శామీర్పేట చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత, ఎంపీ ఈటెల రాజేందర్ మత్స్యరంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం మరింత సీరియస్గా పనిచేయాలని సూచించారు.
చేపలు ఆరోగ్యానికి అత్యవసరమైన ప్రోటీన్ అందించే ఆహారమని, కోట్లాది మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని ఆయన అన్నారు. గతంలో కాంట్రాక్టర్ల ఆధిపత్యం వల్ల మత్స్యకారులు నష్టపోయారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సొసైటీ సభ్యులకే చేపలు పట్టి అమ్మే హక్కులు ఇచ్చామని గుర్తు చేశారు.
చేప పిల్లలు, ఫీడ్, మేనేజ్మెంట్, ఐస్ఫ్యాక్టరీలు, ట్రాన్స్పోర్ట్ వంటి అంశాల్లో సమగ్ర ప్రణాళిక అమలు చేస్తున్నప్పటికీ, ఇంకా కొన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించాల్సి ఉందని చెప్పారు.
నగర చెరువుల్లో కాలుష్యం పెరుగుతోంది
హైదరాబాద్ పరిసరాల్లో చెరువులు మురికి కూపాలుగా మారుతున్నాయన్న ఆందోళన వ్యక్తం చేసిన ఈటెల రాజేందర్,
“డ్రైనేజీ నీటిని నేరుగా చెరువుల్లోకి పంపకూడదు. శుద్ధి చేసి పంపాలి లేదా డైవర్ట్ చేయాలి. చెరువులు మనకు వరం… వాటిని కాపాడాలి” ఈటెల రాజేందర్ అన్నారు.
కేంద్ర ప్రాధాన్యత గుర్తు చేసిన ఈటెల
మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా Fisheries మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ దిశాబద్ధతను ప్రశంసించారు. మత్స్యకారుల సొసైటీలకు ప్రభుత్వ భూములు కేటాయిస్తే, వాటికి భవనాల నిర్మాణ బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు.
“ప్రభుత్వం వేరుగా ఉండదు. ప్రజలే ప్రభుత్వం” అని ఈటెల రాజేందర్ అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు:
డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ హనుమంత్ రావు, జిల్లా ఫిషరీస్ అధికారి సుకృతి, జిల్లా డి.ఎఫ్.సి.ఎస్ అధ్యక్షులు మన్నే రాజు, ఉపాధ్యక్షులు మోహన్ కృష్ణ, డైరెక్టర్ యం. వెంకటేష్, పి. దేవేందర్, రాము, ఎఫ్.సి.ఎస్ శామీర్పేట్ అధ్యక్షులు రాజు, డీ.ఎఫ్.ఓ శ్రీకాంత్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మండల అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, మాజీ సర్పంచ్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
https://medchal-malkajgiri.telangana.gov.in/tourist-place/shamirpet-lake/
By Veeramusti Sathish
Editor – Prathipaksham TV
READ MORE:
Panchayat Elections 2025: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు
BJP Telangana Meeting Sparks Backlash Over BC Representation

