జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయం ఇంకా కాస్త చల్లబడకముందే… పక్కనే ఉన్న ఖైరతాబాద్ లో రాజకీయ ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటం ఖాయం అన్న ప్రచారం, లేక అంతకంటే ముందే ఆయన రాజీనామా చేసే అవకాశాలు—ఈ రెండు టాక్‌లు ఇప్పుడు గల్లీ నుంచి సోషల్ మీడియా వరకూ రెచ్చగొడుతున్నాయి.
ఒక్కసారిగా ఖైరతాబాద్ ఉపఎన్నిక అనేది పార్టీలకు ప్రతిష్ట పరమైన విషయం అయింది. “ఇది వస్తే గెలవాలి… తప్పనిసరిగా గెలవాలి” అన్న పట్టుదలతో అన్ని పార్టీలూ ఇప్పటికే లోపలా లెక్కలు వేసుకుంటున్నాయి.
బీఆర్ఎస్ టికెట్ కోసం రేసు మొదలైంది!
1. పీజేఆర్ తనయుడు విష్ణు వర్ధన్ రెడ్డి
ఒకప్పుడు ఖైరతాబాద్… తర్వాత రీ-డిలిమిటేషన్ తర్వాత జూబ్లీహిల్స్ నుంచి గెలుపొందిన విష్ణు, 2023లో టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో టికెట్ రాకపోయినా… ఖైరతాబాద్ ఉపఎన్నిక వస్తే బిగ్ కాంటెండర్ గా ఆయన పేరే ముందుంది. పీజేఆర్ పట్ల ఉన్న అభిమానాన్ని క్యాష్ చేసుకోవచ్చని గులాబీ బాస్ కూడా ఆలోచిస్తున్నారనే సమాచారం.
2. మన్నె గోవర్ధన్ రెడ్డి – కుటుంబం అంతా రేసులోనే!
2014లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిన మన్నె గోవర్ధన్ రెడ్డి ఈసారి టికెట్ తనకే కావాలంటున్నారు.
అది సాధ్యంకాకపోతే, తన భార్య మన్నె కవిత—ప్రస్తుతం జీహెచ్ఎంసీ కార్పొరేటర్—కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని తెలుస్తోంది.
2018, 2023లో దానం నాగేందర్ కు సీటు వదిలినందుకు ఇప్పుడు తమకు న్యాయం చేయాలన్నదే వారి వాదన.
3. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ – బీసీ కార్డ్
బీసీ సమీకరణ కీలకమవుతుందని భావిస్తున్న బీఆర్ఎస్, దాసోజు శ్రవణ్ పేరును కూడా సీరియస్‌గా పరిశీలిస్తోంది.
గతంలో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పోటీ కూడా చేశారు.
ఇంకా తెరమీద పేర్లు… ఇంకా అంతర్గత లెక్కలు
ఇవి కాక ఖైరతాబాద్ బీఆర్ఎస్ టికెట్ కోసం మరికొందరు కూడా తమ వర్గాల బలం చూపిస్తున్నారు.
అంతేకాదు సోషల్ మీడియాలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ పేరూ వైరల్ అవుతోంది.
“బీసీ బలమైన అభ్యర్థి కావాలి” అంటూ ప్రచార పోస్టులు కొన్ని పంచుకుంటున్నారు.
మొత్తానికి…
అనర్హత వేటు పడుతుందా? లేక ముందుగానే ధన నాగేందర్ రాజీనామా చేస్తారా? ఏం జరిగినా ఖైరతాబాద్ రాజకీయాలు వచ్చే వారాల్లో హీట్ పెంచడం ఖాయం.
ఎవరు బీఆర్ఎస్ అభ్యర్థి? ఎవరికి టికెట్? ఎవరు ఫేవరెట్?
ఇవన్నీ ఇప్పుడు ప్రజలకంటే ఎక్కువగా పార్టీలు ఆలోచిస్తున్నాయి.
ఉపఎన్నిక వచ్చి నోటిఫికేషన్ పడే సమయానికి…
ఏ పేరు ఫైనల్ అవుతుందో?
ఎవరి జెండా ఎగురుతుందో?
అదే ఖైరతాబాద్ హాట్ టాపిక్!

