వరిసాగు చేయాలంటే ముందుగా నారు పోసి 30 రోజులు అయ్యాక వరి నాటు వేయడం. చాలా మంది ఇదే పద్ధతిని అనుసరించేవారు. ఈ పద్ధతులు సాగు చేయాలంటే ఎకరాకి 6 నుండి 8 వేల రూపాయల ఖర్చు పైగా ఇప్పుడు కూలీల కొరత తీవ్రంగా ఉండడంతో రైతులు వినూత్న పద్ధతిలో సాగు చేస్తున్నారు. వడ్లను వెదజల్లే పద్ధతిని అనుసరిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని సాధిస్తున్నారు.
సాధారణ పద్దతిలో సాగు చేయాలంటే.. నాటు వేయడానికి 1 ఎకరాకు 25 కేజీల విత్తనాలు కావాలి. 12 నుండి 14 మంది నాటు కూలీలు అవసరం ఉంటుంది దీనికి 6000 నుండి 8000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ పద్ధతి ద్వారా సాగు చేస్తే ఎకరాకు 20-30 క్వింటాల దిగుబడి వరకు వస్తుంది.
వెదజల్లే పద్దతిలో ఒక ఎకరాకు 12 కేజీల విత్తనాలు సరిపోతుంది . పైగా ఎక్కువగా కూలీల అవసరం ఉండదు. ఈ పద్దతిలో సాగు చేస్తే వడ్లు వెదజల్లిన తరువాత పొలం మడి నుండి నీరు తీసివేయాల్సి ఉంటుంది. ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.పూర్వకాలం ఈ పద్దతిలోనే సాగు చేసే వారు.