ఐదు గ్యారెంటీ హామీల పథకాల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.ఇది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కొనసాగింది.దీంతో కోట్లల్లో దరఖాస్తులు వచ్చాయి.వీటి కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం. ప్రస్తుతం ఈ దరఖాస్తులు అన్నింటిని కంప్యూటరీకరించే కార్యక్రమం పూర్తి కావస్తుంది. అయితే ఈ ప్రజా పాలన వెబ్సైట్లో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం.
ప్రజాపాలన వెబ్సైట్లోలో దరఖాస్తు స్థితిని తెలుసుకునేందుకు ‘KNOW YOUR APPLICATION STATUS’ అనే ఆప్షన్ తీసుకొచ్చింది ప్రభుత్వం. దీనిపై క్లిక్ చేస్తే.. అప్లికేషన్ నంబర్ Online అని కనిపిస్తోంది. దీంట్లో దరఖాస్తుదారుని ఆప్లికేషన్ నెంబర్ ఎంట్రీ చేసి కింద Captcha ను పూర్తి చేయాలి.ఆ తర్వాత ‘View Status’ ఆప్షన్ పై క్లిక్ చేస్తే దరఖాస్తు స్థితి కనిపిస్తుంది.
ఇంతవరకు బాగానే ఉంది. ఇక అసలు విషయానికొస్తే ఐదు గ్యారంటీల పథకాల దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ స్టేటస్‌ను తెలుసుకోవడానికి ప్రజా పాలన పోర్టల్ లోకి వెళితే .. అక్కడ అప్లికేషన్ నెంబర్ ఆప్షన్ మాత్రమే పనిచేస్తుంది captcha అనే ఆప్షన్ పనిచేయడం లేదు.గత రెండు మూడు రోజులుగా దరఖాస్తుదారులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ దరఖాస్తుల డేటా ఎంట్రీ ఎప్పుడు పూర్తవుతుంది..లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడు చేస్తారు..ఈ పథకాల అమలుపై తెలంగాణ ప్రజానీకం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.