హైదరాబాద్, జూన్ 2: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల పోలీస్ స్టేషన్ నుండి ఈ రోజు జర్నలిస్ట్ సతీష్ కు కాల్ వచ్చింది..దీంతో సతీష్ ఎవరు మీరు అని అడగ్గా సంబంధిత పోలీస్ తమ పేరు , హోదా తెలియజేయకుండానే ఎందుకు మీకు అని సమాధానం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి కాల్ రికార్డు ఇప్పుడు వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే..2019 లో జరిగిన ఓ కీలకమైన కేసులో బాధితుడిగా ఉన్న ప్రతిపక్షం టీవీ సంపాదకులు, జర్నలిస్టు సతీష్ గారు, తాజాగా ఒక పోలీసు నుండి ఫోన్ కాల్‌ను అందుకున్నారు. అతని మాటల్లో — “మీ మీదే కేసు ఉంది, కోర్టుకు హాజరు అవ్వాలి” అన్న మాటలు వినిపించాయి. అయితే అందుబాటులో ఉన్న ఎఫ్ఐఆర్, ఛార్జ్‌షీట్ కాపీలలో స్పష్టంగా సతీష్ గారే ఫిర్యాదుదారుడిగా ఉన్నారు. బాధితుడిగా ఉన్న వ్యక్తిని నేరుగా నిందితుడిగా అభివర్ణించిన ఈ వ్యవహారం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
సతీష్ స్పందన:
“నేనే బాధితుడిని, నామీద కేసు ఉంది అనడం ఇది అత్యంత బాధాకరం. ఇది చట్ట ప్రక్రియను అపహాస్యం చేయడమే కాకుండా, బాధితులపై మానసిక ఒత్తిడిని కలిగించే చర్య” అని సతీష్ పేర్కొన్నారు.
వైరల్ వీడియో:
ఈ ఘటనకు సంబంధించిన కాల్ రికార్డింగ్ ఆధారంగా రూపొందించిన వీడియోను ప్రతిపక్షం టీవీ తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసింది. వీడియోలో పోలీస్ మాట్లాడిన విధానం, బాధితుడిగా ఉన్న వ్యక్తిపై అనవసరమైన ఒత్తిడి ఎలా చూపించబడిందో స్పష్టంగా వినిపిస్తోంది. అంతేకాదు విధి నిర్వహణలో పోలీస్ నిర్లక్ష్యం ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ప్రజా స్పందన:
ఈ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో స్పందన భారీగా వచ్చింది. “ఇలాంటి సంఘటనలు పోలీస్ వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోతున్నాయంటూ” పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు.
call recording proof citizen journalism FIR victim fir vs charge sheet Journalist Sathish Legal Awareness police called victim accused police complaint police harassment police misconduct police misuse prathipaksham TV rti activist sathish sp complaint telangana constable Telangana News Telangana police telugu news channel telugu viral video victim rights victim turned accused voice for victims witness rights india