తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అదే ఉత్సాహంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి పట్టు నిలుపుకోనే దిశగా పావులు కదుపుతుంది. అందులో భాగంగా ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే విధానాన్ని అవలంబించింది. ఇప్పుడు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుంది.
ఈరోజు నుంచి ఫిబ్రవరి 3 వరకు అప్లికేషన్లను స్వీకరించనుంది. దీనికోసం గాంధీభవన్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది. జనరల్, బీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 50,000 గా పార్టీ నిర్ణయించింది. ఇక ఎస్సీ,ఎస్టీ,అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 25 వేలుగా నిర్ణయించింది.అప్లికేషన్ ఫీజును డీడీ రూపంలో చెల్లించాలని అభ్యర్థులకు పార్టీ సూచించింది. దరఖాస్తు ఫార్మ్స్ ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయని గాంధీభవన్ సిబ్బంది తెలిపారు. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీకి భారీగానే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.