కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హరీష్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం పదవికి ₹5 వేల కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు.
“ఆ డబ్బు ఎక్కడ దాచి పెట్టారో వెలికితీయాలని నేను సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తాను,” అని జగ్గారెడ్డి ప్రకటించారు.
Thank you for reading this post, don't forget to subscribe!
ఇంతేకాదు, కవిత, సంతోష్ కూడా కొన్ని వేల కోట్లు బ్లాక్ చేశారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
బీఆర్ఎస్ అవినీతి బహిర్గతం అవుతుందని హెచ్చరిక
“బీఆర్ఎస్ హయాంలో అవినీతి చేసిన ఒక్కరినీ వదిలిపెట్టం. అందరి భాగోతం బయట పెడతాం. ఇది ఆరంభం మాత్రమే,” అని వార్నింగ్ ఇచ్చారు.
హరీష్ రావుపై తీవ్రమైన వ్యాఖ్యలు
“హరీష్ రావు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏతులు, ఇప్పుడు అపొజిషన్లో ఉన్నప్పుడు నీతులు చెబుతున్నాడు. అతను పాపాల భైరవుడు, పెద్ద డ్రామా ఆర్టిస్ట్,” అని వ్యాఖ్యానించారు.
“రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూలు చేస్తుంటే హరీష్ రావుకు నిద్ర పట్టడం లేదు,” అని వ్యంగ్యంగా అన్నారు.
కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు
జగ్గారెడ్డి మరింత ముందుకెళ్లి —
“బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల సొమ్ము కేసీఆర్ అనుభవించాడు. గత ప్రభుత్వ తప్పులన్నీ బయట పెడతాం. కేసీఆర్ కుటుంబంపై ఐటీ, ఈడీ దాడులు జరగవు ఎందుకంటే కిషన్ రెడ్డి సైలెంట్ మినిస్టర్,” అని విమర్శించారు.
“కిషన్ రెడ్డికి పౌరుషం లేదు కానీ రేవంత్ రెడ్డికి ఉంది కాబట్టి ఆయన బీఆర్ఎస్ నేతలను పిసికేస్తున్నారు,” అని అన్నారు.
రాజకీయ విశ్లేషణ
జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పోలిటికల్ టెంపరేచర్ పెంచాయి.
హరీష్ రావు మరియు బీఆర్ఎస్ నాయకత్వం నుంచి దీనిపై స్పందన రాబోతుందా అనేది ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారింది.
-BY VEERAMUSTI SATHISH,MAJMC
https://brsonline.in/history/
READ MORE :
సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
బీజేపీ సీనియర్ నేత చెర్క మహేష్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక
