30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ డైరెక్షన్లో వస్తున్న సినిమా కొత్త రంగులు ప్రపంచం. క్రాంతి, శ్రీలు హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఈనెల 20న బ్రహ్మాండంగా విడుదల అవుతుంది. గతంలో రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిచే రిలీజ్ అయిన ట్రైలర్ కి చాలా మంచి స్పందన లభించింది. ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. నటీనటులు :హీరో : క్రాంతిహీరోయిన్ : శ్రీలువిజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్, జబర్దస్త్ నవీన్ తదితరులు సాంకేతిక నిపుణులు :బ్యానర్ : శ్రీ పిఆర్ క్రియేషన్స్నిర్మాతలు : పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణా రెడ్డిదర్శకత్వం : పృథ్వీ రాజ్కెమెరామెన్ : శివారెడ్డిపి ఆర్ ఓ : ధీరజ్ – ప్రసాద్
Author: Veeramusti Sathish, MAJMC
విక్టరీ వెంకటేష్ నటించిన సైందవ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన తారలు
ఫిలిం చాంబర్ పెద్దలపై నట్టి కుమార్ అసంతృప్తి హైదరాబాద్: సంక్రాంతి సినిమాల విడుదల సందర్భంగా థియేటర్ కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ తీవ్రంగా విమర్శించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ “దిల్ రాజు, సునీల్ నారంగ్ వద్దే అన్నీ థియేటర్స్ ఉన్నాయి. తమకున్న సినిమాలకు మాత్రమే థియేటర్స్ కేటాయిస్తున్నారు” అని ఆరోపించారు. హనుమాన్ సినిమాకు అన్యాయం? “గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగా సినిమాలకు ప్రాధాన్యం ఇస్తూ, హనుమాన్‌కు సరిపడా థియేటర్స్ ఇవ్వడం లేదు. డిస్ట్రిబ్యూటర్ల కంటే సినిమాల క్రేజ్ ఆధారంగా థియేటర్స్ ఇవ్వాలి” అని నట్టి కుమార్ డిమాండ్ చేశారు. చిన్న సినిమాల కోసం ప్రభుత్వ జోక్యం చిన్న సినిమాలకు న్యాయం జరగాలని, ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల విషయంలో “విభజించు పాలించు” విధానాన్ని…
వైసీపీకి షాక్ అమరావతి: మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు. డిసెంబర్ 28న సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన రాయుడు, కేవలం 10 రోజుల్లోనే పార్టీకి రాజీనామా చేసినట్లు ట్వీట్ చేశారు. రాజకీయాలకు విరామం ‘కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటాను. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను’ అని అంబటి రాయుడు తన అధికారిక ‘ఎక్స్’ అకౌంట్‌లో ప్రకటించారు. వైసీపీ లెక్కలపై ప్రభావం కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు వైసీపీ బలాన్ని పెంచుతారని పార్టీ భావించింది. గుంటూరు ఎంపీ టికెట్ రాయుడికి ఇస్తారని ప్రచారం జరిగినా, ఆ దిశగా ఎలాంటి హామీ రాలేదన్న కారణంగా ఆయన వెనక్కి తగ్గారని సమాచారం. భవిష్యత్ రాజకీయ దిశపై సందేహాలు అంబటి రాయుడు త్వరలోనే వేరే పార్టీలో చేరతారా? కాపు కమ్యూనిటీకి చెందిన రాయుడు జనసేన వైపు మొగ్గు చూపుతారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో…
యూపీఎస్సీ అనుసరించిన విధానం ఉదాహరణ న్యూ ఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వందేళ్ల చరిత్రతో కూడిన సంస్థ. నోటిఫికేషన్లు, పరీక్షలు, ఇంటర్వ్యూల నిర్వహణలో పారదర్శకతకు నిలువెత్తు నిదర్శనం. ఈ మోడల్‌ను తెలంగాణలో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యూపీఎస్సీ అధికారులతో ముఖ్యమంత్రి భేటీ న్యూ ఢిల్లీలోని UPSC కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి UPSC ఛైర్మన్ డాక్టర్ మనోజ్ సోని, కార్యదర్శి శశిరంజన్ కుమార్‌లను కలిశారు. టీఎస్‌పీఎస్సీ (TSPSC)లో మార్పులు, పారదర్శక విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. https://www.tspsc.gov.in/ రెండు లక్షల నియామకాలు లక్ష్యం 2024 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపడతామని సీఎం తెలిపారు. ఇందుకోసం టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి, అవినీతి రహితంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అవకతవకలకు ముగింపు గత ప్రభుత్వంలో టీఎస్‌పీఎస్సీని రాజకీయ ప్రభావం కోసం ఉపయోగించారని, పేపర్ లీకులు, నోటిఫికేషన్లలో ఆలస్యం, ఫలితాల…
ప్రజాభవన్లో ఆత్మీయ భేటీ హైదరాబాద్: రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని గురువారం రాత్రి ప్రజాభవన్లో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవికి శాలువా సత్కారం ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిరంజీవిని కాశ్మీర్ నుంచి తెప్పించిన శాలువాతో సత్కరించారు. చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం అందించి గౌరవం తెలిపారు. కుటుంబ సభ్యుల సమక్షంలో భట్టి విక్రమార్క వెంట ఆయన సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు సూర్య విక్రమాదిత్య ఉన్నారు. ఈ సమావేశం ఆత్మీయ వాతావరణంలో సాగింది.
ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో జరిగింది.ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నటి ప్రభ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో దాదాపు 150 నుంచి 200 చిత్రాల్లో నటించారు. స్వర్గీయ దేవభక్తుని రమేష్, ప్రభ దంపతుల కుమారుడైన రాజా రమేష్ ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. విజయవాడ వాస్తవ్యులు స్వర్గీయ విజయ్ రామ్ రాజు వేదగిరి, శిరీష దంపతుల కుమార్తె సాయిఅపర్ణతో రాజా రమేష్ వివాహం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, మురళీమోహన్, విక్టరీ వెంకటేష్, సాయికుమార్, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన్ కృష్ణ, నిర్మాత దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, బోయపాటి శ్రీను, బెల్లంకొండ సురేష్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సుమన్, మల్లిడి సత్యానారాయణ రెడ్డి, రాశిమూవీస్ నరసింహారావు, దర్శకుడు రేలంగి నరసింహారావు, రోజారమణి, అన్నపూర్ణమ్మ, రజిత, కృష్ణవేణి, శివపార్వతి,…
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా కొత్త ఏడాది కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ – గ్యారెంటీల అమలు రాష్ట్రంలో నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించి ప్రజలకు స్వేచ్ఛ కల్పించామని సీఎం పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలలో రెండు ఇప్పటికే అమలవుతున్నాయని, మిగిలిన వాటిని త్వరలో అమలు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలని స్పష్టం చేశారు. యువత, మహిళలు, రైతులకు హామీ ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయనున్నట్లు చెప్పారు.రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2025 సంవత్సరం **“రైతు – మహిళ –…
గత సంవత్సరం పత్తి ధర క్వింటాలుకు ₹14,000 ప్రస్తుత మద్దతు ధర కేవలం ₹7,020 ప్రైవేట్ వ్యాపారులు రైతుల నుండి క్వింటాలుకు ₹6,500 మాత్రమే ఇస్తున్నారు ఎకరాకు రైతు పెట్టుబడి ₹30,000–₹40,000 వరకు మొత్తం ఖర్చు సుమారు ₹50,000, కానీ దిగుబడి లాభం లేకుండా పోతుంది రైతులు: కనీసం ₹10,000 మద్దతు ధర కావాలి ధరలు కుప్పకూలిన పత్తి మార్కెట్ వరంగల్ : గత సంవత్సరం రికార్డు స్థాయిలో పత్తికి క్వింటాల్‌కు ₹14,000 పలికింది. ఈసారి రైతులు ఎక్కువగా పత్తి సాగు వైపు మొగ్గు చూపారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ మద్దతు ధర కేవలం ₹7,020 మాత్రమే ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు – లాభం లేకుండా ఎకరా పత్తి సాగుకు సగటున ₹30,000 నుంచి ₹40,000 వరకు ఖర్చు అవుతుంది. అదనంగా పత్తి ఏరుడుకు సుమారు ₹15,000 ఖర్చు అవుతుంది. మొత్తంగా ఒక ఎకరాకు ₹50,000 ఖర్చవుతుంది.…
బిఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సియం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ సినీ నటులు శ్రీ నందమూరి బాలకృష్ణ.
ప్రతి పంచాయతీ, తాండాలో ప్రభుత్వ పాఠశాల తప్పనిసరి మూసివేసిన పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని ఆదేశం ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా DSC నిర్వహణ మన ఊరు – మన బడి కార్యక్రమం పనుల పురోగతిపై సమీక్ష పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుధ్య కార్మికుల ఏర్పాటు సూచన విద్యుత్ బిల్లుల వసూళ్లలో కేటగిరి మార్పు పరిశీలన ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు పాఠశాలలు మూసివేయరాదు: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైనా, మారుమూల తాండా అయినా తప్పనిసరిగా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. శనివారం సచివాలయంలో విద్యాశాఖ సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ “ఎంతమంది విద్యార్థులున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాలి. విద్యార్థులు లేరనే నెపంతో పాఠశాల మూసివేయడం సరికాదు” అని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి DSC రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి త్వరలోనే మెగా…
జబర్దస్త్ తో తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నారు.సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ సరసన డాలీషా హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. నటీనటులు:సుధీర్ ఆనంద్ బయానా, డాలీషా, శివబాలాజీ మనోహరన్, రవితేజ నన్నిమాల తదితరులు.
ఎస్బీఐలో 8283 క్లర్క్ ఉద్యోగాలు:SBI Clerk 2023 Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)నవంబర్ 16 న క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 8773 ఖాళీల కోసం రిక్రూట్‌మెంట్ చేస్తోంది..జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్)గా చేరాలనుకునే ఆసక్తి గల ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.