తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. • మీ అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. • నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించాం. పాలనలో ప్రజలను భాగస్వాములను చేశాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నాం. • ఆరింటిలో రెండు గ్యారెంటీలు అమలు చేశాం. కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలి. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలి అన్నది మన ప్రభుత్వ ఆకాంక్ష. • యువత భవిత మాకు ప్రాధాన్యం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించి… వారి భవిష్యత్ కు గ్యారెంటీ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నాం. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. • రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం.ఈ నూతన సంవత్సరం ‘రైతు – మహిళ – యువత…
Author: Veeramusti Sathish, MAJMC
• నిరుడు రూ.14 వేలు ధర పలికిన క్వింటాలు పత్తి• ఇప్పుడు ప్రభుత్వ మద్దతు ధర రూ. 7,020• సాకులు చెబుతూ ధరలో కోతలు• రూ.6,500 మాత్రమే పెడుతున్న ప్రైవేటు వ్యాపారులు వరంగల్ :నిరుడు రికార్డు స్థాయిలో పత్తికి 14000 ధర పలకడంతో ఈ సంవత్సరం రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపారు కానీ ఈసారి మాత్రం ఏడు వేలే ధర ఉండడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఎకరా పత్తి సాగుకు సగటున రూ.30 నుంచి రూ.40 వేలు పెట్టుబడి,పత్తి ఏరుడుకు 15000 లు మొత్తం 50000 ఖర్చవుతుంది.ఎకరాకు 5-8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ లెక్కన రైతుకు పెట్టిన పెట్టుబడి పోను ఏమి మిగిలే అవకాశం లేదు ఇక కౌలు రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి నష్టాల పాలు అయ్యారు ఈ నేపద్యంలో రూ.10 వేలుగా ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
బిఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సియం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ సినీ నటులు శ్రీ నందమూరి బాలకృష్ణ.
తెలంగాణలోని ప్రతి పంచాయతీల్లో బడి ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్ఠం చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో శనివారం జరిగిన విద్యాశాఖ సమీక్షలో అన్నారు. రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన,మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ చదువులకై ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు.విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలను తిరిగి తెరిపించాలి . ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే’ అని రేవంత్ రెడ్డి ఆదే చారు. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను భర్తీకి చర్యలను తీసుకోవాలని,రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ కాళీలను భర్తీ చేయడానికి డీఎస్సి నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన ఊరు,మన బడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఉత్తమ…
జబర్దస్త్ తో తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నారు.సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ సరసన డాలీషా హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. నటీనటులు:సుధీర్ ఆనంద్ బయానా, డాలీషా, శివబాలాజీ మనోహరన్, రవితేజ నన్నిమాల తదితరులు.
ఎస్బీఐలో 8283 క్లర్క్ ఉద్యోగాలు:SBI Clerk 2023 Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)నవంబర్ 16 న క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 8773 ఖాళీల కోసం రిక్రూట్‌మెంట్ చేస్తోంది..జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్)గా చేరాలనుకునే ఆసక్తి గల ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.