నల్లగొండ జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు అని ఇక్కడ కుర్చీ వేసుకుని ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తానని మాట తప్పాడు.కాబట్టి ముక్కు నేలకు రాసి ఇక్కడి ప్రజలకు క్షమాపణలు తరువాతే కేసీఆర్ నల్లగొండలో అడుగుపెట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.ఈ నెల 13న కేసీఆర్ నల్లగొండ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపడుతామని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ను విమర్శించేటోళ్లు అందరూ మూర్ఖులు అని
మండి పడ్డారు.మాజీ మంత్రులు హరీశ్ ,కేటీఆర్ పనికిరాని లీడర్లు అని వారిపై విరుచుకుపడ్డారు.
రాష్ట్ర విభజన తర్వాత నీటి కేటాయింపు
లకు అంగీకరించింది,నల్లగొండను నట్టేట
ముంచిన ఘనత గత ప్రభుత్వానిదే అని ప్రజలు బీఆర్ఎస్ మోసాన్ని గుర్తించారు కాబట్టే భారీ మెజార్టీలతో వారిని ఓడగొట్టారనీ ప్రజల తీర్పు చూశాక కూడా కేసీఆర్
ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వస్తున్నారు అని నిలదీశాడు.