వరిసాగు చేయాలంటే ముందుగా నారు పోసి 30 రోజులు అయ్యాక వరి నాటు వేయడం. చాలా మంది ఇదే పద్ధతిని అనుసరించేవారు. ఈ పద్ధతులు సాగు చేయాలంటే ఎకరాకి 6 నుండి 8 వేల రూపాయల ఖర్చు పైగా ఇప్పుడు కూలీల కొరత తీవ్రంగా ఉండడంతో రైతులు వినూత్న పద్ధతిలో సాగు చేస్తున్నారు. వడ్లను వెదజల్లే పద్ధతిని అనుసరిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని సాధిస్తున్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!సాధారణ పద్దతిలో సాగు చేయాలంటే.. నాటు వేయడానికి 1 ఎకరాకు 25 కేజీల విత్తనాలు కావాలి. 12 నుండి 14 మంది నాటు కూలీలు అవసరం ఉంటుంది దీనికి 6000 నుండి 8000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ పద్ధతి ద్వారా సాగు చేస్తే ఎకరాకు 20-30 క్వింటాల దిగుబడి వరకు వస్తుంది.
వెదజల్లే పద్దతిలో ఒక ఎకరాకు 12 కేజీల విత్తనాలు సరిపోతుంది . పైగా ఎక్కువగా కూలీల అవసరం ఉండదు. ఈ పద్దతిలో సాగు చేస్తే వడ్లు వెదజల్లిన తరువాత పొలం మడి నుండి నీరు తీసివేయాల్సి ఉంటుంది. ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.పూర్వకాలం ఈ పద్దతిలోనే సాగు చేసే వారు.