హైదరాబాద్, అక్టోబర్ 31 (ప్రతిపక్షం న్యూస్): తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా ఎమ్మెల్యే శ్రీ కె. ప్రేమ్ సాగర్ రావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు జారీ చేసిన జి.ఓ. ఆర్.టి. నం.1503, తేదీ 31-10-2025 ప్రకారం, ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి స్థాయి హోదా (Cabinet Minister Status) కల్పించారు. ఈ మేరకు సివిల్ సప్లైస్, ఫుడ్ & కన్జ్యూమర్ అఫైర్స్ శాఖ తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ నియామకంతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో కీలక బాధ్యతలు చేపట్టనున్న ప్రేమ్ సాగర్ రావు, రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, పౌర సరఫరాలు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ వంటి అంశాల పర్యవేక్షణలో ముఖ్య పాత్ర పోషించనున్నారు.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఈ నియామకం ద్వారా సివిల్ సప్లైస్ రంగంలో మరింత పారదర్శకత, సమర్థత తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతులకు సమయానికి చెల్లింపులు, రేషన్ పంపిణీ విధానంలో సంస్కరణలు వంటి అంశాలకు కొత్త చైర్మన్ ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ప్రేమ్ సాగర్ రావు నియామక ఉత్తర్వులు జారీ కావడంతో ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
https://civilsupplies.telangana.gov.in/aboutus.aspx
By Veeramusti Sathish
M.A. (Journalism & Mass Communication), M.A. (Political Science)
Independent Digital Journalist & RTI Activist | Founder – Prathipaksham TV
READ MORE :

