కర్నూల్ లో ఇటీవల ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమై ప్రాణాలు కోల్పోయిన విషాదం మరువకముందే… మరోసారి తెలంగాణ రోడ్లు రక్తంతో తడిసి ముద్దయ్యాయి. ఈ రోజు తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో — తాండూరు నుంచి సుమారు 70 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వైపు బయలుదేరిన ఆర్టీసీ బస్సు ను — ఎదురుగా వచ్చిన కంకర లోడ్ చేసిన టిప్పర్ ఢీకొన్న ఘటనలో సుమారు 20 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘోరం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర దిగ్భ్రాంతి, ఆందోళనకు గురిచేసింది.
సంతాపం – విజ్ఞప్తి
ఈ ప్రమాద వార్త తెలియగానే మోడీతో సహా పలువురు, ముఖ్యమంత్రి, జాతీయ ,రాష్ట్ర స్థాయి నాయకులు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యసేవలు తక్షణం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి.
తీవ్రమైన ప్రశ్నలు
ఈ ఆర్టీసీ ప్రమాదానికి నిజమైన కారణం ఏంటి? ఎవరి నిర్లక్ష్యం? ఎక్కడ వైఫల్యం జరిగింది? ఈ ప్రశ్నలకు సాక్ష్యాధారాలతో సమాధానం వచ్చే వరకు ఈ ఘటన ప్రశ్నార్థకంగానే నిలుస్తుంది.
దర్యాప్తు – చర్యలు కావాలి
ఈ ప్రమాదానికి కారణమైన వారిపై పూర్తి స్థాయి నిష్పాక్షిక దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా — ప్రభుత్వం ప్రమాద ప్రాంతాలను గుర్తించి, రోడ్డు భద్రత చర్యలను అత్యవసరంగా బలపరచాలి.
రహదారి పనుల వివాదం
కొంతమంది నాయకులు ఈ రహదారి 2015-16 లోనే నేషనల్ హైవేగా మారాల్సి ఉన్నప్పటికీ కేసులు – పరిపాలనా అడ్డంకులు – నిర్లక్ష్యం కారణంగా పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఈ మార్గంలో వరుస ప్రమాదాలపై నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ స్పందన – కంట్రోల్ రూమ్
ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తున్నారు. సహాయక చర్యల పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా ఆరోగ్యశాఖను అప్రమత్తం చేశారు.
హెల్ప్‌లైన్ నంబర్లు:
9912919545
9440854433
https://www.tgsrtc.telangana.gov.in/
-BY VEERAMUSTI SATHISH,MAJMC
READ MORE:
