Author: Veeramusti Sathish, MAJMC

Sathish, founder of PrathipakshamTV.com, is an independent digital journalist and RTI activist. With over a decade of experience, he covers governance, citizens’ rights, and social issues. A MAJMC graduate, he has filed numerous RTIs and appeals to promote transparency and accountability.

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో అవినీతి ఆరోపణలపై సర్కార్ సీరియస్ గా స్పందిస్తోంది . ఇప్పటికే హైదరాబాద్ నగర శివార్లల్లో మూకుమ్మడి బదిలీలకు రంగం సిద్ధం చేసింది.దీనిలో భాగంగా అవినీతి ఆరోపణలపై విచారణకు స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ పోలీసులను ప్రభుత్వం రంగంలోకి దింపింది. భూ వివాదాలల్లో జోక్యం చేసుకుంటున్న పోలీస్ అధికారుల సమాచారాన్ని ఇంటిలిజెన్స్ ద్వారా సేకరిస్తోంది.ఇప్పటికే ఉన్నతాధికారులు అవినీతి అధికారుల చిట్టా రాబట్టే పనిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులపైన కూడా ఎఫెక్ట్ ఉండబోతుంది. ఇప్పటికే 52 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. త్వరలోనే బడా పోలీస్ అధికారులు కూడా బదిలీ అయ్యే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో భారీగా కీలక అధికారుల బదిలీలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.రాష్ర్టంలో ఎలాంటి పైరవీలు కుదరవనీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.దీంతో పోలీస్‌ శాఖలో ఇకపై పోస్టింగ్‌ల విషయంలో రాజకీయ…

Read More

ప్రఖ్యాత వ్యాపారవేత్త, రాజకీయ నేత, సినీ నిర్మాత అంబికా కృష్ణ ఈ రోజు (జనవరి 29న) ఉదయం మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లి ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు లభించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ — “భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయంకృషితో సాధించుకున్న మిత్రుడు చిరంజీవి గారికి భారతావని లో రెండవ ప్రతిష్టాత్మక పురస్కారం — పద్మవిభూషణ్ రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది.నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన చిరంజీవి గారు ప్రతి పాత్రను మనసుపెట్టి చేశారు. అందుకే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అగ్రశ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు” అన్నారు. అలాగే ఆయన అన్నారు: “సినీ రంగం మాత్రమే కాకుండా, సామాజిక సేవా రంగంలో కూడా చిరంజీవి గారు చేస్తున్న సేవలు ఎన్నో మందికి ఆదర్శం.అయోధ్యలో బాలరామయ్య దర్శనానికి వెళ్లి మూడు రోజుల్లోనే ఈ అవార్డు రావడం విశేషం.ఇది ఆయన కృషికి,…

Read More

సికింద్రాబాద్‌లోని పీజీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్‌లో జరిగిన ఘటన విద్యార్థినుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మొన్న శుక్రవారం రాత్రి ఇద్దరు ఆగంతకులు హాస్టల్‌లోకి చొరబడ్డారు. ఆ సమయంలో విద్యార్థినులు అప్రమత్తమై వారిలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన తర్వాత హాస్టల్ పరిసరాల్లో భయాందోళనలు చెలరేగాయి. “మేము సురక్షితంగా లేము” అంటూ విద్యార్థినుల ఆందోళన ఆ ఘటన తర్వాత విద్యార్థినులు హాస్టల్ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. “ప్రతి రాత్రి భయంతో నిద్రపోతున్నాం. మా హాస్టల్ చుట్టూ లైట్లు లేవు, సెక్యూరిటీ గార్డులు సరిపోవడం లేదు” అని ఒక విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. మరొకరు మాట్లాడుతూ, “కాలేజీ మేనేజ్‌మెంట్ మా భద్రతను సీరియస్‌గా తీసుకోవడం లేదు. మేము చదవడానికి వచ్చాము కానీ భయంతో గడపాల్సి వస్తోంది” అని తెలిపారు. ఘటన తర్వాత పోలీసులు గస్తీ విద్యార్థినుల ఆందోళన తర్వాత, ఎప్పుడూ కనిపించని పోలీసులు ఈసారి 10 మంది బలగాలను…

Read More

తెలంగాణ రైతులలో మళ్లీ ఒక ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది — “రుణమాఫీ ఎప్పుడు?”ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీ ఇదే. “అధికారంలోకి వస్తే ఒక్కసారిగా అప్పు, వడ్డీ కలిపి రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తాం” అని స్పష్టంగా మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా నాయకులు “100 రోజుల్లో రుణమాఫీ అమలు చేస్తాం” అని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ 100 రోజులు దాటినా స్పష్టత మాత్రం కనిపించడం లేదు. నేతల విభిన్న వ్యాఖ్యలతో గందరగోళం ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలే వేరువేరు వ్యాఖ్యలు చేయడం రైతుల్లో గందరగోళం కలిగించింది. భిక్కనూరు సింగిల్ విండో చైర్మన్ గంగల భూమయ్య మాట్లాడుతూ – “వ్యవసాయ అవసరాల కోసం తీసుకున్న రుణాలను రైతులు సకాలంలో చెల్లించాలి. చెల్లించని వారికి డిమాండ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.” ఈ వ్యాఖ్యలతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.…

Read More

వరి సాగు తెలంగాణ రైతుల జీవనాధారం. అయితే గత కొన్నేళ్లుగా కూలీల కొరత మరియు వరి నాటు ఖర్చులు పెరగడం వల్ల రైతులు కొత్త పద్ధతులను అనుసరించడం ప్రారంభించారు. సాధారణంగా వరి సాగు చేయాలంటే ముందు నారు పోసి 30 రోజులు తర్వాత నాటు వేయాలి. ఈ విధానం కాస్త శ్రమతో కూడుకున్నది మరియు ఖర్చుతో కూడి ఉంటుంది. సాంప్రదాయ పద్ధతిలో ఖర్చు నాటు కోసం ఒక ఎకరాకు 25 కేజీల విత్తనాలు అవసరం. 12 నుంచి 14 మంది నాటు కూలీలు అవసరం అవుతారు. కూలీలకు మాత్రమే ₹6,000 – ₹8,000 ఖర్చు అవుతుంది. మొత్తంగా నాటు వరకూ ఖర్చు ₹20,000 వరకు పెరుగుతుంది. దిగుబడి: ఎకరాకు 20–30 క్వింటాళ్లు. వెదజల్లే పద్ధతి – తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం ఇక ప్రస్తుతం రైతులు అనుసరిస్తున్న కొత్త పద్ధతి — వడ్లను వెదజల్లే పద్ధతి (Broadcasting Method).ఈ విధానం ద్వారా…

Read More

“రుణమాఫీ” – తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన పదం.గతంలో టీఆర్‌ఎస్ పార్టీ రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చి పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో రైతుల్లో నిరాశ నెలకొంది. ఆ నిరాశనే క్యాష్ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో ఒకేసారి ₹2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ప్రజల మద్దతు పొందింది. హామీ ఇచ్చారు కానీ అమలు ఎప్పుడు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.డిసెంబర్ 9 తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు “చేస్తున్నాం – చేస్తాం” అంటూ స్పష్టత ఇవ్వకపోవడంతో సందేహాలు మొదలయ్యాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు దీనిపై తీవ్ర విమర్శలు చేస్తూ, “రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోతున్నారు” అంటుంటే,ప్రభుత్వ నేతలు మాత్రం “చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, ప్రజలు అర్థం చేసుకుంటారు” అంటూ సమాధానం ఇస్తున్నారు.  బ్యాంకుల లీగల్ నోటీసులు – రైతులకు షాక్ ఇక మరోవైపు బ్యాంకులు రుణగ్రహీతలపై…

Read More

స్టోనెక్స్ బ్యానర్ పై పి బి వేలుమురుగన్ నిర్మాతగా,రామ్ ప్రభ దర్శకత్వంలో తెలుగు, తమిళ్, హిందీ భాషలలో నిర్మిస్తున్న చిత్రం”గ్యాంగ్ స్టర్” గ్రానైట్ స్లాబులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ వ్యాపార రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మాత వేలు మురుగన్. సినీ పరిశ్రమపై ఉన్న మక్కువతో ఈ చిత్రాన్ని నిర్మించారు. మూడు భాషల్లో రూపుదిద్దుకుంటున్న “గ్యాంగ్ స్టర్” చిత్రం మార్చి నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వేలు మురుగన్ మాట్లాడుతూ మార్కెటింగ్ స్కామ్ అనే నూత‌న‌ పాయింట్ పై సినిమా అంతా న‌డుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి పాయింట్ పై సినిమా రాలేద‌ని చెప్పాలి. ఇందులో హీరోలు ఎవ‌రు? విల‌న్స్ ఎవ‌రు? అనేది క్లైమాక్స్ వ‌ర‌కు తెలియ‌దు. ప్ర‌తి పాత్ర ఎంతో ఇంట్ర‌స్టింగ్ గా క్యూరియాసిటీ క‌లిగించే విధంగా ఉంటుంది. ద‌ర్శ‌కుడు రామ్ ప్రభ సినిమాను ఎంతో ఇంట్ర‌స్టింగ్ గా తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే ప‌లు చిత్రాల్లో న‌టించి…

Read More

యాసంగి సాగు పరిస్థితి తెలంగాణలో యాసంగి పొలం పనులు రెండునెలల క్రితమే ప్రారంభమయ్యాయి. అయితే గత సంవత్సరం కంటే ఈసారి తక్కువ విస్తీర్ణంలోనే వరి సాగు జరుగుతున్నట్లు సమాచారం. కొన్ని జిల్లాల్లో ఇప్పటివరకు కేవలం 50% వరకే సాగు పూర్తి అయ్యింది. కొంతమంది రైతులు ఇంకా నాట్లు వేస్తూనే ఉన్నారు. రైతులకు పెరిగిన ఖర్చులు నాటు కూలీల కూలీలు, ఎరువుల ధరలు, దుక్కి దున్నే ఖర్చులు—all కలిపి ఎకరాకు 20 వేల రూపాయల ఖర్చు కేవలం నాటు వరకే వస్తోందని రైతులు చెబుతున్నారు. రైతుబంధు, వడ్ల పైసల ఆలస్యం రైతుబంధు సహాయం (ఎకరాకు ₹5,000) మరియు వడ్ల పైసల జమ ఆలస్యం రైతులపై భారంగా మారింది. కొంతమంది ఖాతాల్లో వారం రోజుల క్రితమే వడ్ల పైసలు జమ అయ్యాయి. అయితే ఇంకా చాలా మంది రైతులు పాస్బుక్కులతో బ్యాంకుల చుట్టూ తిరుగుతూ డబ్బులు వచ్చాయో లేదో చెక్ చేసుకోవాల్సి వస్తోంది. డబ్బుల…

Read More

ప్రజా పాలనలో కోట్ల దరఖాస్తులు తెలంగాణ ప్రభుత్వం ఐదు గ్యారెంటీ హామీల అమలులో భాగంగా ప్రజా పాలన కార్యక్రమాన్ని డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ కాలంలో కోట్లల్లో దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. దరఖాస్తులను కంప్యూటరీకరించడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ డేటా ఎంట్రీ కార్యక్రమం పూర్తి దశలో ఉందని అధికారులు చెబుతున్నారు. Application Status చెక్ ఆప్షన్ దరఖాస్తుదారులు తమ దరఖాస్తుల స్థితిని తెలుసుకోవడానికి ‘KNOW YOUR APPLICATION STATUS’ అనే ఆప్షన్‌ను పోర్టల్‌లో ఏర్పాటు చేశారు. దరఖాస్తుదారులు Application Number ఎంటర్ చేయాలి తరువాత Captcha పూర్తి చేయాలి ఆ తర్వాత View Status క్లిక్ చేస్తే వివరాలు చూపించాలి Captcha సమస్యతో ఇబ్బందులు అయితే, దరఖాస్తుదారులు గత రెండు మూడు రోజులుగా captcha ఆప్షన్ పనిచేయకపోవడం వల్ల స్టేటస్ తెలుసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. Application Number ఆప్షన్ పనిచేస్తున్నా,…

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వినియోగదారుడు తన న్యూహోలాండ్ Excel 4710  ట్రాక్టర్ సర్వీస్ కోసం 5 డిసెంబర్ 2022 రోజు కంపెనీని సంప్రదించాడు. అయితే కంపెనీ సర్వీస్ టికెట్ ఓపెన్ చేసి సంబంధిత ఆథరైజ్డ్ డీలర్ అయినా KS Tractors వరంగల్ కు కేటాయించి 48 గంటల్లో సర్వీస్ ఇస్తారని హామీ ఇచ్చింది. కానీ ks ట్రాక్టర్స్ డీలర్ సర్వీస్ ఇవ్వలేదు. 29 డిసెంబర్ 2022 రోజున శ్రీ లక్ష్మీ మోటార్స్ సిద్దిపేట, శ్రీలత ట్రాక్టర్స్ చొప్పదండి డీలర్లచే సర్వీస్ చేయబడింది. అయితే న్యూ హోలాండ్ కంపెనీ ఉత్పత్తులకు బదులు మార్కెట్లో దొరికే వేరే ఇతర నాసిరకం ఉత్పత్తులతో సర్వీస్ ఇచ్చారు. అయితే వినియోగదారుడు కంపెనీ ఉత్పత్తుల చేత సర్వీస్ ఇవ్వాలని కోరగా స్టాక్ లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. 14 జూన్ 2023 రోజున KS TRACTORS డీలర్ చే మరొక సర్వీస్ ఇవ్వబడింది. అయితే ట్రాక్టర్ వారంటీ…

Read More

షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీ పీసీసీ) అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని అధిష్టానం ప్రకటించింది. గిడుగు రుద్రరాజుకు కొత్త బాధ్యత మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రాజీనామా అనంతరం, ఆయనను కాంగ్రెస్ సీడబ్ల్యూసీ (CWC) ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ వ్యూహం ఈ నియామకంతో ఏపీ కాంగ్రెస్ కొత్త దశలోకి ప్రవేశించింది. షర్మిలకు పగ్గాలు ఇవ్వడం ద్వారా పార్టీ వైఎస్సార్సీపీ అసంతృప్త నేతలను ఆకర్షించడం, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలంగా పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. రాజకీయ విశ్లేషణ రాజకీయ వర్గాల అభిప్రాయం ప్రకారం – షర్మిల నియామకం కాంగ్రెస్ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతుంది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అదనపు బలం చేకూరే అవకాశం ఉంది నలుగురేళ్ల తర్వాత…

Read More

• కవితకు ఈడి సమన్లతో బీఆర్ఎస్ లో ఆందోళన • ఇంకా సుప్రీంకోర్టులో లిస్ట్ కాని కవిత పిటీషన్ • న్యాయవాదులతో చర్చిస్తున్న కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది.ఇప్పుడు ఇది బీఆర్ఎస్ లో ఆందోళన కలిగిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కవిత లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో ఈ నోటీసులు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. గతంలోనూ కవితను ఈడీ మూడు సార్లు విచారించింది. తాజాగా.. మరోసారి విచారణకు రావాలంటూ కవితకు నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పెండింగ్ లోనే ఉంది. అయితే ఈడి విచారణకు హాజరు గురించి కవిత తన న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు సమాచారం.

Read More

ప్రముఖ సినీ నటుడు స్వర్గీయ కన్నడ ప్రభాకర్ తనయుడు వినోద్ ప్రభాకర్ హీరోగా నటించిన “మాదేవ” సినిమా అతి త్వరలో తెలుగు కన్నడ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రతిపక్షం టీవీ ఎక్స్ క్లూజివ్ గా మీకు అందిస్తోంది.ఈ చిత్రానికి మన తెలుగువాడు నవీన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. బెంగళూరులో స్థిరపడ్డ దర్శకుడు నవీన్ రెడ్డి ఈ చిత్రాన్ని హైటెక్నికల్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు.తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ స్టిల్స్ ఎక్స్ క్లూజివ్ గా ప్రతిపక్షం టీవీలో….

Read More

ఏపీ కాంగ్రెస్‌లో వేగంగా మార్పులు వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలో పార్టీని బలపడేలా చేయడానికి హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. తాజాగా పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినట్లు సమాచారం. దీంతో రెండు, మూడు రోజుల్లోనే ఏపీ కాంగ్రెస్ పగ్గాలను వైఎస్ షర్మిలకు అప్పగించే అవకాశం బలంగా వినిపిస్తోంది. షర్మిల ఎంట్రీ – కాంగ్రెస్‌కు కొత్త ఊపుని? వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే, వైఎస్సార్సీపీ అసంతృప్త నేతలు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. అంతేకాదు, షర్మిలను నేరుగా జగన్‌పై పోటీ చేయిస్తే: కాంగ్రెస్ కేడర్‌లో ఉత్సాహం పెరుగుతుంది పార్టీ ఓటు శాతం గణనీయంగా పెరుగుతుంది వైఎస్సార్సీపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ తిరిగి బలపడుతుంది కుటుంబ-రాజకీయ అనుబంధం తాజాగా షర్మిల తన కుమారుడి పెళ్లి సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు.…

Read More

ఎన్నికల తర్వాత పోలీస్ శాఖలో మార్పులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా: అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో పోలీస్ శాఖలో మార్పులు మొదలయ్యాయి. తొలిసారిగా ఐదుగురు ఎస్సైలు (Sub Inspectors) బదిలీ అయ్యారు. బదిలీ అయిన ఎస్సైలు జాబితా కే ప్రసాద్ – ప్రస్తుతం కాటారంలో ప్రొబీషనరీ సర్వీస్‌లో ఉన్నారు → మహాదేవపూర్ ఎస్.హెచ్.ఓగా నియామకం. రాజకుమార్ – మహాదేవపూర్ నుండి → భూపాలపల్లికి బదిలీ. మాధవ్ – రేగొండ నుండి → మొగుళ్లపల్లికి బదిలీ. ఎన్. రవికుమార్ – భూపాలపల్లి నుండి → రేగొండకి బదిలీ. శ్రీధర్ – మొగుళ్లపల్లి నుండి → భూపాలపల్లి పోలీస్ స్టేషన్కి బదిలీ. పోలీస్ శాఖలో టెన్షన్ ఈ బదిలీలతో మిగతా ఎస్సైల్లోనూ టెన్షన్ నెలకొంది. ఇక్కడితో మార్పులు ఆగుతాయా? లేకుండా డీఎస్పీలు, సీఐలు కూడా బదిలీ అవుతారా? అనే చర్చ జిల్లా పోలీస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

Read More

తంత్ర సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ తెలుగు సినీ ప్రేక్షకుల కోసం మరో కొత్త చిత్రం “తంత్ర” రాబోతుంది. అనన్య నాగళ్ళ, ధనుష్ రఘుముద్రి, సలోని ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ తాజాగా విడుదలైంది. సినిమా వివరాలు ఈ సినిమాను ఫస్ట్ కాపీ మూవీస్ మరియు బి ద వే ఫిల్మ్స్ బ్యానర్లపై నరేష్ బాబు పి, రవిచైతన్య నిర్మించగా, దర్శకత్వం శ్రీనివాస్ గోపిశెట్టి వహిస్తున్నారు. నటీనటులు (Cast) అనన్య నాగళ్ళ ధనుష్ రఘుముద్రి సలోని టెంపర్ వంశి మీసాల లక్ష్మణ్ కుషాలిని మనోజ్ ముత్యం శరత్ బరిగెల సాంకేతిక నిపుణులు (Crew) రచన మరియు దర్శకత్వం: శ్రీనివాస్ గోపిశెట్టి నిర్మాణం: ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరి నిర్మాతలు: నరేష్ బాబు పి, రవి చైతన్య సహ నిర్మాత: తేజ్ పల్లి డిఓపి: సాయిరామ్ ఉదయ్, విజయ…

Read More

ఆర్టీఐ చట్టం – ప్రజల వజ్రాయుధం సమాచార హక్కు చట్టం (Right to Information Act – 2005) పౌరులకు ప్రభుత్వ యంత్రాంగం నుండి సమాచారం పొందే హక్కును ఇస్తుంది. 30 రోజుల్లోపు, అత్యవసర పరిస్థితుల్లో 48 గంటల్లోపు సమాచారం ఇవ్వాలని ఈ చట్టం చెబుతోంది. తెలంగాణలో కమీషనర్లు లేక ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఐ కమీషనర్లు 2023 ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారు. అప్పటి నుండి కొత్త నియామకాలు జరగకపోవడంతో రాష్ట్రంలో దరఖాస్తులు వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. ఉదాహరణ – భూపాలపల్లి జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల పోలీస్ స్టేషన్‌కు ఒక పౌరుడు ఆర్టీఐ దరఖాస్తు చేసుకున్నారు. 30 రోజుల్లో సమాచారం ఇవ్వాల్సింది. కానీ నాలుగు నెలలు గడిచినా పిఐఓ, డిఎస్పి ఆఫీస్ నుండి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఫస్ట్ అప్పీల్ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యం – ప్రజల నిరాశ ఈ పరిస్థితి…

Read More

అమరావతి : వైసీపీ 21 మందితో మూడో జాబితాను విడుదల చేసింది. ఏలూరు (ఎంపీ)- కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, విజయవాడ (ఎంపీ)- కేశినేని నాని, కర్నూలు (ఎంపీ)- గుమ్మనూరు జయరాం, తిరుపతి (ఎంపీ) – కోనేటి ఆదిమూలం ( ప్రస్తుతం సత్యవేడు ఎమ్మెల్యే),శ్రీకాకుళం (ఎంపీ) – పేరాడ తిలక్, ఇచ్ఛాపురం – పిరియా విజయ, టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి – విజయరామరాజు, దర్శి – బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, మదనపల్లె – నిస్సార్ అహ్మద్, రాజంపేట – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరు – విరూపాక్షి, కోడుమూరు – డా.సతీష్, గూడూరు – మేరిగ మురళీధర్,సత్యవేడు – డా గురుమూర్తి, సూళ్ళూరుపేట – తిరుపతి ఎంపీ గురుమూర్తి, పెడన – ఉప్పాల రాము,చిత్తూరు-విజయానంద రెడ్డి, మార్కాపురం -జంకె వెంకట రెడ్డి, రాయదుర్గం – మెట్టు గోవింద్ రెడ్డి, పూతలపట్టు – డా. సునీల్.

Read More

నల్గొండలో జర్నలిస్టుల భూమి స్కాం – 59 జీవో అడ్డం పెట్టుకొని అక్రమ రిజిస్ట్రేషన్లు నల్గొండ జిల్లాలో మరో పెద్ద ల్యాండ్ స్కాం వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ పాలనలో, 59 జీవోను అడ్డం పెట్టుకుని జర్నలిస్టులు కలిసి సుమారు రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భూమి పానగల్ వద్ద ఇరిగేషన్ శాఖకు చెందిన ప్రభుత్వ భూమిగా గుర్తించబడింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులు జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ సభ్యులు కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పలు జర్నలిస్టుల పేర్లు ప్రస్తావించబడ్డాయి. మర్రి మహేందర్ రెడ్డి (నమస్తే తెలంగాణ – 350 గజాలు) బూర రాము గౌడ్ (టి న్యూస్ – 350 గజాలు) మారబోయిన మధుసూదన్ (ఆంధ్రజ్యోతి బ్యూరో – 350 గజాలు) ముప్ప రేవన్ రెడ్డి (టీవీ9 – 350 గజాలు) పసుపులేటి కిరణ్ కుమార్ (వెలుగు బ్యూరో – 700 గజాలు,…

Read More