హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా కొత్త ఏడాది కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు.
ప్రజాస్వామ్య పునరుద్ధరణ – గ్యారెంటీల అమలు
రాష్ట్రంలో నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించి ప్రజలకు స్వేచ్ఛ కల్పించామని సీఎం పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలలో రెండు ఇప్పటికే అమలవుతున్నాయని, మిగిలిన వాటిని త్వరలో అమలు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలని స్పష్టం చేశారు.
Thank you for reading this post, don't forget to subscribe!యువత, మహిళలు, రైతులకు హామీ
ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయనున్నట్లు చెప్పారు.
రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2025 సంవత్సరం **“రైతు – మహిళ – యువత నామ సంవత్సరం”**గా ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు.
అవినీతి పై చర్యలు – ఆర్థిక పునరుద్ధరణ
గత పాలనలో జరిగిన అవినీతి పై చర్యలు తీసుకుంటామని, ప్రజల సంపదను తిరిగి రాబడతామని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటికే విద్యుత్, ఆర్థిక రంగాలపై శ్వేతపత్రాలను విడుదల చేశామని, త్వరలో సాగునీటి రంగంలో అవినీతి పై వాస్తవాలు బయట పెడతామని చెప్పారు.
జర్నలిస్టులు, కార్మికుల సంక్షేమం
ఆటో కార్మికులు, అసంఘటిత కార్మికులకు ₹5 లక్షల బీమా పథకం ప్రవేశపెట్టామని, జర్నలిస్టుల సమస్యలు త్వరలో పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చారు.
తెలంగాణ భవిష్యత్ ఆకాంక్ష
“నా తెలంగాణ కోటి రతనాల వీణగా… కోట్లాది ప్రజల సంక్షేమ వాణిగా… అభివృద్ధిలో శిఖరాగ్రాన నిలవాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.