రాజయ్యపేట పర్యటనకు అనుమతి నిరాకరణపై రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పోలీసులు అణగదొక్కుతున్నారని తాను రాజయ్యపేట లో జరగనున్న ఉద్యమంలో పాల్గొనకుండా అడ్డుకోవడానికి పోలీసులు రాజకీయ పక్షపాతం చూపుతున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో టిడిపి, వైసిపి తప్ప ఇతర రాజకీయ ఉద్యమాలకు అనుమతి ఉండదా?” అని ప్రశ్నించారు.
శనివారం ఢిల్లీ నుంచి విశాఖ ఎయిర్పోర్టుకి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట లో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు.
హైకోర్టు ఆదేశాలు ఉన్నా… పోలీసులు తమే చట్టమన్నట్టు వ్యవహరిస్తున్నారు”
రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ:
“హైకోర్టు నాకు రాజయ్యపేట పర్యటనపై స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది.
10వ తేదీ లోపు నిర్ణయం తెలియజేయాలని కోర్టు చెప్పింది.
అయితే పోలీసులు 11వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు.
పుంగనూరులో నా ఇంటికి నోటీసులు అతికించడం ఏమిటి?
ఢిల్లీ ఎయిర్పోర్టుకే పోలీసులు నోటీసులు ఇవ్వడానికి రావడం ఏ న్యాయం?” అని ప్రశ్నించారు.
ఆయన వ్యాఖ్యానంలో వ్యవస్థ పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తమైంది.
నా మీద కేసులున్నాయా? జగన్ మీద లేవా?” – రామచంద్ర యాదవ్ ప్రశ్న
పోలీసులు తన రాజయ్యపేట పర్యటనకు నిరాకరించడానికి చూపిన కారణాలపై ఆయన మండిపడ్డారు. నా మీద 13 కేసులు ఉన్నాయని నోటీసుల్లో రాశారు. నిజానికి వాటి సంఖ్య 28. అవి అన్నీ తప్పుడు కేసులే. ఈ విషయాన్ని అసెంబ్లీలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా ప్రకటించారు. ఇదే రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డిపై కూడా పలు కేసులు ఉన్నాయి. అయితే ఆయనకు పర్యటనకు ఎలా అనుమతి ఇచ్చారు? చట్టం జగన్కు వేరేనా? నాకు వేరేన?” అని ప్రశ్నించారు.
పోలీసులు రాజ్యాంగాన్ని పక్కనబెట్టి వైసిపి ప్రభుత్వానికి సేవ చేస్తున్నారు”
“అనకాపల్లి పోలీసులు హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారు.
రాష్ట్రంలో పోలీసులు ఒకటే రాజ్యాంగం రాసుకున్నారు – అది టిడిపి, వైసిపి పార్టీలకే సేవ చేయడం.
ప్రజలకు న్యాయం కోరే వారిని అడ్డుకోవడం ఈ ప్రభుత్వ విధానం అయింది.” అని ఆరోపించారు.
రాజయ్యపేట లో అడుగుపెడుతా – ఈ పోరాటం ఆగదు”
రామచంద్ర యాదవ్ స్పష్టంగా ప్రకటించారు:
✅ “మత్స్యకారుల హక్కుల కోసం పోరాడుతున్నా
✅ రాజయ్యపేట లో తప్పకుండా పర్యటిస్తా
✅ మళ్లీ హైకోర్టుకు వెళ్తా
✅ అవసరమైతే పోలీసుల వ్యవహారంపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తా
✅ బీసీవై పార్టీ పోరాటం ఆగదు”
ప్రజల కోసం.. ప్రశ్నించే స్వరంగా నిలుస్తా:
రామచంద్ర యాదవ్ భావోద్వేగంగా .. ఈ పోరాటం కేవలం నా కోసం కాదు. మత్స్యకారుల కోసం – వారి బతుకుల కోసం. రాజయ్యపేటలో కెమికల్ ఫ్యాక్టరీ వస్తే ప్రజల ఆరోగ్యం నాశనం అవుతుంది. పర్యావరణం బూడిదవుతుంది. ప్రజ వాళ్ల జీవన పోరాటానికి పక్కన నిలబడటం నా బాధ్యత.”
ప్రజాస్వామ్యానికి పరీక్షలా మారిన ఈ పోరాటం
ఒక్క వ్యక్తికి అనుమతులు నిరాకరించడం, హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడం, ఢిల్లీ వరకు వెళ్లి నోటీసులు అందించడం – ఇవన్నీ ఈ వ్యవస్థ ఎటు దూసుకెళ్తుందో చూపిస్తున్నాయి. ప్రశ్నించే స్వరం ఎక్కుడుపడితే అక్కడే కేసులు – ఇదే రాష్ట్ర రాజకీయ వాస్తవం అవుతుందేమో అన్న ఆందోళన పెరుగుతోంది.
https://aphc.gov.in/aboutus.php?abt=hc
-BY VEERAMUSTI SATHISH,MAJMC
READ MORE :
https://prathipakshamtv.com/bode-ramachandra-yadav-nakili-madyam-mafia/
https://prathipakshamtv.com/bode-ramachandra-yadav-detention-rajahmundry-police-controversy/
