హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారిణి, మాజీ డీఎస్పీ , ఆధ్యాత్మిక వేత్త నళిని తన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించడంతో తెలుగు రాష్ట్ర ప్రజలకు నళిని బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను “ఇది నా వీలునామా / మరణ వాంగ్మూలం” అంటూ ప్రారంభించారు.
ఆరోగ్య పరిస్థితి తీవ్రం
గత 8 ఏళ్లుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధితో పోరాడుతున్నానని, ఇటీవల డెంగ్యూ, చికెన్‌గున్యా, టైఫాయిడ్ కారణంగా పరిస్థితి మరింత విషమించిందని. “రాత్రి నిద్ర పట్టదు, మహామృత్యుంజయ మంత్రం జపిస్తూ కాలం గడుపుతున్నాను” అని నళిని రాశారు.
ఆధ్యాత్మిక మార్గం – వేద యజ్ఞ పరిరక్షణ సమితి స్థాపన
“ఉద్యమకారిణిగా, అధికారిణిగా, ఆధ్యాత్మిక వేత్తగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. 12 ఏళ్ల అజ్ఞాతవాసం అనుభవించాను. మహర్షి దయానంద ఆశ్రమం ద్వారా ఆధ్యాత్మిక మార్గం కనుగొన్నాను.”తన జీవితం గురించి నళిని ఇలా వివరించారు . తన ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా VYPS (వేద యజ్ఞ పరిరక్షణ సమితి) సంస్థను స్థాపించానని, దానివల్ల యజ్ఞ సంప్రదాయాన్ని ప్రజల్లో నిలబెట్టానని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
“నా ఆరోగ్య స్థితి అత్యంత ప్రమాదకర దశలో ఉంది. సరైన వైద్యం లేకుంటే బ్రతకడం కష్టమవుతుంది.
నా స్థితి కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరితేనే ప్రాణాపాయ స్థితి నుండి బయటపడగలను.”నళిని తన లేఖలో పేర్కొన్నది
మరణానంతర సూచనలు
“నా అంత్యక్రియలు వైదిక పద్ధతిలో జరగాలి. నన్ను ‘సస్పెండెడ్ ఆఫీసర్’గా కాకుండా ‘రిజైన్డ్ ఆఫీసర్, కవయిత్రి, యజ్ఞ బ్రహ్మ’గా గుర్తించాలి.” తన పేరుతో ఉన్న స్థలాన్ని VYPS ట్రస్ట్‌కి అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు. తన ఆశయాలను కొనసాగించేందుకు వేదామృతం ట్రస్ట్‌కు సహాయం చేయాలని నళిని తన లేఖలో స్పష్టంగా ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేశారు .
రాజకీయ నేతలపై కఠిన వ్యాఖ్యలు
నళిని తన బహిరంగ లేఖలో రాష్ట్ర నాయకులపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు –
“నేను బ్రతికున్నప్పుడు పట్టించుకోని వారు,
నేను చనిపోయాక రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు.”
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.
చివరి పిలుపు
తన లేఖ చివర్లో నళిని ఇలా పేర్కొన్నారు –
“నా ఆత్మ శాంతి కోసం యజ్ఞాలు నిర్వహించండి.
తెలుగు ప్రజలు ధర్మ మార్గంలో నడవాలి.”
https://www.tspolice.gov.in/jsp/homePage?method=getHomePageElements#
-BY VEERAMUSTI SATHIS,MAJMC
READ MORE :
https://prathipakshamtv.com/telangana-police-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b2%e0%b1%80%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b6%e0%b0%be%e0%b0%96%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ac/#google_vignette

