మణుగూరు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై జరిగిన దాడి, దహనం ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడికి కాంగ్రెస్ పార్టీ గూండాలు కారణమని ఆయన ఆరోపించారు.
ఈ విషయం తెలిసిన వెంటనే కేటీఆర్, జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావుతో ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. మణుగూరు బీఆర్ఎస్ కార్యకర్తలకు ధైర్యం చెప్పిన కేటీఆర్ – 60 లక్షల బీఆర్ఎస్ కుటుంబం మీతోనే ఉంది” అని హామీ ఇచ్చారు. త్వరలోనే మణుగూరుకు వస్తానని కూడా కేటీఆర్ తెలిపారు.
కేటీఆర్ మాట్లాడుతూ – కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయిందని విమర్శించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకు ప్రతి చోటా అరాచక వాతావరణం నెలకొనిందన్నారు. ఈ పరిస్థితికి త్వరలోనే ముగింపు పలకాల్సిన రోజు దగ్గరపడుతోందని పేర్కొన్నారు. దాడిని ఖండించిన కేటీఆర్, కాంగ్రెస్ నేతల రౌడీ మూకలకు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ శ్రేణులు తెగువగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
-BY VEERAMUSTI SATHISH,MAJMC
READ MORE:

