తెలంగాణ రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకంపై చివరకు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పథకం అమలుపై అనేక ఊహాగానాలు, అనుమానాలకు తెరపడింది.
ఎంత భూమి సాగు చేస్తే అంత భూమికి భరోసా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రైతు ఎంత భూమిని సాగు చేసుకుంటే అంత భూమికి రైతు భరోసా వర్తిస్తుందని స్పష్టం చేశారు.
“సాగు భూములకు ఎటువంటి సీలింగ్ లేదు. ప్రతి రైతుకు ప్రతి ఏడాది ₹12,000 రైతు భరోసా ఇవ్వబడుతుంది,” అని తెలిపారు.
ఏ భూములకు రైతు భరోసా రాదు
ఈ పథకం వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే వర్తిస్తుంది. క్రింది భూములకు రైతు భరోసా వర్తించదు:
రాళ్లు, గుట్టలు, రోడ్ల నిర్మాణంలో కోల్పోయిన భూములు
మైనింగ్ లేదా రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం ఇచ్చిన భూములు
పరిశ్రమలు, నాలా కన్వర్టెడ్ భూములు
ప్రభుత్వం సేకరించిన లేదా పబ్లిక్ పర్పస్ కోసం తీసుకున్న భూములు
ఈ వివరాలను రెవెన్యూ అధికారులు గ్రామ సభల్లో ప్రజలకు వివరించనున్నారని తెలిపారు.
దరఖాస్తులు లేకుండానే రైతు భరోసా
రైతు భరోసా కోసం ఎటువంటి దరఖాస్తు అవసరం లేదు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం ప్రకారం, ఇప్పటికే ఉన్న వ్యవసాయ భూమి రికార్డుల ఆధారంగా రైతులకు నేరుగా నిధులు జమ అవుతాయి.
రైతు బంధుతో పోలిస్తే మరింత లాభదాయకం
గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ప్రతి ఏడాదికి ఎకరాకు ₹10,000 చెల్లిస్తే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ₹12,000 ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. ఇది రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం” అని ఆయన అన్నారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా :
భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” కింద ₹12,000 అందజేయనున్నారు. రైతు భరోసా మరియు ఇందిరమ్మ భరోసా పథకాలు ఈ నెల 26 అక్టోబర్ 2024 నుండి అమల్లోకి రానున్నాయని వెల్లడించారు.
ప్రభుత్వం స్పష్టత
రైతులు లేదా భూమి యజమానులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. అర్హులైన ప్రతి రైతుకూ మద్దతు అందిస్తాం; వ్యవసాయం యోగ్యమైన భూమికి మాత్రమే రైతు భరోసా వర్తిస్తుందిని సీఎం తెలిపారు.
ఏడాదికి ₹12,000 రైతు భరోసా
భూమి సీలింగ్ లేదు
అర్హులైన రైతులకు ఆటోమేటిక్ నిధులు
అక్టోబర్ 26 నుండి పథకం అమలు
ఇందిరమ్మ భరోసా కూడా ప్రారంభం
https://www.rythubharosa.telangana.gov.in/ContactUs.aspx
By Veeramusti Sathish
M.A. (Journalism & Mass Communication), M.A. (Political Science)
Independent Digital Journalist & RTI Activist | Founder – Prathipaksham TV
READ MORE:
రైతు భరోసా ఎప్పుడు..? కాంగ్రెస్ హామీపై రైతుల ఆవేదన
Runamafi: తెలంగాణ రైతు రుణమాఫీ అమలుపై వేగం

