అధికారంలోకి వస్తే ఏక కాలంలో అప్పు,వడ్డీ కలిపి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు మేనిఫెస్టోలోనూ ప్రకటించింది.అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు.
అయితే దీనిపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొందరు నేతలే తలో మాట మాట్లాడుతున్నారు.రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి అని ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నేను చెప్పింది అలా కాదు అని వివరణ ఇస్తు తెల్లారే మరొక ప్రెస్ మీట్ పెడుతున్నారు.
ఇక భిక్కనూరు సింగిల్ విండో చైర్మన్ గంగల భూమయ్య మాట్లాడుతూ..వ్యవసాయ అవసరాల కోసం తీసుకున్న లోన్లను రైతులు సకాలంలో చెల్లించాలని పేర్కొన్నారు.అంతేకాదు స్వల్పకాలిక,దీర్ఘకాలిక రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించని వారికి డిమాండ్ నోటీసులు ఇవ్వాలని ఆ సమావేశంలో తీర్మానం చేశారు. అయితే ఈ ప్రకటన ఈయనే చేశాడా..? ప్రభుత్వంలోని పెద్దలు చేయించారా ..? అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇలాంటి ప్రకటనల వల్ల రుణగ్రస్తులపై బ్యాంకర్లు మరింత ఒత్తిడి తెస్తున్నారు. అయితే ప్రభుత్వం చెప్తుంది ఒకటి చేస్తుంది మరొకటి అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.