఆరోపించారు. ఒక్కరిని కూడా వదిలి పెట్టబోమని, బీఆర్ఎస్ హయాంలో అవినీతికి పాల్పడిన అందరి భాగోతం బయట పెడుతామని అన్నారు. హరీష్ రావు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏతులు ,అపొజిషన్లో ఉన్నప్పుడు నీతులు చెబుతున్నారని తెలిపారు.హరీష్ రావు నిజంగా పాపాల భైరవుడు,పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూలు చేస్తుంటే హరీష్ రావుకు నిద్ర పట్టడం లేదని అన్నారు. బీ.అర్.స్ ప్రభుత్వంలో ప్రజల సొమ్ము కేసీఆర్ అనుభవించారని…

Read More

నల్లగొండ జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు అని ఇక్కడ కుర్చీ వేసుకుని ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తానని మాట తప్పాడు.కాబట్టి ముక్కు నేలకు రాసి ఇక్కడి ప్రజలకు క్షమాపణలు తరువాతే కేసీఆర్ నల్లగొండలో అడుగుపెట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.ఈ నెల 13న కేసీఆర్ నల్లగొండ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపడుతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ను విమర్శించేటోళ్లు అందరూ మూర్ఖులు అనిమండి పడ్డారు.మాజీ మంత్రులు హరీశ్ ,కేటీఆర్ పనికిరాని లీడర్లు అని వారిపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత నీటి కేటాయింపులకు అంగీకరించింది,నల్లగొండను నట్టేటముంచిన ఘనత గత ప్రభుత్వానిదే అని ప్రజలు బీఆర్ఎస్ మోసాన్ని గుర్తించారు కాబట్టే భారీ మెజార్టీలతో వారిని ఓడగొట్టారనీ ప్రజల తీర్పు చూశాక కూడా కేసీఆర్ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వస్తున్నారు అని నిలదీశాడు.

Read More

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. • ఆరు గ్యారెంటీల కోసం రూ 53,196 కోట్లు• పరిశ్రమల శాఖ రూ 2,543 కోట్లు•ఐటి శాఖకు రూ 774 కోట్లు• పంచాయతీ రాజ్ కు రూ 40,080 కోట్లు•పురపాలక శాఖకు రూ 11,692 కోట్లు•మూసీ రివర్ ఫ్రాంట్ కు రూ 1000 కోట్లు•వ్యవసాయ శాఖకు రూ 19,746 కోట్లు•ఎస్సీ,ఎస్టీ గురుకుల భవన నిర్మాణాలకు రూ 1250 కోట్లు•ఎస్సీ సంక్షేమం కోసం రూ 21,874 కోట్లు•ఎస్టీ సంక్షేమం కోసం రూ 13,013 కోట్లు• మైనార్టీ సంక్షేమంకు రూ 2,262 కోట్లు•బీసీ సంక్షేమం రూ 8,000 కోట్లు•విద్యా రంగానికి రూ 21,389 కోట్లు•తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ 500 కోట్లు•యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ 500 కోట్లు•వైద్య రంగానికి రూ 11,500 కోట్లు•విద్యుత్ గృహ జ్యోతికి రూ 2,418కోట్లు•విద్యుత్ సంస్థలకు…

Read More

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి వేడకల్లో పాల్గొన్న కంచ ఐలయ్య మాట్లాడుతూ .. కేసీఆర్,కవితపై కొన్ని సెన్షేషనల్ కామెంట్స్ చేశారు.గద్దర్ బతికుండగా రెండు మహా గొప్ప అవమానాలు భరించిండని, అధికారం లోకి వచ్చిన తర్వాత ఈ రెండు అవమానాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి సమాధానం చెప్పిందని సీఎం రేవంత్ రెడ్డిని కొనియాడారు.• పోయిన ముఖ్యమంత్రి ఇంటిముందు రెండు నిమిషాలు కలిసి మాట్లాడతానని ఆ బార్కెడ్ల ముందు కూర్చున్నాడు కానీ ఆయనను లోపలికి రానివ్వలేదు..మాట్లాడనివ్వలేదు.ప్రగతి భవన్ ఎదుట గేటు దగ్గర ఎండలో 3 గంటలపాటు కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం వేచి చూశారని ఇది మొదటి అవమానం అని, అలా గద్దర్ ని అవమానపరిచిన బారీకేడ్లను ప్రమాణ స్వీకారం రోజు బద్దలు కొట్టించారని అన్నారు. • అలాగే ఉద్యమ సమయంలో కేసీఆర్ ని విమర్శించాడని, ఆ ఫుట్ పాత్ గాడా నన్ను విమర్శించేది అని కేసీఆర్ గద్దర్ ను తిట్టారని, ఈ…

Read More

డ్రీమ్ టీమ్ బ్యానర్ పై , దర్శక నిర్మాత, కధానాయకుడు హరనాధ్ పొలిచెర్ల చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ డ్రిల్. కారుణ్య చౌదరి హీరోయిన్ గా , భవ్య, నిషిగంధ ప్రధాన పాత్రల్లో, తనికెళ్ళ భరణి ,  రఘుబాబు , జెమినీ సురేష్, కోటేశ్వరరావు, సత్తన్న, విశ్వ , జబ్బర్దస్థ్ ఫణి ప్రధాన తారాగణంగా చేసిన డ్రిల్ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 16 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా చిత్ర  టీజర్ ను విడుదల చేశారు.అనంతరం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా వచ్చిన ఆర్ .పి .పట్నాయక్ మాట్లాడుతూ…అమెరికాలో డాక్టర్ గా సెటిల్ అయిన హరనాథ్ పొలిచెర్ల ఇండియాకు వచ్చి ఎంతోమంది ఆర్థిస్టులకు అవకాశం కల్పిస్తూ తెలుగు సినిమా చెయ్యడం చాలా సంతోషంగా ఉంది. తను ఇలాగే ఇంకా ఎన్నో సినిమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీకి చేదోడు వాదోడుగా వుండాలని మనస్ఫూర్తిగా  కోరుకుంటున్నాను.…

Read More

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు సోమవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి చిత్ర పరిశ్రమ తరుపున బహుమతిని అందజేశారు. ఇక ఈ భేటీలో అనేక విషయాల మీద ఇరువురు చర్చించారు. ఈ భేటీ గురించి మా అధ్యక్షుడు విష్ణు మంచు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.‘తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఎన్నో విషయాల మీద చర్చించాం. తెలుగు చిత్ర పరిశ్రమ తరుపున డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమాల గురించి మాట్లాడాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, డ్రగ్స్ ఫ్రీ సొసైటి కోసం ప్రయత్నిస్తున్న ఇలాంటి ప్రభుత్వంతో మేమంతా ఐకమత్యంగా కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నామని విష్ణు మంచు తెలిపారు.

Read More

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసు విషయంలో పంజాగుట్ట సీఐ సస్పెండ్ తో పాటు పీఎస్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయిన విషయం మరువక ముందే.. ఇప్పుడు మరో సీఐపై సస్పెన్షన్ వేటు పడింది.ఏం జరిగిందంటే..భర్త వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసేందుకు మియార్‌పూర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. అయితే ఈ బాధిత మహిళ పట్ల మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ అసభ్యకరంగా ప్రవర్తించాడు.ఈ విషయంపై సదరు మహిళ సైబరాబాద్ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. దీంతో మహిళ ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణ చేయగా సీఐ ప్రేమ్ కుమార్ రాసలీలల బాగోతం అంతా బయటపడింది. లోతుగా విచారణ చేపట్టిన సీపీ అవినాష్‌ మహంతి ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Read More

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అదే ఉత్సాహంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి పట్టు నిలుపుకోనే దిశగా పావులు కదుపుతుంది. అందులో భాగంగా ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే విధానాన్ని అవలంబించింది. ఇప్పుడు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుంది. ఈరోజు నుంచి ఫిబ్రవరి 3 వరకు అప్లికేషన్లను స్వీకరించనుంది. దీనికోసం గాంధీభవన్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది. జనరల్, బీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 50,000 గా పార్టీ నిర్ణయించింది. ఇక ఎస్సీ,ఎస్టీ,అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 25 వేలుగా నిర్ణయించింది.అప్లికేషన్ ఫీజును డీడీ రూపంలో చెల్లించాలని అభ్యర్థులకు పార్టీ సూచించింది. దరఖాస్తు ఫార్మ్స్ ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయని గాంధీభవన్ సిబ్బంది తెలిపారు. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీకి భారీగానే అభ్యర్థులు…

Read More

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో అవినీతి ఆరోపణలపై సర్కార్ సీరియస్ గా స్పందిస్తోంది . ఇప్పటికే హైదరాబాద్ నగర శివార్లల్లో మూకుమ్మడి బదిలీలకు రంగం సిద్ధం చేసింది.దీనిలో భాగంగా అవినీతి ఆరోపణలపై విచారణకు స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ పోలీసులను ప్రభుత్వం రంగంలోకి దింపింది. భూ వివాదాలల్లో జోక్యం చేసుకుంటున్న పోలీస్ అధికారుల సమాచారాన్ని ఇంటిలిజెన్స్ ద్వారా సేకరిస్తోంది.ఇప్పటికే ఉన్నతాధికారులు అవినీతి అధికారుల చిట్టా రాబట్టే పనిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులపైన కూడా ఎఫెక్ట్ ఉండబోతుంది. ఇప్పటికే 52 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. త్వరలోనే బడా పోలీస్ అధికారులు కూడా బదిలీ అయ్యే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో భారీగా కీలక అధికారుల బదిలీలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.రాష్ర్టంలో ఎలాంటి పైరవీలు కుదరవనీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.దీంతో పోలీస్‌ శాఖలో ఇకపై పోస్టింగ్‌ల విషయంలో రాజకీయ…

Read More

ప్రముఖ వ్యాపారవేత్త,రాజకీయ వేత్త, సినీ నిర్మాత అంబికా కృష్ణ ఈ రోజు (జనవరి 29న) ఉదయం చిరంజీవి నివాసం లో కలిసి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా చిరంజీవికి అభినందనలు తెలియచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ‘స్వయంకృషి’తో సాధించుకున్న మిత్రులు చిరంజీవి గారిని భారతావని లో రెండవ ప్రతిష్టాత్మక ‘పద్మవిభూషణ్’ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన చిరంజీవి గారు తనకు వచ్చిన ప్రతి పాత్రను, చిత్రాన్నీ మనసుపెట్టి చేశారు. కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. అగ్రశ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతే కాకుండా సామాజిక సేవా రంగంలో చిరంజీవి గారు చేస్తున్న సేవలు ఎందరికో మరెందరికో ఆదర్శంగా నిలిచాయి. అయోధ్య బాల రామయ్య ను దర్శించుకున్న మూడు రోజుల్లోనే ఈ పురస్కారం రావడం విశేషం. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా చిరంజీవి గారికి…

Read More

సికింద్రాబాద్ పీజీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో మొన్న శుక్రవారం రాత్రి ఇద్దరు ఆగంతకులు హాస్టల్‌ లోకి చొరబడగా.. హాస్టల్లో ఉండే విద్యార్థినులు అప్రమత్తమై ఆ అగంతకున్ని పట్టుకున్నారు.ఆ తరువాత తమకు రక్షణ కావాలి అంటూ ఆందోళన చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఎప్పుడూ కాలేజీ ప్రాంగణంలో కనిపించని పోలీసులు..ఈ ఘటన తర్వాత సుమారు పది మంది పోలీసులు శని,ఆదివారాలు పొద్దంతా అక్కడే కాలేజ్ లో గస్తి నిర్వహించారు. దీనిపై ప్రతిపక్షం టీవీ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా.. పీజీ కాలేజ్ హాస్టల్ దగ్గర సీసీ కెమెరాలు లేకపోవడం, కాలేజీ ప్రిన్సిపల్, యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ నిర్లక్ష్యం ఉందని గత పదిఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు ,కాలేజీలకు మెరుగైన వసతులు కల్పించకపోవడం నిధులు కేటాయించకపోవడం కారణం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Read More

అధికారంలోకి వస్తే ఏక కాలంలో అప్పు,వడ్డీ కలిపి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు మేనిఫెస్టోలోనూ ప్రకటించింది.అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే దీనిపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొందరు నేతలే తలో మాట మాట్లాడుతున్నారు.రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి అని ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నేను చెప్పింది అలా కాదు అని వివరణ ఇస్తు తెల్లారే మరొక ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇక భిక్కనూరు సింగిల్ విండో చైర్మన్ గంగల భూమయ్య మాట్లాడుతూ..వ్యవసాయ అవసరాల కోసం తీసుకున్న లోన్లను రైతులు సకాలంలో చెల్లించాలని పేర్కొన్నారు.అంతేకాదు స్వల్పకాలిక,దీర్ఘకాలిక రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించని వారికి డిమాండ్ నోటీసులు ఇవ్వాలని ఆ సమావేశంలో తీర్మానం చేశారు. అయితే ఈ ప్రకటన ఈయనే చేశాడా..? ప్రభుత్వంలోని పెద్దలు చేయించారా ..? అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇలాంటి ప్రకటనల…

Read More

వరిసాగు చేయాలంటే ముందుగా నారు పోసి 30 రోజులు అయ్యాక వరి నాటు వేయడం. చాలా మంది ఇదే పద్ధతిని అనుసరించేవారు. ఈ పద్ధతులు సాగు చేయాలంటే ఎకరాకి 6 నుండి 8 వేల రూపాయల ఖర్చు పైగా ఇప్పుడు కూలీల కొరత తీవ్రంగా ఉండడంతో రైతులు వినూత్న పద్ధతిలో సాగు చేస్తున్నారు. వడ్లను వెదజల్లే పద్ధతిని అనుసరిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని సాధిస్తున్నారు. సాధారణ పద్దతిలో సాగు చేయాలంటే.. నాటు వేయడానికి 1 ఎకరాకు 25 కేజీల విత్తనాలు కావాలి. 12 నుండి 14 మంది నాటు కూలీలు అవసరం ఉంటుంది దీనికి 6000 నుండి 8000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ పద్ధతి ద్వారా సాగు చేస్తే ఎకరాకు 20-30 క్వింటాల దిగుబడి వరకు వస్తుంది. వెదజల్లే పద్దతిలో ఒక ఎకరాకు 12 కేజీల విత్తనాలు సరిపోతుంది . పైగా ఎక్కువగా కూలీల అవసరం ఉండదు.…

Read More

“రుణమాఫీ”.. దీని ప్రభావం అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు అనేక పార్టీలు ఈ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాయి.గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ హామీ తోనే అధికారంలోకి వచ్చి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేకపోయింది. దీంతో 2023లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ హామీనీ నమ్మి అధికారాన్ని కట్టబెట్టారు.అయితే ఎన్నికల సమయంలోనే కాదు ఇప్పుడు కూడా దీని చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి. తాము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 తర్వాత ఏకకాలంలో రుణమాఫీ చేస్తాము అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు రుణమాఫీ చేస్తున్నాము. అదిగో, ఇదిగో అంటూ ఊరిస్తూనే ఉంది. రుణమాఫీ అమలు ఎప్పుడు చేస్తారో కాదు కదా అసలు ఇప్పటివరకు దానిపై ఒక స్పష్టతకు కూడా రానట్లే కనిపిస్తుంది. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంటే.. ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు గడవక ముందే టిఆర్ఎస్ పార్టీ వాళ్లు నిలదీయడమేంటని, రుణమాఫీ…

Read More

స్టోనెక్స్ బ్యానర్ పై పి బి వేలుమురుగన్ నిర్మాతగా,రామ్ ప్రభ దర్శకత్వంలో తెలుగు, తమిళ్, హిందీ భాషలలో నిర్మిస్తున్న చిత్రం “గ్యాంగ్ స్టర్” గ్రానైట్ స్లాబులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ వ్యాపార రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మాత వేలు మురుగన్. సినీ పరిశ్రమపై ఉన్న మక్కువతో ఈ చిత్రాన్ని నిర్మించారు. మూడు భాషల్లో రూపుదిద్దుకుంటున్న “గ్యాంగ్ స్టర్” చిత్రం మార్చి నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వేలు మురుగన్ మాట్లాడుతూ మార్కెటింగ్ స్కామ్ అనే నూత‌న‌ పాయింట్ పై సినిమా అంతా న‌డుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి పాయింట్ పై సినిమా రాలేద‌ని చెప్పాలి. ఇందులో హీరోలు ఎవ‌రు? విల‌న్స్ ఎవ‌రు? అనేది క్లైమాక్స్ వ‌ర‌కు తెలియ‌దు. ప్ర‌తి పాత్ర ఎంతో ఇంట్ర‌స్టింగ్ గా క్యూరియాసిటీ క‌లిగించే విధంగా ఉంటుంది. ద‌ర్శ‌కుడు రామ్ ప్రభ సినిమాను ఎంతో ఇంట్ర‌స్టింగ్ గా తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే ప‌లు చిత్రాల్లో…

Read More

తెలంగాణలో రెండు నెలల నుండే యాసంగి పొలం పనులు ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం పోలిస్తే తక్కువ విస్తీర్ణంలో వరి సాగు అవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో 50 శాతం మాత్రమే సాగు అయినట్లు సమాచారం.కొంతమంది రైతులు ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్న పరిస్థితి.నాటు కూలీలు, ఎరువు బస్తాలు ,దుక్కి దున్నిన ఖర్చులు కలిపి నాటు వరకే ఎకరాకు 20 వేల రూపాయల ఖర్చు వస్తుంది. రైతుబంధు సహాయం, వడ్ల పైసలు జమ ఆలస్యం అవ్వడంతో యసంగి సాగు పెట్టుబడికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. వడ్ల పైసల వారం రోజుల నుండి కొంత మంది జమ అయ్యాయి. దీంతో మిగతా రైతులు తమ ఖాతాల్లో రైతుబంధు డబ్బులు, ధాన్యం డబ్బులు జమైనాయో చెక్ చేసుకోవడానికి పాస్బుక్కులతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. యాసంగి పంటకు పెట్టబడి సహాయంగా ఇచ్చే ఎకరాకు 5000 రూపాయలు ఈ నెలాఖరులోగా జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.…

Read More

ఐదు గ్యారెంటీ హామీల పథకాల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.ఇది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కొనసాగింది.దీంతో కోట్లల్లో దరఖాస్తులు వచ్చాయి.వీటి కోసం ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం. ప్రస్తుతం ఈ దరఖాస్తులు అన్నింటిని కంప్యూటరీకరించే కార్యక్రమం పూర్తి కావస్తుంది. అయితే ఈ ప్రజా పాలన వెబ్సైట్లో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. ప్రజాపాలన వెబ్సైట్లోలో దరఖాస్తు స్థితిని తెలుసుకునేందుకు ‘KNOW YOUR APPLICATION STATUS’ అనే ఆప్షన్ తీసుకొచ్చింది ప్రభుత్వం. దీనిపై క్లిక్ చేస్తే.. అప్లికేషన్ నంబర్ Online అని కనిపిస్తోంది. దీంట్లో దరఖాస్తుదారుని ఆప్లికేషన్ నెంబర్ ఎంట్రీ చేసి కింద Captcha ను పూర్తి చేయాలి.ఆ తర్వాత ‘View Status’ ఆప్షన్ పై క్లిక్ చేస్తే దరఖాస్తు స్థితి కనిపిస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇక అసలు విషయానికొస్తే ఐదు గ్యారంటీల పథకాల…

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వినియోగదారుడు తన న్యూహోలాండ్ Excel 4710 ట్రాక్టర్ సర్వీస్ కోసం 5 డిసెంబర్ 2022 రోజు కంపెనీని సంప్రదించాడు. అయితే కంపెనీ సర్వీస్ టికెట్ ఓపెన్ చేసి సంబంధిత ఆథరైజ్డ్ డీలర్ అయినా KS Tractors వరంగల్ కు కేటాయించి 48 గంటల్లో సర్వీస్ ఇస్తారని హామీ ఇచ్చింది. కానీ ks ట్రాక్టర్స్ డీలర్ సర్వీస్ ఇవ్వలేదు. 29 డిసెంబర్ 2022 రోజున శ్రీ లక్ష్మీ మోటార్స్ సిద్దిపేట, శ్రీలత ట్రాక్టర్స్ చొప్పదండి డీలర్లచే సర్వీస్ చేయబడింది. అయితే న్యూ హోలాండ్ కంపెనీ ఉత్పత్తులకు బదులు మార్కెట్లో దొరికే వేరే ఇతర నాసిరకం ఉత్పత్తులతో సర్వీస్ ఇచ్చారు. అయితే వినియోగదారుడు కంపెనీ ఉత్పత్తుల చేత సర్వీస్ ఇవ్వాలని కోరగా స్టాక్ లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. 14 జూన్ 2023 రోజున KS TRACTORS డీలర్ చే మరొక సర్వీస్ ఇవ్వబడింది. అయితే ట్రాక్టర్ వారంటీ…

Read More

ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందంటూ అధిష్టానం ప్రకటన. మాజీ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజును సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది.

Read More

• కవితకు ఈడి సమన్లతో బీఆర్ఎస్ లో ఆందోళన • ఇంకా సుప్రీంకోర్టులో లిస్ట్ కాని కవిత పిటీషన్ • న్యాయవాదులతో చర్చిస్తున్న కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది.ఇప్పుడు ఇది బీఆర్ఎస్ లో ఆందోళన కలిగిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కవిత లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో ఈ నోటీసులు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. గతంలోనూ కవితను ఈడీ మూడు సార్లు విచారించింది. తాజాగా.. మరోసారి విచారణకు రావాలంటూ కవితకు నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పెండింగ్ లోనే ఉంది. అయితే ఈడి విచారణకు హాజరు గురించి కవిత తన న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు సమాచారం.

Read More

ప్రముఖ సినీ నటుడు స్వర్గీయ కన్నడ ప్రభాకర్ తనయుడు వినోద్ ప్రభాకర్ హీరోగా నటించిన “మాదేవ” సినిమా అతి త్వరలో తెలుగు కన్నడ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రతిపక్షం టీవీ ఎక్స్ క్లూజివ్ గా మీకు అందిస్తోంది.ఈ చిత్రానికి మన తెలుగువాడు నవీన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. బెంగళూరులో స్థిరపడ్డ దర్శకుడు నవీన్ రెడ్డి ఈ చిత్రాన్ని హైటెక్నికల్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు.తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ స్టిల్స్ ఎక్స్ క్లూజివ్ గా ప్రతిపక్షం టీవీలో….

Read More

వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాలను రచిస్తోంది.దానిలో భాగంగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలను షర్మిలకు అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినట్టుగా సమాచారం దీంతో రెండు,మూడు రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే వైయస్సార్సీపీ అసంతృప్త నేతలు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉంటుందని,అంతేకాదు వైఎస్ షర్మిలను జగన్ పై పోటీ చేయిస్తే కాంగ్రెస్ కేడర్ లో ఉత్సాహాన్ని నింపడమే గాక రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుని ఓటు శాతం పెరిగే అవకాశం ఉంటుంది అని పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. షర్మిల తన కుమారుడి పెళ్లికి రాజకీయ ప్రముఖులను ఆహ్వానించడమే కాకుండా పనిలో పనిగా రాజకీయ అంశాలు…

Read More

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు.అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో పోలీస్ శాఖలో మొదటిసారిగా బదిలీలు జరిగాయి. ప్రస్తుతం కాటారంలో ప్రొబీషనరీ సర్వీస్‌లో ఉన్న కే ప్రసాద్‌ను మహాదేవపూర్ ఎస్.హెచ్.ఓ గా, ఇక్కడ ఎస్ఐ రాజకుమార్ ను భూపాలపల్లికి, మాధవ్‌ను రేగొండ నుండి మొగుళ్ళపల్లికి, ఎన్ రవికుమార్ ను భూపాలపల్లి నుండి రేగొండకు, శ్రీధర్ ను మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ నుండి భూపాల్ పల్లి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. దీంతో మిగతా సబ్ ఇన్స్పెక్టర్స్ లోనూ టెన్షన్ మొదలైంది అయితే ఇది సబ్ ఇన్స్పెక్టర్ వరకే పరిమితం అవుతుందా లేక డి.ఎస్.పిలు, సీఐలు కూడా ట్రాన్స్ఫర్ అవుతారా అని చర్చించుకుంటున్నారు.

Read More

అనన్య నాగళ్ళ,ధనుష్ రఘుముద్రి,సలోని, టెంపర్ వంశి మరియు మీసాల లక్ష్మణ్ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా- ‘తంత్ర’. ఫస్ట్ కాపీ మూవీస్ మరియు బి ద వే ఫిల్మ్స్ బ్యానర్లపై నరేష్ బాబు పి, రవిచైతన్య నిర్మాతలుగా, శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.నటీనటులు :అనన్య నాగళ్ళ, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశి, మీసాల లక్ష్మణ్, కుషాలిని, మనోజ్ ముత్యం, శరత్ బరిగెలటెక్నీషియన్స్ :రచన మరియు దర్శకత్వం : శ్రీనివాస్ గోపిశెట్టినిర్మాణం: ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరినిర్మాతలు : నరేష్ బాబు పి, రవి చైతన్యసహ నిర్మాత : తేజ్ పల్లిడిఓపి : సాయిరామ్ ఉదయ్, విజయ భాస్కర్ సద్దాలఆర్ట్ డైరెక్టర్: గురుమురళీ కృష్ణఎడిటర్ : ఎస్ బి ఉద్ధవ్మ్యూజిక్ : ఆర్ ఆర్ ధృవన్సౌండ్ డిజైన్: జ్యోతి చేతియాసౌండ్ మిక్సింగ్: శ్యామల్ సిక్దర్VFX:…

Read More

సమాచార హక్కు చట్టం ఇది సామాన్యుడు చేతిలో వజ్రాయుధం అని చెప్తూ ఉంటారు ప్రభుత్వ అధికార యంత్రాంగంలో పారదర్శకతను,జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ప్రభుత్వ పరిపాలన వ్యవహారాల్లో గోప్యతను నివారించి ప్రజలకు సమాచారాన్ని అందించడానికి అద్భుత అవకాశం. మన దేశంలో 2005లో అమల్లోకి వచ్చిన సమాచార హక్కు చట్టం (Right to Information act) ద్వారా దేశ పౌరులందరూ ప్రభుత్వ యంత్రాంగాలకు సంబంధించిన సమాచారాన్ని పొందే హక్కును ఈ చట్టం కల్పిస్తోంది.పౌరులు కోరిన సమాచారాన్ని 30 రోజుల్లోపు, కొన్ని సందర్భాల్లో 48 గంటల్లోపు అందివ్వాలని చట్టం చెబుతోంది. ఇక అసలు విషయానికొస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టిఐ కమీషనర్లు 2023 ఫిబ్రవరిలో రిటైర్డ్ అయినట్టు సమాచారం ఈ విషయం సామాన్యుడికి తెలుసో లేదో కానీ పిఐఓలకి మాత్రం బాగా తెలుసు అందుకే మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు.? సమాచారం ఇవ్వకున్నా మాకు అయ్యేదేముంది అన్నట్లు ఉంది కొందరి అధికారుల వ్యవహార శైలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా…

Read More

అమరావతి : వైసీపీ 21 మందితో మూడో జాబితాను విడుదల చేసింది. ఏలూరు (ఎంపీ)- కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, విజయవాడ (ఎంపీ)- కేశినేని నాని, కర్నూలు (ఎంపీ)- గుమ్మనూరు జయరాం, తిరుపతి (ఎంపీ) – కోనేటి ఆదిమూలం ( ప్రస్తుతం సత్యవేడు ఎమ్మెల్యే),శ్రీకాకుళం (ఎంపీ) – పేరాడ తిలక్, ఇచ్ఛాపురం – పిరియా విజయ, టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి – విజయరామరాజు, దర్శి – బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, మదనపల్లె – నిస్సార్ అహ్మద్, రాజంపేట – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరు – విరూపాక్షి, కోడుమూరు – డా.సతీష్, గూడూరు – మేరిగ మురళీధర్,సత్యవేడు – డా గురుమూర్తి, సూళ్ళూరుపేట – తిరుపతి ఎంపీ గురుమూర్తి, పెడన – ఉప్పాల రాము,చిత్తూరు-విజయానంద రెడ్డి, మార్కాపురం -జంకె వెంకట రెడ్డి, రాయదుర్గం – మెట్టు గోవింద్ రెడ్డి, పూతలపట్టు – డా. సునీల్.

Read More

నల్గొండ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 59 జీవోను అడ్డం పెట్టుకుని పానగల్ వద్ద ఇరిగేషన్ శాఖకు సంబంధించిన సుమారు రూ 10 కోట్ల విలువ గల ప్రభుత్వ భూమి అక్రమ పద్దతిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న జర్నలిస్టులు . మర్రి మహేందర్ రెడ్డి (నమస్తే తెలంగాణ 350 గజాలు),బూర రాము గౌడ్ (TNEWS 350 గజాలు),మార బోయిన మధుసూదన్ (ఆంధ్రజ్యోతి బ్యూరో 350 గజాలు),ముప్ప రేవన్ రెడ్డి (TV9 350 గజాలు),పసుపులేటి కిరణ్ కుమార్ (వెలుగు బ్యూరో 700 గజాలు ఇందులో 350 గజాలు సీమాంద్రకు చెందిన ప్రధాన పత్రిక బ్యూరో ది అని సమాచారం),బోయపల్లి రమేష్ గౌడ్ (RTV యూట్యూబ్ చానెల్ 350 గజాలు),క్రాంతి (ఓ యూట్యూబ్ చానెల్ 350 గజాలు),రామాజుల రెడ్డి (350 గజాలు ఈనాడు బ్యూరో దత్తు రెడ్డి భినామీ అని సమాచారం) సుమారు 10 కోట్ల రూపాయల విలువగల భూమి అన్యాక్రాంతం అయినప్పటికీ అధికారులు గానీ…

Read More

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ డైరెక్షన్లో వస్తున్న సినిమా కొత్త రంగులు ప్రపంచం. క్రాంతి, శ్రీలు హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఈనెల 20న బ్రహ్మాండంగా విడుదల అవుతుంది. గతంలో రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిచే రిలీజ్ అయిన ట్రైలర్ కి చాలా మంచి స్పందన లభించింది. ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. నటీనటులు :హీరో : క్రాంతిహీరోయిన్ : శ్రీలువిజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్, జబర్దస్త్ నవీన్ తదితరులు సాంకేతిక నిపుణులు :బ్యానర్ : శ్రీ పిఆర్ క్రియేషన్స్నిర్మాతలు : పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణా రెడ్డిదర్శకత్వం : పృథ్వీ రాజ్కెమెరామెన్ : శివారెడ్డిపి ఆర్ ఓ : ధీరజ్ – ప్రసాద్

Read More

సంక్రాంతి సినిమాల పట్ల తెలుగు ఫిలిం చాంబర్, తెలంగాణా ఫిలిం ఛాంబర్ పెద్దలు ద్వంద వైఖరి అవలంబిస్తున్నారని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఫైర్ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్ లోని తన సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. “తెలుగు ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు,తెలంగాణా ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్ వద్దే అన్నీ థియేటర్స్ ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న సినిమాలలో “హనుమాన్” సినిమా తప్ప మిగతా “గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగా” సినిమాలను వారే పంపిణీ చేస్తూ, వారికి చెందిన థియేటర్స్ లో ప్రదర్శించబోతున్నారు. వాస్తవానికి ఛాంబర్ పెద్దలుగా ఉన్నవాళ్లు తమ స్వార్ధాన్ని పక్కనపెట్టి, అన్నీ సినిమాలకు థియేటర్స్ ను సర్దాల్సిన న్యాయం వారిపైన ఉంటుంది. నిన్నెదో ఓప్పించి “ఈగల్” సినిమాను వెనక్కి వెళ్లెందుకు కృషి చేశాం అన్నారు. కానీ హనుమాన్ కు కూడా…

Read More

వైఎస్సార్‌సీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు షాకిచ్చారు. డిసెంబర్ 28 పార్టీలో చేరిన రాయుడు 10 రోజుల తిరక్కుండానే సంచలన ట్వీట్ చేశారు. తాను వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ‘ఎక్స్’ ద్వారా తెలిపారు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ, క్రికెట్ అభిమానుల్లోనూ ఇది చర్చనీయాంశంగా మారింది.గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు గత కొంత కాలంగా రాజకీయాల మీద ఆసక్తి కనబరిచారు.వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. సీఎం జగన్‌కు మద్దతుగా పలుమార్లు ట్వీట్స్ కూడా చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడుని పార్టీలో చేర్చుకోవటం వల్ల వైసీపీ బలపడుతుందని భావించింది అనుకున్నట్లుగానే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక సీఎం జగన్‌ను కలిసిన రాయుడు పలు సంఘాలతో సమావేశమయ్యారు. అనంతరం డిసెంబర్ 28 న తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు.ఆయనకు గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. త్వరలోనే…

Read More

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్కు సుమారు వందేళ్ల చ‌రిత్ర ఉంది,సుదీర్ఘ చ‌రిత్ర‌తో పాటు నిర్దిష్ట కాల‌ప‌రిమితిలోనే నోటిఫికేష‌న్‌లు, ప‌రీక్ష‌లు, ఇంట‌ర్వ్యూల నిర్వ‌హ‌ణ‌, నియామ‌క ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌డం అన్నింటా పార‌ద‌ర్శ‌క‌తను పాటిస్తోంది. ఈ విష‌యంలో మేం యూపీఎస్సీకి అభినంద‌న‌లు తెలుపుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ)ను ఆ విధంగానే రూపొందించాల‌ని తాము నిర్ణ‌యించుకున్నామ‌ని ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి యూపీఎస్సీ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ మ‌నోజ్ సోనికి తెలిపారు. న్యూ ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాల‌యంలో యూపీఎస్సీ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ మ‌నోజ్ సోని, కార్య‌ద‌ర్శి శ్రీ శ‌శిరంజ‌న్ కుమార్‌ల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి శ్రీ ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా టీఎస్‌పీఎస్సీ ప్ర‌క్షాళ‌న‌, యూపీఎస్సీ ప‌ని తీరుపై సుధీర్ఘంగా చ‌ర్చించారు. యూపీఎస్సీ పార‌ద‌ర్శ‌క‌తను పాటిస్తోంద‌ని,అవినీతి మ‌ర‌క అంట‌లేద‌ని, ఇంత సుదీర్ఘ‌కాలంగా అంత స‌మ‌ర్థంగా యూపీఎస్సీ ప‌నిచేస్తున్న తీరుపై ముఖ్య‌మంత్రి ఆరా తీశారు. తెలంగాణ‌లో నియామ‌క…

Read More

రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని గురువారం రాత్రి ప్రజాభవన్లో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని కాశ్మీర్ నుంచి తెప్పించిన శాలువాతో చిరంజీవి సత్కరించారు. చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి భట్టి విక్రమార్క సత్కారం చేశారు. డిప్యూటీ సీఎం వెంట ఆయన సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు సూర్య విక్రమాదిత్య ఉన్నారు.

Read More

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో జరిగింది.ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నటి ప్రభ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో దాదాపు 150 నుంచి 200 చిత్రాల్లో నటించారు. స్వర్గీయ దేవభక్తుని రమేష్, ప్రభ దంపతుల కుమారుడైన రాజా రమేష్ ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. విజయవాడ వాస్తవ్యులు స్వర్గీయ విజయ్ రామ్ రాజు వేదగిరి, శిరీష దంపతుల కుమార్తె సాయిఅపర్ణతో రాజా రమేష్ వివాహం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, మురళీమోహన్, విక్టరీ వెంకటేష్, సాయికుమార్, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన్ కృష్ణ, నిర్మాత దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, బోయపాటి శ్రీను, బెల్లంకొండ సురేష్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సుమన్, మల్లిడి సత్యానారాయణ రెడ్డి, రాశిమూవీస్ నరసింహారావు, దర్శకుడు రేలంగి నరసింహారావు, రోజారమణి, అన్నపూర్ణమ్మ, రజిత, కృష్ణవేణి, శివపార్వతి,…

Read More

తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. • మీ అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. • నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించాం. పాలనలో ప్రజలను భాగస్వాములను చేశాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నాం. • ఆరింటిలో రెండు గ్యారెంటీలు అమలు చేశాం. కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలి. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలి అన్నది మన ప్రభుత్వ ఆకాంక్ష. • యువత భవిత మాకు ప్రాధాన్యం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించి… వారి భవిష్యత్ కు గ్యారెంటీ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నాం. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. • రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం.ఈ నూతన సంవత్సరం ‘రైతు – మహిళ – యువత…

Read More

• నిరుడు రూ.14 వేలు ధర పలికిన క్వింటాలు పత్తి• ఇప్పుడు ప్రభుత్వ మద్దతు ధర రూ. 7,020• సాకులు చెబుతూ ధరలో కోతలు• రూ.6,500 మాత్రమే పెడుతున్న ప్రైవేటు వ్యాపారులు వరంగల్ :నిరుడు రికార్డు స్థాయిలో పత్తికి 14000 ధర పలకడంతో ఈ సంవత్సరం రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపారు కానీ ఈసారి మాత్రం ఏడు వేలే ధర ఉండడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఎకరా పత్తి సాగుకు సగటున రూ.30 నుంచి రూ.40 వేలు పెట్టుబడి,పత్తి ఏరుడుకు 15000 లు మొత్తం 50000 ఖర్చవుతుంది.ఎకరాకు 5-8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ లెక్కన రైతుకు పెట్టిన పెట్టుబడి పోను ఏమి మిగిలే అవకాశం లేదు ఇక కౌలు రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి నష్టాల పాలు అయ్యారు ఈ నేపద్యంలో రూ.10 వేలుగా ప్రకటించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Read More

బిఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సియం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ సినీ నటులు శ్రీ నందమూరి బాలకృష్ణ.

Read More

తెలంగాణలోని ప్రతి పంచాయతీల్లో బడి ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్ఠం చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో శనివారం జరిగిన విద్యాశాఖ సమీక్షలో అన్నారు. రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన,మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ చదువులకై ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు.విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలను తిరిగి తెరిపించాలి . ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే’ అని రేవంత్ రెడ్డి ఆదే చారు. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను భర్తీకి చర్యలను తీసుకోవాలని,రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ కాళీలను భర్తీ చేయడానికి డీఎస్సి నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన ఊరు,మన బడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఉత్తమ…

Read More

జబర్దస్త్ తో తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నారు.సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వంలో విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ స‌ర‌స‌న డాలీషా హీరోయిన్‌గా న‌టిస్తోంది.ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. న‌టీన‌టులు:సుధీర్ ఆనంద్ బయానా, డాలీషా, శివబాలాజీ మనోహరన్, రవితేజ నన్నిమాల త‌దిత‌రులు.

Read More

ఎస్బీఐలో 8283 క్లర్క్‌ ఉద్యోగాలు:SBI Clerk 2023 Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)నవంబర్ 16 న క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 8773 ఖాళీల కోసం రిక్రూట్‌మెంట్ చేస్తోంది..జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్)గా చేరాలనుకునే ఆసక్తి గల ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

Read More