హైదరాబాద్: భారత క్రికెటర్ తిలక్ వర్మ ఆసియా కప్-2025 ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించిన తర్వాత, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు.
తన అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియాకు విజయాన్ని అందించిన తిలక్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి సత్కరించి, అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా తిలక్ వర్మ క్రికెట్ బ్యాట్‌ను ముఖ్యమంత్రికి బహూకరించారు. కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “తిలక్ వర్మ ప్రదర్శన తెలంగాణ యువతకు స్ఫూర్తి. క్రీడా రంగంలో ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల మద్దతు ఇస్తుంది,” అని పేర్కొన్నారు.
https://www.bcci.tv/international/men
-BY VEERAMUSTI SATHISH,MAJMC
యువ క్రికెటర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్ లో పాక్ పై భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన తిలక్ వర్మను సత్కరించి, అభినందించాను. క్రికెట్ బ్యాట్ ను ఆయన నాకు బహూకరించారు.
కార్యక్రమంలో మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శ్రీ శివసేనా రెడ్డి… pic.twitter.com/o8x5b9Eusc
— Revanth Reddy (@revanth_anumula) September 30, 2025

