కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల పథకాలలో ప్రధానమైనది రైతు భరోసా పథకం. ఈ పథకం కింద ఏటా రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం, ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం,వరి పంటకు అదనంగా రూ.500 బోనస్.
Thank you for reading this post, don't forget to subscribe!అయితే రైతు భరోసా పథకం అనేది పంట సాగుకు ముందు ప్రభుత్వం రైతులకు ఇచ్చే ఆర్థిక సహాయం, ఇది రైతులు సాగు పనులు చేసుకోవడానికి ఉపయోగించుకునేది..రైతులు ఖరీఫ్ పంట సాగు చేసి మూడు నెలలు ఇప్పటికే గడిచిపోయింది..రైతులు పెట్టుబడి కోసం అప్పో సప్పో చేసి పంట సాగు చేశారు. వ్యాపారస్తుల దగ్గర తెచ్చిన అప్పు అధిక వడ్డీలతో మోత మోగిపోతుంది..ఈ ఖరీఫ్ పంట చేతికి రావాలంటే ఇంకా ఎకరాకు సుమారు 15 వేల నుంచి 20 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.. అయితే ఖరీఫ్ సీజన్ మొదట్లో రైతు భరోసా నిధులు అమలు ఇదిగో అదిగో అంటూ ఊరించారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఆ ఊసే ఎత్తడం లేదు. అతివృష్టి వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం దానిపై కూడా స్పష్టత లేదు..తెలంగాణ రైతాంగం పరిస్థితి ఇలా ఉంటే.. మీ చావు మీరు చావండి అనే చందంగా ఉంది ప్రభుత్వ వైఖరి. రుణమాఫీ ప్రక్రియే మొత్తం పూర్తి కాలేదు ఇంకా రైతు భరోసా నిధులు ఎప్పుడు ఇస్తారని తెలంగాణ రైతాంగం వాపోతున్నారు.